సీతా రామాంజనేయ ఆలయంలో బ్రహ్మోత్సవాలు
(రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494)
అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖల
అమాత్యులు దివంగత జువ్వాడి రత్నాకర్ రావు స్వగ్రామమైన ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్లో నూతన నిర్మిత శ్రీసీతా రామాంజనేయ ఆలయంలో వార్షిక తిరు
కళ్యాణ బ్రహ్మోత్సవ వేడుకలను వైభవోపేతంగా, ఘనంగా నిర్వహించ నున్నారు. దివంగత రాష్ట్ర మంత్రి రత్నాకర్ రావు కు చెందిన 10 గుంటల స్థలాన్ని దానం చేయగా, సదరు స్థలంలో, గ్రామ ప్రజల భాగస్వామ్యంతో, 20శాతం క్రింద 6.20 లక్షల విరాళాలను చెల్లింపజేసి, దేవాదాయ శాఖ సర్వ శ్రేయో నిధి ద్వారా 16.50లక్షల రూపాయల మంజూరీ, 5 లక్షలు వేములవాడ దేవస్థాన నిధులకు తోడు 10 లక్షల వ్యయంతో ముఖద్వారం, అర్చిగేటు , ప్రహారీ గోడ ఆది పనులను, మాజీ మంత్రి కుమారులు నర్సింగరావు, కృష్ణారావుల చేయూతతో 37 వేలు విగ్రహాలకు, 1లక్ష రూపాయలు గ్రానైటు, పాలరాతి పరిచే పనులను పూర్తి చేసి, సంబందిత నూతన ఆలయాన్ని ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి అనుబంధంగా చేశారు.
అనంతరం దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలను 2009 సంవత్సరం మార్చి 12 నుండి 15 వరకూ ప్రముఖ యాజ్ఞకులు శ్రీమాన్ నంబి వేణుగోలాచార్య ఆధ్వర్యంలో, వేద పండితులచే నిర్వహింపగా, జువ్వాడి రత్నాకర్ రావు దంపతులచే కార్యక్రమం నిర్వహించ బడగా, పరమహంస
పరి వ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ జ్వామి కార్యక్రమాలను పర్యవేక్షించారు. కాగా ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 5వ తేదీ శని వారం సాయంత్రం 4గంటలకు కలశ స్థాపన, విశ్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహ వాచనం, రుద్విగ్వరణం రక్షా బంధనం, మృత్సం గ్రహణం, అంకురారోపణం, అగ్ని ప్రతిష్ఠ, భజన సంకీర్తనలు కార్యక్రమా లను నిర్వహించనున్నారు. 6వ తేదీ ఆది వారం ఉదయం 9గంటలకు ధ్వజారోహణం, నిత్య హవనం, బలి ప్రదానం, మధ్యాహ్నం 12 గంటలకు శ్రీసీతారామ చంద్రుల తిరు కల్యాణోత్సవం, స్థాలీపాకం, బలి ప్రదానం, అన్నదానం, సాయంత్రం 5గంటలకు గ్రామోత్సవ ఊరేగింపు సేవ, రాత్రి 9గంటలకు భజనలు,
7వ తేదీ సోమ వారం ఉదయం 9గంటలకు పూర్ణాహుతి, బలి ప్రదానం, నిత్య హవనం నాగవెల్లి, పుష్పయాగం, ఆశీర్వచనం, రుత్విక్ సన్మానం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఏసీ, ఇఓ సంకటాల శ్రీనివాస్ వివరించారు.
దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్ ధర్మ కర్తలు, అర్చకులు, సిబ్బంది కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
రత్నాకర్ రావు కుటుంబ సభ్యులు కార్యక్రమాలలో భాగస్వాములు కానున్నారు. 500 రూపాయలు చెల్లించి, కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు స్వామి శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేయడం జరుగుతుందని ఈఓ శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!

రోడ్డు ప్రమాదాల నివారణకై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్_ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 40 వాహనాల సీజ్

హైదరాబాద్ లో రేపు సా .4 గం .లాక్అuత్యవసర మాక్ డ్రిల్
.jpg)
అనాధ పిల్లలకు 10 వేలు అందించిన సామాజిక సేవకులు స సూరజ్ శివ శంకర్

కేసీఆర్ అప్పు..తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించింది –మంత్రి సీతక్క...

ఈనెల 7న హైదరాబాద్లో నిర్వహించే కుల గణన డాక్యుమెంట్ రూపకల్పన సమావేశానికి అధిక సంఖ్యలో బీసీలు కదిలి రావాలి_

విద్యుత్ ఘాతంతో నాలుగు గేదెలు మృతి

15 గంజాయి కేసుతో సహా, మరో 05 కేసులల్లో పరారీలో ఉన్న హమ్మద్ అనే నిందుతుడు అరెస్ట్

అభివృద్ధి కార్యక్గమాలు పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శిక్షణ తరగతులు ముగింపు

జగిత్యాల జిల్లా లో డిగ్రీ అడ్మిషన్లకై దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు.
