మక్క కొంగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి - డా. సంజయ్
కనీస మద్దతు ధరకు అదనంగా ₹500ల బోనస్ ఇవ్వాలి - MLA సంజయ్
మెట్ పల్లి అక్టోబర్ 07 (ప్రజా మంటలు):
ఎమ్మెల్యే డా.సంజయ్, క్యాంపు కార్యలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో, రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ, మక్క కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని,ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు త్తివ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు.
ప్రభుత్వమే మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇచ్చి క్వింటలకు 2800 ఇచ్చి మొక్కజొన్న కొనుగోలు చేయాలని, రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని,తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు పడుతున్నటువంటి కష్టాలను తీర్చేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆరోపించారు.
రైతులు కష్టపడి పండించినటువంటి మొక్కజొన్న పంటను ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు 1800 లకు కూడా కొనడం లేదు దానివల్ల తీవ్రంగా నష్టపోతున్నరని..
ప్రైవేట్ వ్యాపారులు 2000 లకు మొదట కొని తర్వాత తగ్గిస్తూ ఇప్పుడు 1800 కూడా కొనడం లేదని దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు..
ప్రవేట్ వ్యాపారులు ధర ఇంకా తగ్గించి 1600 లకు కొనే పరిస్థితి వచ్చిందని..
వర్షాలు పడుతున్నందున చేతికొచ్చిన మొక్కజొన్న పంటను రైతులు నిలువ చేసుకునే పరిస్థితి లేక తడిచిపోయే అవకాశం ఉండటంతో రైతులు పంటను దిక్కులేక దళారులకు అమ్మే పరిస్థితి వచ్చిందని.
దీన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు రైతుల దగ్గర మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తున్నారని..
రైతులను మోసం చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులకు చెక్ పెట్టాలంటే ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని..
ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఆలస్యం చేయడం వల్ల ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు రైతుల దగ్గర పంటను కొనుగోలు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని..
ప్రైవేట్ వ్యాపారుల చేతిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి ప్రస్తుతం 2400 మద్దతు ధర ఉన్న మొక్కజొన్న పంటను మెరుగైన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు..
వర్షాలు పడుతున్నందున పంట తడిచిపోయే ప్రమాదం ఉన్నందున రైతులు దిక్కులేక ప్రవేట్ వ్యాపరులకు అమ్ముకుంటున్నారని, గతంలో కేసీఆర్ గారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైతులను కూడదీసి BRS పార్టీ పక్షాన ప్రభుత్వం పై పోరాడాల్సి వస్తుందని,వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు నల్ల బ్యాడ్జీలతో జాతీయ రహదారిపై నిరసన... అడ్డుకున్న పోలీసులు

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్

ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు తోడ్పడాలి

మానసిక ఆరోగ్యం తోనే సమాజం అభివృద్ధి -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

హర్యానా ఐపీఎస్ అధికారి వై. పూరణ్ కుమార్ ఆత్మహత్య -డీజీపీ తో సహా 7 గురిపై FIR

పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)