సామాజిక తెలంగాణే లక్ష్యం - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
జాగృతిలో చేరిన పలువురు కాంగ్రెస్, బీఎస్పీ నేతలు
హైదరాబాద్ సెప్టెంబర్ 25 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి లో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు పాండురంగా రెడ్డి, బీఎస్ పీ మల్కాజిగిరి ఇన్ చార్జి అందుగుల సత్యనారాయణ సహా పలువురు ఉద్యమకారుల కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతి లో చేరారు.
ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ, మనందరం ఆనాడు ఉద్యమంలో పనిచేశాం. రాష్ట్రాన్ని సాధించిన విన్నింగ్ టీమ్ గా నిలిచాం. ఇప్పుడు మన ముందున్న లక్ష్యం ఒక్కటే. . సామాజిక తెలంగాణను సాధించుకోవాలి అని కోరారు.
తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు బాగుండాలి.యువతరం, ఆడబిడ్డలు అందరూ బాగుండాలి. ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలని ఆలోచన చేస్తున్నాం. పెట్టుకున్న కొత్త లక్ష్యం కోసం పాత ఉద్యమకారుల పునరేకికరణ జరుగుతోందను ఆమె అన్నారు.
పాత శక్తులందరం కలిసిన సందర్భంగా మన పవర్ ఏంటన్నది తెలంగాణ సమాజం గమనిస్తది. ఇలాంటి పునరేకికరణ ద్వారా సమాజానికి మంచి జరుగుతుంది.
పాండురంగారెడ్డి అన్న డెడికేషన్ గురించి తెలంగాణ మొత్తం తెలుసు. ఆయన మీద ఎన్నో కేసులున్నాయి. ఆయన ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. తమ్ముడు యాదయ్య చనిపోతే పాండురంగారెడ్డి గారు చాలా ఎమోషనల్ అయ్యారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన వ్యక్తి.అలాంటి తను సామాజిక తెలంగాణ కోసం రావటం చాలా సంతోషం. ఇలాంటి శక్తులు మనకు ఒక్కో జిల్లాలో యాడ్ అవుతూ ఉన్నారు.
వారందరినీ ఓపెన్ హార్ట్ తో వెల్ కమ్ చేస్తున్నాం. ఉద్యమకారులు కూడా ఉద్యమకారుల ఫోరమ్ పేరుతో పనిచేసేందుకు ముందుకు వస్తున్నారు.కళాకారులు కూడా తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరుతున్నారు. ముఖ్యంగా పేదల పక్షాన నిలవటమే జాగృతి ప్రధాన లక్ష్యం.
కుత్భుల్లాపూర్ లో హైడ్రా పేదల ఇళ్లు కూల్చితే మొదట వారికి మద్దతుగా నిలిచింది జాగృతియే.
పేదల పక్షాన పనిచేసే శక్తిగా తెలంగాణ జాగృతి ఎదుగుతుంది. జాగృతి లో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని కవిత అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.

ధర్మజ్ఞాన ప్రవాహం... చాగంటి కోటేశ్వరరావు

గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి
