దొహలో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
దోహా,ఖతార్ లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలు
దోహా సెప్టెంబర్ 27:
తెలంగాణ జాగృతి ఖతార్ శాఖ ఆధ్వర్యంలో దోహాలో శుక్రవారం రాత్రి బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ సంబురాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. చిన్నపిల్లలు, యువతులు, మహిళలు ఈ సంబురాల్లో పాల్గొన్నారు.
ఖతార్ తెలంగాణ ఆడబిడ్డలతో కలిసి ఉత్సాహంగా కల్వకుంట్ల కవిత బతుకమ్మ ఆడారు.
*కవిత తెలంగాణ ఆడపడుచులను ఉద్దేశించి మాట్లాడుతూ,తెలంగాణ బిడ్డలు బతుకుదెరువు కోసం బొగ్గుబాయి.. దుబాయికి పోయిండ్రు అని చెప్పుకునేటోళ్లం.
ఇక్కడికి వచ్చిన వారి కష్టాలు మాకు తెలుసు.. తల్లిదండ్రులు, కుటుంబాలను విడిచిపెట్టి ఇక్కడ క్యాంపులల్లో ఉంటూ మీకు వచ్చే జీతంలో ఎంతో కొంత మిగిల్చి ఇంటికి పంపుతరు అని అన్నారు.
మీ మనసుల ఎంత దుఃఖం ఉంటదో తెలుసు.. ఆ దుఃఖం తీరాలని ప్రయత్నం చేస్తున్నాం.. త్వరలోనే మీరంతా తెలంగాణ కు వచ్చే మంచి రోజులు రావాలని, ఇక్కడే ఉన్నా బాగుండాలని కోరుకుంటున్నాం.ఏ పండుగ వచ్చినా అక్కడ ఉన్న మీ కుటుంబానికి మీరు గుర్తుకు వస్తారు..
నా మనసుకు కష్టంగా, బాధగా ఉంది.. కానీ జీవితంలో కొన్ని సందర్భాలు వస్తయ్.. యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు మనోడైనా.. మందోడు అయినా న్యాయం, ధర్మం ఎటు ఉందో చూడాలే
మీరు మనసుల మనది ఏం పెట్టుకోకండి.. మా సంగతి ఎట్లున్నా తెలంగాణ ప్రజలు బాగుండటం, తెలంగాణ హక్కులను రక్షించడం.. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడడమే ఊపిరిగా పని చేస్తాం అని హామీ ఇచ్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు నల్ల బ్యాడ్జీలతో జాతీయ రహదారిపై నిరసన... అడ్డుకున్న పోలీసులు

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్
