చలో వరంగల్ సభను విజయవంతం చేయాలి పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 10 ( ప్రజా మంటలు)
ఈ నెల 27 న *చలో వరంగల్* సభకు జగిత్యాల నియోజకవర్గంలోనీ ప్రతి గ్రామం నుండి అందరూ వచ్చి సభను విజయవంతం చేయాలని జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
* తెలంగాణ రాష్ట్రం తేవడానికి బి.ఆర్.ఎస్ పార్టీ పుట్టింది.తెలంగాణను దేశంలోనే అన్ని రంగాలలో అగ్రగామిగా నిలబెట్టింది. ఇకముందు కూడా తెలంగాణ కోసం BRS పార్టీ పని చేస్తుంది.
* రాష్ట్రాన్ని నడిపించ లేని అసమర్ధ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
* రానే రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 15 ఏండ్లు అలుపెరుగని పోరాటం చేసి సాధించిన గొప్ప నాయకుడు కెసిఅర్.
* ఒక్కడిగా బయలుదేరి కోట్లాది తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేసి కరెంట్ కోసం, మంచినీళ్ల కోసం,పంట చేతికొచ్చేదాక నమ్మకం లేని తెలంగాణ ను 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన నాయకుడు కెసిఅర్.
* కాంగ్రెస్ పాలనలో మళ్ళీ ఆనాటి పాత రోజులు తిరిగి వస్తున్నాయి
* కెసిఅర్ ప్రభుత్వ హయంలో రైతులకు నాట్ల అప్పుడు రైతు బందు వేస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఓట్ల అప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్నారు.
* రాష్ట్రంలో ఎక్కడ తిరిగిన కాంగ్రెస్ పాలనను ప్రజలు చీదరించుకుంటున్నారు
* ఇచ్చిన ఆరు గ్యారంటీలు,420 హామీలు 100 రోజుల్లో అమలు చేస్తాం అని 500 రోజులు దాటినా అమలు చేయలేదు.
* రేవంత్ రెడ్డి రాష్ట్రంలో భూములు అమ్మడం లేదా దోచుకొని డబ్బులు సంపాదించుకునే పనిలో తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదు.
* ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ,మాజీ ఎమ్మెల్సి జీవన్ రెడ్డి ఒకరికొకరు పరస్పరం విమర్శించుకోకుండా జగిత్యాల అభివృద్ధి కోసం పాటుపడాలని అన్నారు.
* పార్టీ ఏర్పడి 24 వసంతాలు పూర్తి చేసి 25 సంవత్సరం లోకి అడుగుపెడుతున్నాము అన్నారు.
* సభకు బయలుదేరే ముందు గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసి సభకు బయలుదేరాలి.
* ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందని,రైతులకు,బడుగు,బలహీనవర్గాలకు, దళితులకు ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు.
దేశంలోనే తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా నిలిపిన ఘనత కేసీఆర్‌దన్నారు.
- ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు భవిష్యత్ గుర్తించి దిశానిర్దేశం చేయనున్నారని,
* సభకు తరలి వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలతో భాగస్వామ్యం చేసి వేలాదిగా సభకు తరలి వెళ్ళి విజయవంతం చేయాలన్నారు. - ఈ కార్యక్రమంలో రూరల్ మండలం అధ్యక్షులు ఆనందరావు పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి సీనియర్ నాయకులు గంగారెడ్డి కమలాకర్ రావు ఎల్ల రాజన్న, నలువాల తిరుపతి,గ్రామ శాఖ అధ్యక్షులు పూదరి శ్రీనివాస్, బాలే చందు,పోచమల్లయ్య గౌడ్, యాళ్ల మహేష్, పడాల సురేష్,పులిశెట్టి శ్రీనివాస్, పెండెం శ్రీను,మామిడి రాజు,తరాల వెంకటేష్, బొల్లరపు గంగాధర్, గోపాల్,షేర్, సైఫ్,అంజన్న, బడుగు శ్రీను, దర్శన్, బందేల రెడ్డి,బడుగు రాకేష్,శివ,సింగారపు గంగాధర్ తదితరులు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)
మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్

సోలార్ పవర్ స్కీం ను వినియోగించుకోండి.. - జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్

పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం

భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి

చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన మద్దతు పలికిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ వసంత

అక్రమ కేసులను వెంటనే మన ప్రభుత్వం ఎత్తి వేయాలి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కొండగట్టులో ప్రత్యేక పూజలు

ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!
