ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.చిన్న హనుమాన్ జయంతి కి 900 మంది సిబ్బందితో పటిష్ట భద్రత

On
ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.చిన్న హనుమాన్ జయంతి కి 900 మంది సిబ్బందితో పటిష్ట భద్రత

            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 
కొండగట్టు ఏప్రిల్ 10 ( ప్రజా మంటలు)
 సీసీ కెమెరాలు ద్వారా నిరంతర పర్యవేక్షణ*

 జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు లో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా,ఎలాంటి  అవాంచనీయ సంఘటనలు జరగకుండా 900 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. బందోబస్తుని 6  సెక్టార్స్ గా విభజించి 3  షిప్టుల పద్దతిన విధులు కేటాయించడం జరిగిందిని అన్నారు 

ఈ సందర్బంగా హనుమాన్ జయంతి  బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులు సిబ్బందిని ఉద్దేశించి  ఎస్పీ  మాట్లాడుతూ ..... చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఏలాంటి నేరాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  విధులు నిర్వహించాలని సూచించారు.

ఏదైనా సమస్య ఎదురైతే జిల్లా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని  సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు పోలీస్ సిబ్బంది ఓపికతో సలహాలు,సూచనలు ఇస్తూ భక్తుల మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలని,ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అందరూ సమన్వయంతో విధులు నిర్వహిస్తూ జయంతి ఉత్సవాలను  విజయవంతం చేయాలన్నారు.

ముఖ్యంగా దేవస్థానం,మాల విరమణ  వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండి భక్తులు క్యూ లైన్ పాటించేలా చూడాలని,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా 24 గంటలు పోలీస్ నిఘా ఉంచాలని ప్రతి ఒక్క భక్తుడు ప్రశాంతమైన వాతావరణంలో ఆంజనేయ స్వామిని  దర్శించుకుని క్షేమంగా తిరిగి వెళ్లేవిధంగా ప్రతి పోలీస్ బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. 

*పార్కింగ్ ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు:* ఈ సంవత్సరం భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున   భారీ సంఖ్యలో వచ్చే వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసేలా చూడాలని,ట్రాఫిక్ ,పార్కింగ్ ప్రదేశాల్లో విధుల్లో ఉన్న సిబ్బంది ట్రాఫిక్ జామ్ అవకుండా నియంత్రణ చేయాలన్నారు. రాత్రి వేళలో ప్రమాదాలు జరగకుండా స్టాపర్స్, కోన్స్, స్టిక్కర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

*అనంతరం ఆలయ పరిసరాల్లో ఏర్పాటుచేయవలసిన భద్రత ఏర్పాటలను పరిశీలించి అదికారులకు పలు సూచనలు చేశారు.*  

*హనుమాన్ జయంతి సందర్భంగా కాలి నడకన వచ్చే భక్తులు రోడ్డుపైన వెళ్ళే వాహనాలు గమనిస్తూ నడవాలి*

హనుమాన్ దీక్ష తీసుకున్న దీక్షపరులు కాలినడకన కొండగట్టుకు వచ్చే సమయం లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రేడియం స్టికర్స్ ను వారి బ్యాగులకు, జెండా కు అంటించడం జరిగింది. రోడ్డు కు ఇరువైపులా నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని వాహనాలను గమనిస్తూ తమ యొక్క గమ్యస్థానానికి చేరుకోవాలని జిల్లా ఎస్పీ  సూచించారు.


ఈ కార్యక్రమంలో  డిఎస్పి లు రఘు చందర్, రాములు, రంగరెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ అరిఫ్ అలీ ఖాన్,సి.ఐ లు రవి ,రామ్ నరసింహారెడ్డి, సురేష్ ,అనిల్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, వేణు, వివిధ జిల్లాలకు చెందిన సి.ఐలు, ఎస్.ఐ లు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩 భీమదేవరపల్లి మే 8 (ప్రజామంటలు) : వాసవి మాత జయంతి సందర్భంగా అంచురీస్ కన్వెన్షన్ హాల్లో ఆర్యవైశ్యులందరు, వాసవి మాతకు కుంకుమ పూజలు నిర్వహించారు. మన దేశం శాంతియుతంగా, సుభిక్షంగా ఉండాలని వాసవి మాతను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అంచూరి వెంకట్రాజము, గౌరవ అధ్యక్షులు పెద్ది సూర్య ప్రకాశం, కార్యవర్గ సభ్యులు...
Read More...
Local News 

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి సికింద్రాబాద్ మే 07 (ప్రజామంటలు) : ఉగాండా కు చెందిన యువతి వ్యభిచారం చేస్తూ బోయిన్ పల్లి పోలీసులకు పట్టుబడింది. బోయిన్ పల్లి ఇన్స్పెక్టర్ ఎన్.తిరుపతి రాజు తెలిపిన వివరాలు...మబ్జి షరాన్(23)అనే యువతి ఉగాండా దేశంలోని కోకో మేర్ ప్రాంతం నుంచి గత ఏడాది ఫిబ్రవరి21న టూరిస్ట్ వీసాపై ముంబై కి వచ్చింది. అక్కడి నుంచి...
Read More...
Local News 

మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్

మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్ సికింద్రాబాద్ మే 07 (ప్రజామంటలు): కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు, ఆర్మీ, ఎన్సీసీ కేడేట్లు బుధవారం పలు చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించారు. మారేడ్ పల్లిలోని షెనాయ్ నర్సింగ్ హోమ్ ప్రాంతంలో, రసూల్ పుర,నాచారంలోని మల్లాపూర్ లో భద్రత బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించి, యుద్ద సైరన్ మోగించారు. అత్యవసర పరిస్థితుల్లో దాడుల నుంచి...
Read More...
Local News 

సోలార్ పవర్ స్కీం ను వినియోగించుకోండి..  - జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్

సోలార్ పవర్ స్కీం ను వినియోగించుకోండి..  - జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్ సికింద్రాబాద్ మే 07 (ప్రజామంటలు): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని అంతా వినియోగించుకోవాలని సికింద్రాబాద్ మహాంకాళి బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. న్యూ బోయిగూడ ఎంఎన్కే విఠల్ సెంట్రల్ కోర్టు రూప్ టాప్ టెర్రస్ పై నూతనంగా ఏర్పాటు చేసిన 36 కేడబ్ల్యూపీ కెపాసిటీ...
Read More...
Local News 

పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం

పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి  *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం                                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ                                      9348422113 ధర్మపురి మే 7(ప్రజా మంటలు)పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంతపూర్ గ్రామ శివారులో  పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో  సి సి ఎస్ పోలీసు లు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 6గురుని అదుపులోకి  తీసుకొని వారి వద్ద నుంచి  రూ.26060 /రూపాయలు, 6 మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేసినట్లు...
Read More...
Local News 

భరోసా సెంటర్‌ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా

భరోసా సెంటర్‌ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా                                                                మంద. శ్రవణ్ కుమార్ గౌడ్                                       9391526141జగిత్యాల మే 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రం లో  బాధిత మహిళలు లేదా బాలికలకు వైద్యం,కౌన్సిలింగ్,అన్ని రకాల సేవలు అందించడంతో పాటు వారికీ పోలీస్ అండగా ఉంటుందనే మనోదైర్యం కల్పించడం కోసం ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ ప్రారంభించి సంవత్సర కాలం అవుతున్న సందర్బంగా వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం...
Read More...
Local News 

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ కోరుట్ల ,మెట్పల్లి మే 7(ప్రజా మంటలు)విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి   మెట్పల్లి,కోరుట్ల పోలీస్ స్టేషన్ లను ఆకస్మిక  తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  ప్రతి ఫిర్యాదు పై వేగంగా స్పందించి బాధితులకు తక్షణమే న్యాయం చేసే విధంగా విధి నిర్వహణ ఉండాలని జిల్లా ఎస్పీ...
Read More...
Local News 

చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన మద్దతు పలికిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ వసంత

చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన మద్దతు పలికిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ వసంత                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 7( ప్రజా మంటలు)మంగళవారం కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులో దాన్యం తడిసిపోగా అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు నిజామాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు . నెల గడుస్తున్న వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా...
Read More...
Local News  State News 

అక్రమ కేసులను వెంటనే మన ప్రభుత్వం ఎత్తి వేయాలి

అక్రమ కేసులను వెంటనే మన ప్రభుత్వం ఎత్తి వేయాలి సిఎం ముఖ్య సలహాదారుకు మహంకాళి రాజన్న విజ్ఞప్తి జగిత్యాల : ఏప్రిల్ 07 (ప్రజా మంటలు): గత బిఆర్ ఎస్  ప్రభుత్వ హయాములో తెలంగాణ ఆర్టీసి కార్మికులపై, ఉద్యమ కారులపై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా పెట్టిన కేసులను మన ప్రభుత్వం ఎత్తివేయాలని ముఖ్యమంత్రి ముఖ్య సలాహాదారు వేమ్.నరెందర్ రెడ్డి కి జగిత్యాల ఉద్యమకారుడు మహంకాలి రాజన్న...
Read More...
Local News 

ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కొండగట్టులో  ప్రత్యేక పూజలు

ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కొండగట్టులో  ప్రత్యేక పూజలు గొల్లపల్లి మే 07 (ప్రజా మంటలు): పాకిస్తాన్ ఉగ్రవాదులపై మొదలైన యుద్ధం విజయవంతం కావాలని, మన సైనికులకు, దేశ ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం కలగకూడదని. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని. పాకిస్తాన్ కి బుద్ధి చెప్పే విధంగా ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ముందడుగు వేసిన తీరు గర్వకారణమని అన్నారు. భారత్ ప్రధాని మోడీ కి...
Read More...
State News 

ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స

ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స లండన్ లో జరిగిన ప్రమాదంలో కుడిచేయి ఫ్రాక్చర్..  *కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో సర్జరీ సికింద్రాబాద్ మే 06 (ప్రజామంటలు) : ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరికి బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రిలో వైద్యులు మంగళవారం శస్త్ర చికిత్స నిర్వహించారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన బాత్రూమ్...
Read More...

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!! (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల 05 మే (ప్రజా మంటలు) : అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తీసుకుంటున్న వ్యవస్థాగత పరమైన మార్పులలో బాగంగా ఎన్నో విలువైన, గుణాత్మక విషయాలకు పట్టం కడుతుంది అందులో భాగంగానే జిల్లా స్థాయిలలో గ్రంథాలయ చైర్మన్ పదవులకు పెద్ద మొత్తంలో బి.సి లకు అందునా చదువుకున్న...
Read More...