వైద్యుల పై దాడి చేసిన దోషుల పై చర్యలు తీసుకోవాలి
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్
లేని పక్షంలో రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనలు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 23 (ప్రజామంటలు) :
మహబూబాబాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీనివాస్ పై జరిగిన సామూహిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరహరి,సెక్రటరీ జనరల్ డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ లు పేర్కొన్నారు. అందులో భాగంగా గాంధీ యూనిట్ తెలంగాణ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎంతటి వారైనా వైద్యుల పై దాడి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఈ దారుణ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిని అరెస్టు చేయాలని కోరారు. గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్ మాట్లాడుతూ వైద్యులు దేవుళ్లు కాదని – ప్రతి రోగి ప్రాణాన్ని కాపాడేందుకు వైద్యులు ఎల్లప్పుడూ తమ వంతు కృషి చేస్తారని,ఏ వైద్యుడు కూడా ఉద్దేశపూర్వకంగా హాని చేయడని, ఇలాంటి హింసాత్మక చర్యలు సమాజానికి హానికరమని,అంకితభావంతో పని చేసే డాక్టర్ల మనో ధైర్యాన్ని దెబ్బ తీస్తాయని అన్నారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ నిష్పాక్షికంగా, పారదర్శకంగా దర్యాప్తు చేసి దోషులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము రాష్ర్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
గాంధీ యూనిట్ సెక్రటరీ జనరల్ డాక్టర్ అబ్బయ్య , కోశాధికారి డాక్టర్ రవి , రాష్ట్ర నాయకులు డాక్టర్ మురళి, డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ వెంకట మణి, డాక్టర్ రాంబాబు, డాక్టర్ వంశీ కృష్ణ , డాక్టర్ దివ్యా రాణి, డాక్టర్ సుబోధ్, డాక్టర్ కృపాల్ సింగ్, డాక్టర్ రాజేష్, డాక్టర్ నాజిమ్, డాక్టర్ మురళీ కృష్ణ, డాక్టర్ నవీన్, డాక్టర్ రమేశ్ , డాక్టర్ లక్ష్మీ కాంత్ , డాక్టర్ మీనాక్షీ, డాక్టర్ సరిత తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు నల్ల బ్యాడ్జీలతో జాతీయ రహదారిపై నిరసన... అడ్డుకున్న పోలీసులు

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్

ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు తోడ్పడాలి

మానసిక ఆరోగ్యం తోనే సమాజం అభివృద్ధి -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

హర్యానా ఐపీఎస్ అధికారి వై. పూరణ్ కుమార్ ఆత్మహత్య -డీజీపీ తో సహా 7 గురిపై FIR

పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)