హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల విజయవంత నిర్వహణకు కృతజ్ఞతలుగా జిల్లా ఎస్పీకి సత్కారం
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
కొండగట్టు ఏప్రిల్ 14 ( ప్రజా మంటలు)
కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా, శాంతియుతంగా నిర్వహించబడిన సందర్భంగా, ఈ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన భద్రతా ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టిన జిల్లా పోలీస్ శాఖకు కృతజ్ఞతగా, ఆలయ ఈవో శ్రీకాంత్ రావు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి, శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీకాంత్ రావు మాట్లాడుతూ.. జయంతి ఉత్సవాల రోజులలో భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, భద్రతతో కూడిన శాంతియుత వాతావరణంలో దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకున్న పోలీస్ శాఖకు మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జయంతి సందర్భంగా వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ఈ ఉత్సవాలు ప్రశాంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన హనుమాన్ మాల విరమణ భక్తులకు, ప్రజలకు, పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు. ఇతర జిల్లాల నుంచి సాయం చేసిన పోలీసు బృందాల సహకారం, క్షేత్రస్థాయిలో పనిచేసిన జగిత్యాల జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది వల్లే ఈ ఉత్సవాలు విజయవంతంగా జరిగాయి అన్నారు. అదే విధంగా భవిష్యత్తులో నిర్వహించబోయే పండుగలు, కార్యక్రమాల సందర్భాలలో కూడా పోలీసు శాఖ తరపున పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లకు ముందుంటామని తెలిపారు.
యొక్క కార్యక్రమంలో కొండగట్టు ఆలయ ఈవో శ్రీకాంత్ రావు, సూపరిండెంట్ సునీల్, మల్యాల సి.ఐ రవి, ఎస్ బి ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, ఎస్.ఐ నరేష్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వసంతోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
పెండింగ్ బిల్లుల మంజూరి, జిల్లాకు అవసరమైన డ్రగ్స్ గూర్చి వైద్య శాఖ మంత్రి కి వినతి చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జనని యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రాచీన ఉగ్రనరసింహా స్వామి టెంపుల్ లో ఘనంగా జయంతి

ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు

సహచర ఉద్యోగికి రూ,32,000 ఆర్థిక సహాయం

సీనియర్ సిటిజన్ల చట్టంపై అవగాహనకే పోస్టర్ల ప్రదర్శనలు

ఫుట్ పాత్ అనాధలను ఆదుకోండి.. మహాప్రభో ... స్కై ఫౌండేషన్ వేడుకోలు

బోలక్ పూర్ లో ఘనంగా మదర్స్ డే సెలబ్రేషన్స్
