భద్రత చర్యలో భాగంగా ప్రముఖ ఆలయాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు.
భద్రత చర్యలో భాగంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలలో సమగ్ర తనిఖీలు.
(అంకం భూమయ్య)
గొల్లపల్లి ఆగస్టు 13 (ప్రజా మంటలు):
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడం కోసం ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో, నేడు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో,కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో డాగ్ స్క్వాడ్ మరియు బాంబ్ డిస్పోజల్ (BD) టీమ్ సహకారంతో భద్రతా తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సమయంలో ఆలయ ప్రధాన ద్వారం , మండపాలు, భక్తుల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ స్థలాలు, వసతి గృహాలు మరియు పరిసర ప్రాంతాలను ఒక్కొక్కటిగా పరిశీలించారు.అనుమానాస్పద వస్తువులు, ప్యాకేజీలు, సంచులు లేదా భద్రతకు ముప్పు కలిగించే అంశాలఫై ప్రత్యక తనికి నిర్వహించారు.భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని తనికిలు నిర్వహించారు
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.... ముఖ్యమైన ఆలయాలు, పుణ్యక్షేత్రాలు, పండుగలు మరియు ప్రత్యేక రోజుల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయడం జరుగుతుందని అన్నరు. ప్రజల సహకారంతోనే భద్రతా చర్యలు సమర్థవంతంగా కొనసాగుతాయని అన్నారు.
ఎవరైనా అనుమానాస్పద వస్తువులు, వాహనాలు లేదా వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా 100 నంబర్ కి సమాచారం ఇవ్వాలని ఎస్పి అశోక్ కుమార్ సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గోదావరి నది నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన ఇద్దరు పోలీస్ అధికారులు

ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షుల నియామకం
.jpg)
కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ సతీమణి కన్నుమూత

గోదావరి నదిని సందర్శించిన జిల్లా కలెక్టర్,

జిల్లా బీజేపీ ప్రధానకార్యదర్శి గా వడ్డేపల్లి శ్రీనివాస్

కన్నులపండువగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందడి

కిమ్స్ లో న్యూరోమస్క్యులార్ ఫెసిలిటేషన్ వర్క్ షాప్

వర్షకొండలో హైమస్ లైట్ కోసం భూమి పూజ
.jpg)
తెలంగాణ వాస్తవ చరిత్రను భావితరాలకు అందించాలి - చిన్నారెడ్డి, ఓవైసీ
.jpg)
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో చిన్నారుల సందడి
