72 గంటల బిసి రిజర్వేషన్ల దీక్ష ముగించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత
కాళేశ్వరం నివేదికపై స్పందన - కేసీఆర్ కు ఏమి కాదు
హైదరాబాద్ ఆగస్ట్ 04:
హైకోర్టు పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని పోలీసులను అడిగితే పోలీసులు 8వ తేదీ నుంచి దీక్ష చేసుకోమన్నారు. జాగృతి క్రమశిక్షణ గల సంస్థ.. కోర్టు ఆదేశలను ధిక్కరించదు.. కోర్టుల పట్ల నాకు గౌరవం ఉంది.కోర్టు ఆదేశాలను గౌరవించి దీక్షను ఇంతటితో ముగిస్తున్నాం అని కల్వకుంట్ల కవిత తెలిపారు.
ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపుతూ బీసీల తరపున పోరాటం చేస్తున్నాం. సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే వెనక్కి తగ్గినట్టు కాదు. మేము ఒక అడుగు వెనక్కి వేస్తే పది అడుగులు ముందుకు వేస్తామన్నది గుర్తు పెట్టుకోవాలి.
బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం ఆగదు అనేక రూపాల్లో చేస్తాము. ఢిల్లీ కాంగ్రెస్ ధర్నాలు టైం పాస్ ధర్నాలు.. వాటితో సాధించేది ఏమీ లేదు.మీరు రాష్ట్రపతి వద్దకు వెళ్ళండి. గవర్నర్ పై సుప్రీంకోర్టులో కేసు వేయండి*
ఢిల్లీలో టైమ్ పాస్ ధర్నాలు చేస్తే తెలంగాణ బీసీ బిడ్డలు ఊరుకోరు.మళ్లీ సమాలోచనలు చేసి మరో రూపంలో పోరాటం చేస్తాము. లోకల్ బాడీల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే ఎన్నికలు ఎట్లా ఆపాలో మాకు తెలుసు.లోకల్ బాడీల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కచ్చితంగా వస్తాయనే నమ్మకం ఉంది
కాళేశ్వరం నివేదికపై స్పందించిన కవిత
పీసీ ఘోష్ కమీషన్ నివేదికలో కేసీఆర్ పేరును 35 సార్లు ప్రస్తావించినంత మాత్రాన ఆయన తప్పు చేసినట్టు కాదుకమీషన్ నివేదికతో కేసీఆర్ కు ఏం కాదు.డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కమీషన్ నివేదికను బయట పెట్టారు
నిపుణుల కమిటీ సూచనల మేరకు నిర్మాణాలు జరిగాయి.కమీషన్ మెగా క్రిష్ణారెడ్డిని ఎందుకు విచారించలేదు.కాళేశ్వరం కమిషన్ నివేదికతో కొందరి అరెస్టులు ఉంటాయని మీడియాలో వస్తోన్న వార్తలు కావాలని కల్పించినవే.
కేసీఆర్ పేరుతో ప్రచారం చేస్తున్న అంశాలను మేము పట్టించుకోము.. కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే చూద్దాం
More News...
<%- node_title %>
<%- node_title %>
రుణం వసూలు పై ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు నిర్వాకం. - మహిళా కమిషన్ కు ఫిర్యాదు
.jpeg)
జర్నలిస్ట్ అక్రమ నిర్బంధంపై సీపీకి జర్నలిస్టుల పిర్యాదు

ఆకతాయిలకు అడ్డాగా పిట్టల బస్తి కమ్యూనిటీ హాల్

పర్యావరణ హితమైన సోలార్ ఇందన ఉత్పత్తిపై వినియోగదారులు దృష్టి పెట్టాలి ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ బి. సుదర్శనం

ఘనంగా జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్

సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్ ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు

మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన

ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్

ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు లోక్ దళ్ నేత అర్జున్ సింగ్ చౌతాల మద్ధతు

72 గంటల బిసి రిజర్వేషన్ల దీక్ష ముగించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత
