తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారి వ్యవస్థ నుండి రైతులను కాపాడాలి - జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
రాయికల్ అక్టోబర్ 8 (ప్రజా మంటలు)
పట్టణం లోని బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
ఆరుగాలం రైతు కష్టపడి పండించిన మొక్క జొన్న పంటను కొనుగోలు చేయకుండ, కొనుగోలు సెంటర్లు ప్రారంభించకుండా రైతులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, కనీసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే స్థితిలో ఈ ప్రభుత్వం లేదా...? అని ప్రశ్నించారు.
ఆనాడు రైతు బాంధవుడు కేసీఆర్ సకాలంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి,మద్దతు ధర కల్పించి రైతుకు నష్టం కాకుండా దళారి వ్యవస్థ లేకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేసిన ఘనత కేసిఆర్దే అన్నారు.
అకాల వర్షాలకు తడిచిన మొక్కజొన్న పంటను కూడా ఎలాంటి నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో దళారులకు రైతులు అమ్మడం తో రైతుకు ఒక క్వింటాల్కు 600 నుండి 800 రూపాయల నష్టంతో అమ్ముకుంటున్నాడు. కాబట్టి దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి ఈ నష్టాన్ని కూడా రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆనాడు ఓట్ల కోసం అన్ని పంటలకు మద్దతు ధర మరియు బోనస్ కల్పిస్తానని బోగస్ మాటలు చెప్పి గద్దె ఎక్కిన తర్వాత రైతుకు మొండి చేయి చూపిస్తున్నారు.
వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి 22 నెలలైనా కూడా ఇప్పటికే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని అన్నారు.
ఉచిత బస్సు పథకం పెట్టి బస్సుల సంఖ్య తగ్గించి చార్జీలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.
రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఈ ప్రభుత్వం మోసం చేసింది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి రైతులతో పాటు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలందరు తీవ్రంగా విసిగి పోయినారు మళ్ళీ కేసీఆర్ పాలన కావాలని తెలంగాణ ప్రజలు అంటున్నారు.
జగిత్యాల నియోజకవర్గం లో స్థానిక సంస్థ ఎన్నికల్లో గులాబీ జెండా తప్పకుండా ఎగరడం ఖాయమని అన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతును ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ మరియు మండల అధ్యక్షులు ఎలేటి అనిల్ బర్కం మల్లేష్ కో ఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ సాయి కుమార్ మహేష్ గౌడ్ మహేందర్ మాజీ కో ఆప్షన్ సోహెల్ మాజీ ఎంపీటీసీ రాజేందర్ గౌడ్ నాయకులు రామచంద్రం వినోద్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు నల్ల బ్యాడ్జీలతో జాతీయ రహదారిపై నిరసన... అడ్డుకున్న పోలీసులు

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్

ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు తోడ్పడాలి

మానసిక ఆరోగ్యం తోనే సమాజం అభివృద్ధి -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

హర్యానా ఐపీఎస్ అధికారి వై. పూరణ్ కుమార్ ఆత్మహత్య -డీజీపీ తో సహా 7 గురిపై FIR

పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)