ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు
జగిత్యాల మే 02 (ప్రజా మంటలు)
శ్రీ ఆదిశంకరాచార్య శ్రీమాన్ రామానుజాచార్య జయంతిని పురస్కరించుకొని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో జయంతుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్ల చిత్రపటాలకు ప్రత్యేకంగా అలంకరించి అభిషేకము, మంగళహారతి, మంత్రపుష్పం, నిర్వహించి స్వామి వార్ల జీవిత విశేషాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ బంధువులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని తిలకించి నేత్రానందభరితులయ్యారు.
వైదిక క్రతువును అన్యారంభట్ల మృత్యుంజయ శర్మ నిర్వహించగా, హరిహరాలయం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం లో భాగంగా తొలివిడత ప్రమాణ ఉత్సవము లో అనుపస్థితి అయిన వారు శుక్రవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో కార్యదర్శిగా రుద్రాంగి రాఘవేంద్ర శర్మ ,సాంస్కృతిక కార్యదర్శిగా రేపల్లె హరికృష్ణ, ధర్మకర్తలుగా సిరిసిల్ల వేణుగోపాల్ ,మోతే రాజగోపాల్ రావు, మోతే వినయ్ శర్మ (హరిహరాలయ అర్చకులు) భగవంతుని సాక్షిగా ప్రమాణం చేశారు.
బ్రాహ్మణ సంఘ సభాపతి తిగుళ్ల విషు శర్మ , సంఘ అధ్యక్షులు ఉమాకాంత్ శర్మ, ఆలయ అధ్యక్షులు చాకుంట వేణు మాధవరావు, కన్వీనర్ సిరిసిల్ల రాజేంద్ర శర్మ ల సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం కొనసాగింది. కార్యక్రమం అనంతరం తీర్థప్రసాద వితరణ తో పాటు ఆశీర్వచనం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్ఐ.సిహెచ్ సతీష్

జియాగూడ గోశాలలో గోసేవ, గోపూజ

బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు అందజేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

గొల్లపెల్లిలో ప్రారంభమైన ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరం

పదో తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అభినందనలు

శ్రీ సీతారామా ఆలయంలో ఘనంగా వికాస తరంగిణిచే విష్ణు సహస్రనామ పారాయణం

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
