వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.
దేశ విదేశాల్లో సంప్రదాయ ఆచరణలు
(రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494)
గాయత్ర్యాః పరం మంత్రం నమాతుః పరదైవతమ్ అనునది సుప్రసిద్ధమైన వృద్ధ వచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గాయత్రి అనే పదము 'గయ', 'త్రాయతి' అను పదములతో కూడుకుని ఉంది. "గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరుల వారు తన భాష్యములో వివరించారు. 'గయలు' అనగా ప్రాణములు అని అర్థము. 'త్రాయతే' అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం. గాయత్రీ మంత్రంలో యిరువది నాలుగు అక్షరములతో పాటు యిరువది నాలుగు దేవతా మూర్తుల శక్తి అంతర్గతంగా నుండును. ఈ యిరువది నాలుగు గాయత్రీ మూర్తులకు చతుర్వింశతి గాయత్రీ అనిపేరు. వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమునుచేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీ మద్రామాయణమును రచించారు.
వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతి వారికీ సుపరిచితమైంది 'యజ్ఞోపవీతం'. దీనినే తెలుగులో 'జంధ్యం' అంటాం. ... యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని 'యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...' అనే మంత్రం చెబుతోంది. సనాతన వైదిక సాంప్రదాయాల ఆచరణ అనురక్తి పరులు అనాదిగా ఏటా యజ్ఞోపవీత ధారణ చేయడం పరిపాటి.
శ్రావణ పూర్ణిమ సందర్భంగా సామూహిక యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాలు సాంప్రదాయ బద్దంగా, కన్నుల పండువగా జరిగాయి. దేశ విదేశాలలో సామూహిక కార్యక్రమాలలో భాగస్వాములు అయినారు. ఆచార్యుల ఆచార్యత్వంలో వేదోక్త సాంప్రదా యరీతిలో సామూహిక పూజలు, విఘ్నేశ్వర పూజ, పంచగవ్య ప్రాశనం, బ్రహ్మయజ్ఞం, నవకాండ రుషుల పూజ, అగ్నిప్రతిష్ఠ, నవకాండ రుషుల హోమం, చతుర్వేద హోమం, నూతన యజ్ఞోపవీత ధారణం, జయాది హోమాలు, వైశ్వానర పూజ, మంత్ర పుష్పం, ఆశీర్వచనం, రక్షాధారణాది క్రతువు లు నిర్వహించారు.
ప్రజాపతితో ఆవిర్భవించిన యజ్ఞోపవీతం ఆయు, బలం, తేజస్సు, శ్రేష్ఠత్వాలను, నిర్మలత్వాన్ని కలిగిస్తుందని, త్రివిధ రుణాల ప్రతీకలైన దేవ రుణం, పితృరుణం, రుషి రుణాలను పంచమహా యజ్ఞం ద్వారా శరీరంతో తీర్చుకోవడం ధర్మ మని, అదే ఉపాకర్మ ఉద్దేశమని పౌరోహిత్య, జ్యోతిష పండితులు వివరించారు.
రాఖీ పూర్ణిమ పురస్కరించుకుని క్షేత్రంలో - రక్షాబంధన కార్యక్రమాలలో భాగస్వాములై, ఆనందోత్సాహాల మధ్య పండగను జరుపుకున్నారు. ప్రాచీన ఆర్షవిజ్ఞానానికి, సనాతన సాంప్రదా యలకు అనాదిగా నెలవు ధర్మపురి క్షేత్రం. పరమత ద్వేషుల కరవాలా ఘాతాలకు గాయపడి, ఎదురొడ్డి, స ముద్ర వీచికల వలె ఎగిరిపడి, తిరిగి సర్దుకుని, చరిత్రకు అందనంత పూర్వకాలికంగా అనాదిగా ఉజ్జ్వల సాంస్కృతిక, వైదిక, తాత్విక, పౌరాణిక పుణ్య భూమిగా విలసిల్లుతున్నదీ గోదావరీ తీరస్థ తీర్ధ క్షేత్రం. 3వేల ఏళ్ళ చరిత్ర కలిగి, మునులకు, రుషులకు, యజ్ఞయాగాది క్రతువుల కు కేంద్ర స్థానమై నిలిచింది. 500కు పైగా గడపలు కలిగిన విప్ర గృహాలకు చెందిన వారు తమ సంస్కృతిని, జీవన విధానాన్ని, శతాబ్దులుగా మారనీయకుండా ఉంచడాన్ని బట్టి, వైదిక సంప్రదాయ రక్షణ ఎలా చేస్తు న్నారో స్పష్టమవుతుంది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా అమెరికాలోని పలు ప్రాంతాలు, ముంబై, హైదరా బాద్ లాంటి చోట్ల సామూహిక యజ్ఞోపవీత ధారణలు చేయడం సనాతన సంప్రదాయ ఆచరణగా మారింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ

పండుగ పూట విషాదం నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు

శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో ఘనంగా పౌర్ణమి ప్రత్యేక పూజలు

వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.

17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

25వ వార్డులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
