తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే11 ( ప్రజా మంటలు ) :
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బలోపేతంపై సమగ్రంగా సమీక్ష..
ఆదివారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో మెడికల్ & హెల్త్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ డీఎంఈ పరిధిలో ఉన్న ఆస్పత్రుల బలోపేతం పై ఆయా విభాగాల అధికారులతో సుధీర్గంగా చర్చించారు.
ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన అన్ని వివరాలను మంత్రి దామోదర్ రాజనర్సింహ అడిగి తెలుసు కున్నారు.
ఈ సందర్భంగా వైద్యశాఖ అధికారుల నుంచి ఆసుపత్రులు పనితీరు వైద్యుల సేవలు.. ప్రజల స్పందన.. ఇబ్బందులు.. దవాఖానాల్లో నెలకొన్న సమస్యలను మంత్రి క్షుణ్ణంగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ....
- జిల్లా లో అవసరమైన వైద్య పరికరాలు అందజేస్తామన్నారు.
- జగిత్యాల జనరల్ హాస్పిటల్ కు ఎమ్మారై స్కాన్ ను. మంజూరు చేస్తామని తెలిపారు.
- జిల్లాలో గల మూడు డయాలసిస్ సెంటర్లలో రోగులకు అత్యుత్తమైన సేవలు అందించాలని, వారి పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దని సూచించారు.
- ఉత్తర తెలంగాణ కు కీలక జిల్లా అయిన జగిత్యాల జిల్లాను వైద్య పరంగా మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
- వైద్యులు బాధ్యతయుతంగా పని చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూటికి నూరు. శాతం డెలివరీ లను ప్రోత్సాహించాలని ఆదేశాంచారు .
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా వైద్యాధికారులు సిబ్బంది ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు.
- ఇందుకు గ్రామ గ్రామాన అంగన్వాడి కార్యకర్తలు ఆశా వర్కర్లు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
- రోడ్ ప్రమాద బాధితులకు జగిత్యాల ధర్మపురి పరిధిలో ట్రామా కేర్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామనీ వెల్లడించారు. జిల్లా లో సెంట్రల్ డ్రగ్ సెంటర్ ను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
- డ్రగ్ సెంటర్ నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.
- జగిత్యాల డయాలసిస్ సెంటర్లో రోగులకు మరింత అత్యుత్తమైన సేవలు అందేలా పకడ్బందీగా వైద్యులు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
- ఆస్పత్రుల్లో వైద్యులు రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, వారి పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ అత్యుత్తమైన సేవలందించాలని సూచించారు.
- సకాలంలో వైద్య సేవలు అందించని వైద్య అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
- అయితే అధికారులు, సిబ్బంది పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని, ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందించి ప్రభుత్వ ఆసుపత్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ...
- వేములవాడ ఏరియా ఆసుపత్రిలో mch ఏర్పాటు చేయాలి..
- సూరమ్మ చెరువు రిజర్వాయర్ కుడి ఎడమ కాలువ భూ సేకరణ కోసం నిధులు మంజూరు చేయాలి..
- కాలికోట సూరమ్మ చెరువు పూర్తయి 43700 ఎకరాలకు సాగు నిరు అందించడం జరుగుతుంది.
- రైతుల 3 ఎకరాల భూమికి నష్టా పరిహారం మిగిలివుంది సాధ్యమైనంతగా వేగంగా నిధులు మంజూరు చేయాలి..
- వేములవాడ లో ట్రామా మంజూరు చేయడం పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.
- జగిత్యాల జిల్లా కేంద్రాన్ని మెడికల్ హబ్ గా మార్చేందుకు పూర్తి సహకారం అందించాలని మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు.
- ఇందుకుగాను 57 కోట్ల 24 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయవలసిందిగా విన్నవించారు.
- నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా 6 కోట్ల 4 లక్షల 26 వేల 416, తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ద్వారా 6 కోట్ల 25 లక్షలు, ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సర్జికల్, డ్రగ్స్ కోసం 74 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరారు.
- అదేవిధంగా మెడికల్ కాలేజీ పెండింగ్ బిల్లులు 44 కోట్లు మంజూరు చేయాలని మంత్రికి విన్నవించారు.
- ధర్మపురి నుంచి రాయపట్నం, రాయపట్నం నుండి ధర్మారం రాజీవ్ రహదారిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున ధర్మపురిలో ట్రామా సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి కి విన్నవించారు.
- ఈ మేరకు మంత్రి దామోదర రాజ నరసింహ కు వినతిపత్రం సమర్పించారు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ..
- ఉత్తర తెలంగాణకు జగిత్యాల కేంద్రంగా ఉన్నదని అన్నారు.
- సిరిసిల్ల మంచిర్యాల నిర్మల్ పెద్దపెల్లి కరీంనగర్ జిల్లాల నుండి వ్యవసాయ అవసరాలు, మార్కెటింగ్ నిమిత్తం ఎంతోమంది ఇక్కడకు వస్తుంటారని అన్నారు.
- అందువల్ల వైద్యపరమైన అవసరాలు జగిత్యాల జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
- 3 జాతీయ రహదారులు ఈ జిల్లాలోని కలుస్తాయని, బస్టాండ్ కు దగ్గరగా, కాలినడకల చేరుకునే విధంగా మెడికల్ కాలేజీ స్థలాన్ని ఎంపిక చేస్తామని తెలిపారు.
- 15వ ప్రణాళిక సంఘం నిధుల్లో నుండి జగిత్యాల జిల్లాకు 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆయుష్మాన్ కేంద్రాలు ఇదివరకే మంజూరు చేయించానని మంత్రికి వివరించారు.
- అయినప్పటికీ జగిత్యాల జిల్లా అవసరాల దృశ్య అర్బన్ ప్రాథమిక కేంద్రాలు మరిన్ని మంజూరు చేయాలని కోరారు.
- ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున అంబులెన్సులు మంజూరు చేయాలని మంత్రికి విన్నవించారు.
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ..
- ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రిగారికి విన్నవించారు..
- మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ బిల్డింగ్ త్వరగా పూర్తిచేయాలని కోరారు ఈ విషయాన్ని అసెంబ్లీలో పలుమార్లు విన్నవించానని గుర్తు చేశారు..
- మెట్ పల్లి పట్టణంలో ఒక మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి నిర్మించాలని కోరారు..
- కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్ స్కాన్ మిషిన్ ఏర్పాటు చేయాలని కోరారు..
- కోరుట్ల పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి భవనం పూర్తయి నెలలు గడుస్తున్న అందులో వైద్యుల కొరత ఉన్నందున వైద్యులను నియమించాలని కోరారు..
- మల్లాపూర్,ఇబ్రహీంపట్నం,మెట్ పల్లి, కోరుట్ల నాలుగు మండలాలకు అంబులెన్సులు కావాలని తెలిపారు..
- కోరుట్ల పట్టణంలో గల వంద పడకల ఆసుపత్రిలో అవసరమయ్యే పరికరాలను త్వరితగతన అందజేయాలని కోరారు..
- కోరుట్ల నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న హెల్త్ సబ్ సెంటర్ భవనలను త్వరగా పూర్తి చేయాలని కోరారు..
ఈ సమీక్షలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కోరుట్ల శాసనసభ్యులు డా. సంజయ్, జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్ బిఎస్ లత డిఎం అండ్ హెచ్ ఓ డా. ప్రమోద్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డా. ఖాద్రి జి జి హెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. సుమన్, జిల్లా కు చెందిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వసంతోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
పెండింగ్ బిల్లుల మంజూరి, జిల్లాకు అవసరమైన డ్రగ్స్ గూర్చి వైద్య శాఖ మంత్రి కి వినతి చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జనని యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రాచీన ఉగ్రనరసింహా స్వామి టెంపుల్ లో ఘనంగా జయంతి

ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు
