తనను కుటుంబానికి దూరం చేసిన వారి భరతం పడతాను - కల్వకుంట్ల కవిత

On
తనను కుటుంబానికి దూరం చేసిన వారి భరతం పడతాను -  కల్వకుంట్ల కవిత

చింతమడకలో బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత
అదే చింతమడకలో బతుకమ్మ ఆడేందుకు నన్నుఆహ్వానించటం సంతోషంగా ఉంది. 

దుబ్బాక సెప్టెంబర్ 21 (ప్రజా మంటలు):

స్వగ్రామం చింతమడకలో గ్రామస్తులతో కలిసి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎంగిలి పూల బతుకమ్మ ఆడారు.అంతకు ముందు ఒగ్గుడోలు, డప్పు నృత్యాలు, సంప్రదాయ వాయిద్యాలతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.చింతమడక శివాలయంలో కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు, అభిషేకం చేయించుకున్నారు.

మాదిగ సంఘం చింతకమడక గ్రామ అధ్యక్షుడు జింక స్వామి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చిన్నరాం ముత్యం నివాసాలలో  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బతుకమ్మ పేర్చారు.IMG_20250921_201729

రామాలయంలో ప్రత్యేక పూజలు.. హైస్కూల్ గ్రౌండ్ లో గ్రామస్తులతో కలిసి ఎంగిలి పూల బతుకమ్మ ఆడారు.

చింతమడకలో ప్రజలతో కవిత కమెంట్స్

తనను కుటుంబానికి దూరం చేసిన వారి భరతం పడతానని హెచ్చరించారు. చంద్రుడి లాంటి కేసీఆర్ కు మచ్చ తెచ్చారని, భవిష్యత్ లో సొంతూరే కర్మ భూమి కావచ్చని అన్నారు.తండ్రి, తల్లి బాగుండాలని అనుకునే నన్ను విడగొట్టే ప్రయత్నం చేశారు.ఏ ఊరు ఎవ్వరీ అయ్యా జాగీరు కాదు. వాళ్ల భరతం కూడా భవిష్యత్ లో పడతాం.

సిద్దిపేట, చింతమడక తమ జాగీరుగా భావించే వాళ్లకు బుద్దిచెపప్తా.ఎంత ఎక్కువ ఆంక్షలు పెడితే అన్ని ఎక్కువ సార్లు వస్తాను.చింతమడక గ్రామమంటే చరిత్ర సృష్టించిన గ్రామం

చింతమడక ముద్దుబిడ్డ కేసీఆర్. ఎవ్వరు మాట్లాడకముందే తెలంగాణ కోసం కంకణబద్దులయ్యారు. మొత్తం రాష్ట్రమంతా తిరిగి అందరినీ మేల్కొలిపి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయారు. 
 
ఆయన ముందడుగు వేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. చింతమడక మట్టి నుంచి ఒక ఉద్యమం పుట్టింది. అదే దేశ, రాష్ట్ర చరిత్రను మార్చింది. 

అదే చింతమడకలో బతుకమ్మ ఆడేందుకు నన్నుఆహ్వానించటం సంతోషంగా ఉంది. 

చాలా ఏళ్లుగా నేను చింతమడకకు రాలేదు. గతేడాది ఒక రకమైన బాధాకార పరిస్థితులుండే. ఈ ఏడాది కూడా ప్రత్యేక పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో నన్ను అక్కున చేర్చుకొని రమ్మన్నందుకు సంతోషంగా ఉంది. 

సొంత ఊరంటే చాలా మందికి ప్రేమ ఉంటుంది. చింతమడకలో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. కులాలకు, మతాలకు అతీతంగా అన్ని పండుగలు చేసుకున్నట్లు నాకు బలంగా గుర్తుంది. 

చిన్నప్పుడు ఇక్కడకు వచ్చి అన్ని కులాలను కలుపుకొని బతుకమ్మ ఆడుకున్నాం. అన్ని కులాలను కలుపుకోవాలని చింతమడక ఏదైతే నేర్పించిందో...అదే ధైర్యంగా తీసుకున్నాను. 

తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెలో బతుకమ్మ ఎత్తుకొని కాళ్లకు బలపం కట్టుకొని తిరిగాను. చింతమడక ఇచ్చిన ధైర్యంతోనే నేను అదంతా చేయగలిగాను. 

ఉద్యమం ప్రారంభమైన తర్వాత కేసీఆర్ గారు ఇక్కడ రిజైన్ చేసి ఇంకొకరిని ఇక్కడ పెట్టారు. ఆనాటి నుంచి సిద్దిపేట, చింతమడక రావాలంటే అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ, అదేదో కేజీఎఫ్ లాగా ఇక్కడ ఆంక్షలు పెట్టారు. 

ఇవ్వాళ్టికి కూడా ఆ ఆంక్షలు ఉన్న సంగతి మీకు తెలిసిందే.  కానీ చింతమడక కేసీఆర్ అనే చిరుతపులిని కన్న గడ్డ.  ఇలాంటి గడ్డ మీద ఎవరీ ఆంక్షలు నై జాన్తా అని మొత్తం ఊరంతా నిరూపించింది. 

ఇదే ఒరవడి కొనసాగాలని నేను ఆంకాంక్షిస్తున్నా. మీ ఆశీర్వాదంతో కేసీఆర్ ఒకసారి భూకంపం పుట్టించి, తెలంగాణ తెచ్చి మీ ముందు పెట్టారు. 

మరి మీరు ఆశీర్వాదంతో ఇస్తే ఇదే నా జన్మభూమి కూడా కర్మభూమి కావచ్చు. ఆనాడు ఆంధ్రోళ్లు వందల ఆంక్షలు పెట్టినా బుల్లెట్లకు ఎదురుపోయి ఉద్యమం చేసిన చరిత్ర మనకు ఉంది. 

ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఆగేదీ లేదు. కచ్చితంగా చింతమడకకు, సిద్దిపేటకు మళ్లీ మళ్లీ వస్తాం. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం. చింతమడక తలెత్తుకొనే విధంగా కేసీఆర్ తెలంగాణ తెచ్చారు. 

ఆయనను ఇక్కడ చంద్రుడు అని పిలుస్తారు. అలాంటి చంద్రునికి కొంతమంది మచ్చ తెచ్చే పని కొంతమంది చేశారు.మచ్చ తెచ్చారని చెప్పగానే తల్లిని, పిల్లను కాకుండా పాపిన్రు. కుటుంబానికి దూరం చేశారని బాధలో ఉన్న సమయంలో మీరు నాకు అండగా నిలిచారు. 

పెళ్లి అయి కుటుంబాన్ని వదిలేస్తేనే ఎంతో బాధ ఉంటది. అలాంటిది తల్లి, తండ్రి బాగుండాలని కొట్లాడే నన్ను కుటుంబానికి దూరం చేసే కుట్ర చేసిన వాళ్లను వదలిపెట్టను. ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందో చూపిస్తా. ఆ ప్రయాణంలో మీరు నాకు అండగా ఉండాలని కోరుతున్నా. 

ఏ ఊరు కూడా ఎవరీ అయ్య జాగీరు కాదు. కానీ కొంతమంది జాగీరుగా భావిస్తున్నారు. వాళ్ల సంగతి, వాళ్ల భరతం భవిష్యత్ లో కచ్చితంగా పడతాం. 

చింతమడకకు రావటం సంతోషంగా ఉంది.ఈ ఏడాది నన్ను అక్కున చేర్చుకున్నందుకు,నాకు అనేక జ్ఞాపకాలు ఉంటాయి. 7,8,9 తరగుల వరకు బతుకమ్మ ఆడుకున్నాం. చింతమడక మనకు అన్ని కులాలు, మతాలను 

తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెలో కాళ్లకు బలపం కుట్టుకొని తిరిగా.ఉద్యమం లేనప్పుడు చింతమడకకు వచ్చిన జ్ఞాపకాలు ఉన్నాయి. 

చింతమడక లో ఆనాటి నుంచి సిద్దిపేట, చింతమడక రావాలంటే కేజీఎఫ్ లాగా ఉంది. ఆంక్షలు ఉన్నాయి. 

ఈ చింతమడక గడ్డ చిరుత పులిని కన్న గడ్డ ఇదే ఒరవడి కొనసాగాలె. ఎవర్రీ ఆంక్షలు. నా జన్మ భూమియే కర్మభూమి అయ్యే అవకాశం ఉంది. 

మనం తెలంగాణోళ్లం, ఆంక్షలకు ఎదురొడ్డి తోసుకొని పోయి ఆంక్షలు పెడితే చింతమడకకు, సిద్దిపేటకు మళ్లీ మళ్లీ వస్తాం. కేసీఆర్ తల ఎత్తుకొనే విధంగా రాష్ట్రం తెచ్చారు. 

 

Tags
Join WhatsApp

More News...

Local News 

గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం 

గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం  సికింద్రాబాద్  అక్టోబర్10 (ప్రజా మంటలు) :   అదుపు తప్పిన ఆలోచనలు, భావోద్వేగాలను నియంత్రించుకుంటే సమస్యలను ఎదుర్కొనే సత్తా సాధించగలమని పలువురు మానసిక వైద్యనిపుణులు సూచించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురష్కరించుకుని గాంధీ సైకియాట్రి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం పలు అవగాహన కార్యక్రమాలు, చైతన్యర్యాలీ చేపట్టి, ప్లాస్‌మాబ్, నృత్యరూపకాలను ప్రదర్శించారు. గాంధీ మెడికల్‌ కాలేజీ శారీరక,మానసిక,...
Read More...
Local News 

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం సికింద్రాబాద్, అక్టోబర్ 10 (ప్రజామంటలు): సికింద్రాబాద్ సీతాఫల్మండి లోని బీఎన్ఆర్ గార్డెన్ లో ఈనెల 12 ఆదివారం ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్వర్యంలో దసరా సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు జాతీయ ముదిరాజ్ సంఘ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్లు తెలిపారు. దసరా సమ్మేళన కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ , ముదిరాజ్ సంఘ వ్యవస్థాపక...
Read More...
Local News 

