అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రీ మదష్టాదశ ప్రవచన జ్ఞాన యజ్ఞం
జగిత్యాల సెప్టెంబర్ 9 ( ప్రజా మంటలు)
శ్రీమదష్టాదశ పురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో ఆగస్టు 30వ తేదీ నుండి పది రోజులపాటు కొనసాగుతుండగా మంగళవారం లింగ పురాణమును బ్రహ్మశ్రీ బుర్ర భాస్కర శర్మ చే పురాణ ప్రవచనం అంగరంగ వైభవంగా కొన సాగింది.
ఈనెల 16వ తేదీతో పురాణ ప్రవచనం ముగియనుంది. రోజు ఒక్కో పురాణం చొప్పున పురాణాలను భాస్కర శర్మ చే కొనసాగనుంది. ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుండి 7 గంటల వరకు ప్రవచనం కొనసాగుతున్నది.
కాగా మంగళవారం పురాణ ప్రవచనం గురించి సామపుష్పలత, బట్టు కరుణ ,ఎర్ర రమ తదితరులు తమ స్పందనను తెలియజేశారు 18 పురాణాలను ఒకే వేదికపై నుండి ప్రతినిత్యం 18 రోజులపాటు వినే భాగ్యం కలగడం తమ అదృష్టంగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. సులభతరంగా పామరు లకు సైతం అర్థమయ్యే రీతిలో ఉపమానాలతో శర్మగారు ప్రవచించిన తీరు కళ్ళకు కట్టినట్లుగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమ సమన్వయకర్తగా పాంపాటి రవీందర్ వ్యవహరించారు.
ఆద్యంతం ప్రవచనం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమానంతరం సహస్ర లింగాల దేవాలయ నిర్వాహకులు నలమాసుగంగాధర్ కొయ్యాడ రమేష్ లకు శర్మ గారి కర కమలములచే శేష వస్త్ర ప్రసాదం అందజేశారు. నలమాసు గంగాధర్ శంక నాదం, మంగళహారతి, మంత్రపుష్పంతో కార్యక్రమం ముగిసింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
