గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్ - తప్పిన పెను ప్రమాదం
సికింద్రాబాద్, మే 03 (ప్రజామంటలు)
:
శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బౌద్దనగర్ డివిజన్ లో ఓయూ ఆర్ట్స్ కాలేజీ దారిలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కు సంబందించిన సెంట్రింగ్ గాలివానకు ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా కుప్పకూలింది. దాంతో అక్కడున్న కరెంట్, వైఫై తదితర తీగలు తెగిపోయాయి. సెంట్రింగ్ కట్టెలు, ఇనుప పైపులు ఎదురుగా ఉన్న రెండు బిల్డింగ్ లపై పడటంతో స్వల్పంగా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తు అక్కడ ఆ సమయానికి ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
చెట్లు ఉండటంతో సెంట్రింగ్ కట్టెలు వాటిపై వాలి పోవడంతో ప్రాణనష్టం తప్పిందని స్థానికులు చెప్పారు.రోడ్డుకు అడ్డంగా సెంట్రింగ్ పడిపోవడంతో ఈ దారి వెంట వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.విద్యుత్ శాఖ, ట్రాఫిక్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ వాహనంతో రోడ్డుకు అడ్డంగా పడిన సెంట్రింగ్ ను తొలగించే పనులు ప్రారంభించారు.
పద్మారావునగర్ లో రోడ్డుకు అడ్డంగా చెట్టు కొమ్మలు పడిపోవడంతో వాహన దారులు ఇబ్బంది పడ్డారు. కాసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కాగా వాన చినుకులు పడటం ప్రారంభం కాగానే చాలా ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోవడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. చిన్పపాటి వర్షానికే ఇలా పరిస్థితి ఉంటే వర్షకాలంలో తమ పరిస్థితి ఏంటి అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్ - తప్పిన పెను ప్రమాదం

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
.jpg)
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్ఐ.సిహెచ్ సతీష్

జియాగూడ గోశాలలో గోసేవ, గోపూజ
