బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపూ పూలే జయంతి వేడుకలు
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
ధర్మపురి ఏప్రిల్ 11(ప్రజా మంటలు)
ధర్మపురి మండల కేంద్రంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ యువజన సంఘం మండల అధ్యక్షుడు బోగ రమేష్ అధ్యక్షతన మహాత్మా జ్యోతి బాపూలే గారి 199 వ జయంతి వేడుకలు నిర్వహించారు
ఈ సందర్భంగా నేతలు పూలే చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం పలువురు నేతలు మాట్లడుతూ సామాజిక విప్లవ తేజస్సు మహాత్మా జ్యోతిబాపులే జీవిత చరిత్ర ను అందరు ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సాధనకు ముందుకు సాగాలని అని అన్నారు
. కుల వ్యవస్థ ప్రాతిపాదిక సమాజ గమనం ఉన్న సమయంలో.. అంటరానితనం కొన్ని కోట్ల మంది జీవితాల్లో అతి సామాన్యమైన విషయంగా ఉన్నప్పుడు-, ఒక వ్యక్తి అణగారిన జీవితాల గురించి ఈ తరహా వ్యాఖ్యలు చేయటం.. దానివల్ల ఎదురయిన కష్టనష్టాలను ఓర్చుకొని ముందుకు సాగటం అంత సులభం కాదు. అందుకే ఈనాటికీ మనకు జ్యోతిబా ఫూలే ఆరాధ్యుడయ్యాడు.
కొన్ని కోట్ల మంది గుండెల్లో నిలిచి ఉన్నాడు. ‘మహాత్మా’ అనే బిరుదు మన దేశంలో ఇద్దరికి మాత్రమే ఉంది. ఒకటి మనకు స్వాతంత్ర్యాన్ని తేవటంలో కీలక భూమిక పోషించిన గాంధీకి. రెండోది మన సమాజానికి పునాదిరాళ్లుగా నిలిచిన నిమ్న వర్గాల ఉన్నతి కోసం పాటుపడిన ఫూలేకి ఆయన చేసిన సేవలు కొనియాడారు
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు స్తంభం కాడి శ్యాం మాజీ మున్సిపల్ చైర్మన్ సంగి సత్తెమ్మ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సంఘ నర్సింహులు నాయకులు అయ్యోరి రాజేష్ వేముల రాజేష్ చీపిరిశెట్టి రాజేష్ పిల్లి శీను గాజు భాస్కర్ కుమ్మరి తిరుపతి సంగీ శేఖర్ సంగి ఆనంద్ అప్పం తిరుపతి పలువురు నాయకులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)
మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్

సోలార్ పవర్ స్కీం ను వినియోగించుకోండి.. - జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్

పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం

భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి

చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన మద్దతు పలికిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ వసంత
