టీడీఎఫ్- యూఎస్ఏ ఆధ్వర్యంలో కాలిఫోర్నియా డబ్లిన్ లో బతుకమ్మ
సికింద్రాబాద్, అక్టోబర్ 05 (ప్రజా మంటలు):
యూఎస్ ఏ కాలిఫోర్నియాలోని డబ్లిన్ నగరంలోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం -యూఎస్ఏ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు.
సుమారు వెయ్యి మంది తెలంగాణ ఎన్నారై వనితలు, కుటుంబ సభ్యులు పాల్గొని సాంప్రదాయబద్ధంగా బతుకమ్మలు ఆడారు. మహిళలు అందంగా పేర్చిన బతుకమ్మలతో ఆటపాటలతో సందడి చేశారు.
ముఖ్య అతిథులుగా టిడిఎఫ్ ఇండియా అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు రాజారెడ్డి వట్టే పాల్గొన్నారు. నిర్వాహకులు కీర్తి మణికొండ, సరిత రాజిడి, వందన, సరిత కేతిరెడ్డి, భార్గవి, సరిత రావి, శ్వేత, దివ్య పల్లవి, స్రవంతి రేవూరి, అర్పిత తదితరులు స్పాన్సర్లకు, అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు.
టిడిఎఫ్- యూఎస్ఏ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుంచి యుఎస్ లో టిడిఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్టు టిడిఎఫ్ యూఎస్ఏ అధ్యక్షులు శ్రీనివాస్ మణికొండ తెలిపారు, బతుకమ్మ పండుగని వివిధ దేశాల్లో విస్తరించిన ఘనత కేవలం టిడిఎఫ్ కే దక్కుతుందని వారు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిని వివిధ దేశాల్లో కాపాడే సంస్థ ఉందంటే అది టిడిఎఫ్ అని ఇది చెప్పుకోవడానికి సగర్వంగా ఉందని వారు తెలిపారు, రానున్న రోజుల్లో అటు అమెరికాతో పాటు తెలంగాణ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తెలంగాణ సంస్కృతి సంస్కృతిని కాపాడుతామని ఈ సందర్భంగా తెలియజేశారు. టిడిఎఫ్ ఆధ్వర్యంలో అమెరికాలో నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగ చూసి చాలా గర్వంగా ఉందని టిడిఎఫ్ ఇండియా అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి తెలిపారు, రానున్న రోజుల్లో ఎన్నారైలు అందరూ ఇదే విధంగా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. బతుకమ్మ, దసరా పండుగలను ఘనంగా నిర్వహించిన సభ్యులందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.

ధర్మజ్ఞాన ప్రవాహం... చాగంటి కోటేశ్వరరావు

గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి