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి సికింద్రాబాద్, అక్టోబర్ 10 (ప్రజామంటలు): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టతో బీసీలకు నలభై రెండు శాతాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  బీసీలకు సరైన న్యాయం చేసే దిశగా ఎంతో ఆలోచించి తీసుకురావడం జరిగిందని, కానీ కొన్ని కారణాలవల్ల కోర్టు నుంచి నాలుగు నెలలు స్టే ఆర్డర్ రావడం విచారకరమని ముదిరాజ్ రాష్ర్ట నాయకుడు...
Read More...
Local News 

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన 

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన  సికింద్రాబాద్, అక్టోబర్ 10 (ప్రజామంటలు) : దేశవ్యాప్తంగా జాతీయ పెన్షనర్ల సంఘాల సమన్వయ కమిటీ (ఎన్సీసీపీఏ) పిలుపు మేరకు శుక్రవారం రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో అఖిల భారత రిటైర్డ్‌ రైల్వే మెన్స్‌ ఫెడరేషన్‌  ఆధ్వర్యంలో 300 మందికి పైగా పింఛనర్లు సికింద్రాబాద్ లోని రైల్‌నిలయం ఎదుట శాంతియుతంగా నిరసన చేపట్టారు.పెన్షన్‌...
Read More...
State News 

రాష్ర్టంలో వేద పాఠశాలల  అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

రాష్ర్టంలో వేద పాఠశాలల  అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సికింద్రాబాద్, అక్టోబర్ 10 (ప్రజామంటలు): రాష్ర్టంలోని వేద పాఠశాలల అభివృద్దికి ప్రభుత్వ సహాకారం తప్పకుండా ఉంటుందని, పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తామని రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. పద్మారావునగర్ లోని స్కందగిరి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీజనార్ధనానంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ 25వ వేద విద్వాన మహాసభకు ఆమె శుక్రవారం...
Read More...
Local News 

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం సికింద్రాబాద్, అక్టోబర్ 10 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో  మంచుకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఫ్యూరిఫైడ్ వాటర్ కేంద్రాలను శుక్రవారం ఆసుపత్రి సూపరింటెండెట్ ప్రొఫెసర్ ఎన్.వాణి ప్రారంభించారు. ఆసుపత్రిలో పేషంట్లు, వారి సహాయకులు, సందర్శకులకు ఉచితంగా శుద్దమైన వాటర్ అందించే  కేంద్రాలను ఏర్పాటు చేసిన మంచుకొండ ఫౌండేషన్ నిర్వాహకులను ఈసందర్బంగా ఆమె అభినందించారు....
Read More...
Local News 

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_  ఎస్పీ అశోక్ కుమార్

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_   ఎస్పీ అశోక్ కుమార్    జగిత్యాల, అక్టోబర్ 10(ప్రజా మంటలు) మెటా ఫండ్ ప్రో అనే నకిలీ యాపులో ప్రజలతో పెట్టు బడులు పెట్టించి యాప్ మూసేసి ప్రజలను మోసం చేసిన కేసులో కీలక వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు  చేసిన విలేఖరుల సమావేశం లో ఎస్పీ...
Read More...
Local News 

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి జగిత్యాల అక్టోబర్ 10 ( ప్రజా మంటలు)తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని  తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. ఈసందర్భంగా తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ శుక్రవారం సాయంత్రం పత్రిక ప్రకటన విడుదల చేశారు.   తనపై నమ్మకంతో అసిఫాబాద్,...
Read More...
Local News 

సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్ 

సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్  జగిత్యాల అక్టోబర్ 10 ( ప్రజా మంటలు) సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని పట్టణ సిఐ పి .కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం అన్నారు. జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయంలో విద్యార్థులకు పోలీస్ కళాబృందాలచే ఓ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ గంజాయి నిర్మూలన వాడకం...
Read More...
National  State News  International  

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి న్యూ ఢిల్లీ అక్టోబర్ 10:నార్వేజియన్ నోబెల్ కమిటీ 2025 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతిని మారియా కొరినా మచడో గారికి ప్రదానం చేయాలని నిర్ణయించింది. బహుమతికి భూమిక:"వెనిజులా ప్రజల ప్రజాస్వామిక హక్కుల ప్రచారంలో ఆమె చేసిన అవిరత పని మరియు అధినాయకవాదం నుండి ప్రజాస్వామ్యంలోకి న్యాయమైన మరియు శాంతియుతమైన పరివర్తన కోసం ఆమె...
Read More...
Local News 

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు  మెట్పల్లి అక్టోబర్ 10 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమండ్లు ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలుపుతూ జాతీయ రహదారిపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆకుల హన్మాండ్లు...
Read More...
Local News 

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్    జగిత్యాల అక్టోబర్ 10 ( ప్రజా మంటలు)  మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా ఎన్నికైన సిరిపురం మహేంద్ర నాథ్ ను  సన్మానించిన భారత్ సురక్ష  సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు యువ న్యాయవాది జగిత్యాల్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సిరిపురం మహేంద్ర నాథ్ జగిత్యాల మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైనందున స్థానిక...
Read More...