స్కామ్ లతో సింగరేణిని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత

On
స్కామ్ లతో సింగరేణిని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ కి కరప్షన్ గనిగా మారిన సింగరేణి - దసరా తర్వాత సింగరేణి యాత్ర చేస్తాం
హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఎమ్మెల్సీ కవిత చర్చలు
హెచ్ఎంఎస్ తో కలిసి సింగరేణి జాగృతి పనిచేస్తుంది సింగరేణి కార్మికులకు 37 శాతం బోనస్ ప్రకటించాలి సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ ఆగస్ట్ 10 (ప్రజా మంటలు):

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కరప్షన్ గనిగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఉద్యోగ నియామకాలతో సహా అన్నింట్లో కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ అంచనా వ్యయాలను రాత్రికి రాత్రే అమాంతం పెంచారని దుయ్యబట్టారు.

సింగరేణిని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ సింగరేణిలో రాజకీయ అవినీతిని అంతం చేశారని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో రాజకీయ అవినీతి పెరిగిందని స్పష్టం చేశారు. కాబట్టి సింగరేణి సంస్థ కేంద్ర విజిలెన్స్, సీబీఐ పరిధిలోకి వచ్చే విధంగా సంస్థ మారాలని అభిప్రాయపడ్డారు. కార్మికులకు భరోసా ఇవ్వడానికి త్వరలో సింగరేణి యాత్ర చేపడుతామని ప్రకటించారు. ప్రశ్నిస్తే ఉద్యోగాలను తీసేసే దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయని, దానికి అడ్డుకట్టవేస్తామని తేల్చిచెప్పారు.

IMG-20250810-WA0009

ఆదివారం నాడు బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఎమ్మెల్సీ కవిత మధ్య కీలక చర్చలు జరిగాయి. తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థ అయిన సింగరేణి జాగృతి, హెచ్ఎంఎస్ సంఘం కలిసి పనిచేయాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడుతూ... సింగరేణి ప్రాంతం మినీ ఇండియాగా మారిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సింగరేణిని కాపాడుకోవాలన్న కృతనిశ్చయంతో కేసీఆర్ ఎంతో కృషి చేశారని, ఇప్పుడు దాదాపు 40 వేల మంది ఉద్యోగులతో సింగరేణి కలకలలాడుతోందని అన్నారు. ఏటా ఐదు గనులు తెరిచినా కూడా 185 గనులు తెరిచేంత బొగ్గు నిల్వలు తెలంగాణ భూగర్భంలో ఉన్నాయని చెప్పారు.

సింగరేణిలో అండర్ గ్రౌండ్ మ్యాన్యువల్ గనులను తెరవాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల పెద్ద వాళ్లకే లాభమవుతుందని, పైగా కాలుష్యం తీవ్రమవుతోందని అన్నారు. సగటున ఒక్కో సింగరేణి కార్మికుడు రోజుకు ఆరు టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తారని, అంటే ఒక్కో కార్మికుడు రోజుకు దాదాపు రూ 30 వేలను ప్రభుత్వానికి సంపాదించిపెడుతున్నారని వివరించారు. కానీ సింగరేణి కార్మికులు ప్రభుత్వం ఇచ్చేది చాలా తక్కువగా ఉంటుందని, పైగా జీతంపై ప్రధాని మోదీ ఆదాయపు పన్ను కూడా విధిస్తున్నారని మండిపడ్డారు.

సింగరేణి ఉద్యోగులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణం కోసం కేసీఆర్ సింగరేణి కార్మికులకు  రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను ఇప్పించారని పేర్కొన్నారు. 22 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైలేవల్ కమిటీ చేసిన సిఫారసుల మేరకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కార్మికుల సంక్షేమం ప్రధాన ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తామని తెలిపారు. కార్మికుల హక్కుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడుతామని స్పష్టం చేశారు. గత బోనస్ విషయంలో కార్మికులను కాంగ్రెస్ పార్టీ నయవంచనకు గురి చేసిందని, లాభాల్లో 33 శాతం వాటా బోనస్ గా ఇస్తున్నామని చెప్పి అసలు లాభాలనే తక్కువ చేసి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులు ఏడాది దసరాకు బోనస్ గా లాభాల్లో 37 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.IMG-20250810-WA0007

హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఎమ్మెల్సీ కవిత చర్చలు

హెచ్ఎంఎస్ కార్మిక సంస్థ సుభాష్ చంద్రబోస్ పెట్టిన సంస్థ అని, బ్రిటీష్ హయాంలో కార్మికుల కోసం పోరాడడానికి ఏర్పాటు చేసిన సంస్థ అని, అది ఇక్కడ స్వతంత్రంగా పనిచేస్తోందని వివరించారు. హెఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అనేక కార్మిక ఉద్యమాలు చేపట్టారని, సింగరేణి కార్మికుల కోసం కొట్లాడి అధిక బోనస్ సాధించడంలో కీలక పాత్రపోషించారని కొనియాడారు. హెచ్ఎంఎస్ తో కలిసి సింగరేణి జాగృతి కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు.  ఈ కలయిక భవిష్యత్తులో అన్ని వామపక్ష పార్టీల అనుబంధ సంఘాల ఐక్యతకు దారితీస్తుందని చెప్పారు. కాగా, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి (టీబీజీకేఎస్)  తాను గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నానని, కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతీ ఒక్కరు కలిసి పనిచేయాల్సిందేనని వివరించారు.

Tags

More News...

National  State News 

CBSE 9వ తరగతిలో ఓపెన్ బుక్ పద్దతి పరీక్షలు

CBSE 9వ తరగతిలో ఓపెన్ బుక్ పద్దతి పరీక్షలు న్యూఢిల్లీ ఆగస్టు 10: CBSE తీసుకున్న పెద్ద నిర్ణయం వల్ల, ఇప్పుడు 9వ తరగతి విద్యార్థులు ఓపెన్ బుక్ తో పరీక్ష రాయగలరు;CBSE తదుపరి విద్యా సంవత్సరం 2026-27 నుండి తొమ్మిదో తరగతి విద్యార్థుల కోసం ఓపెన్ బుక్ అసెస్‌మెంట్ (OBA) పథకాన్ని ప్రారంభించబోతోంది. ఈ పథకం కింద, విద్యార్థులు భాష, గణితం, సైన్స్...
Read More...
Local News  State News 

బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ -మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ -మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల ఆగస్టు 10 (ప్రజా మంటలు):   జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, ఓరుగంటి రమణారావు తదితరులు పాల్గొన్నారు. కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడుతూ, బీసీ లను...
Read More...
Local News  State News 

స్కామ్ లతో సింగరేణిని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత

స్కామ్ లతో సింగరేణిని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ కి కరప్షన్ గనిగా మారిన సింగరేణి - దసరా తర్వాత సింగరేణి యాత్ర చేస్తాం హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఎమ్మెల్సీ కవిత చర్చలు హెచ్ఎంఎస్ తో కలిసి సింగరేణి జాగృతి పనిచేస్తుంది సింగరేణి కార్మికులకు 37 శాతం బోనస్ ప్రకటించాలి సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలి తెలంగాణ జాగృతి...
Read More...
Local News 

మెట్టుగూడ మెట్రో పిల్లర్ వద్ద గుర్తు తెలియని డెడ్ బాడీ

మెట్టుగూడ మెట్రో పిల్లర్ వద్ద గుర్తు తెలియని డెడ్ బాడీ సికింద్రాబాద్, ఆగస్టు 10 (ప్రజా మంటలు):  చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధి లోని మెట్టుగూడ వద్ద గుర్తు తెలియని డెడ్‌బాడీ లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మెట్టుగూడ మెట్రో పిల్లర్ నంబర్ 1084 వద్ద గుర్తుతెలియని వ్యక్తి ( సుమారు 55- 60) డెడ్‌బాడీ పడి ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు వెళ్లి...
Read More...
Local News  State News 

రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎక్కువైతే పిల్లల‌కు ముప్పే - కిమ్స్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ రుమటాలజీపై స‌ద‌స్సు

రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎక్కువైతే పిల్లల‌కు ముప్పే - కిమ్స్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ రుమటాలజీపై స‌ద‌స్సు   వాస్క్యులైటిస్, ఆర్థరైటిస్, క‌వాసాకి డిసీజ్‌లు వ‌చ్చే ప్రమాదం  వీటిని జాగ్రత్తగా గ‌మ‌నించి స‌త్వర చికిత్సలు అందించాలి    లేనిప‌క్షంలో ప్రాణాల‌కే ప్రమాదం వాటిల్లే అవ‌కాశం    ప్రపంచ ప్రఖ్యాత వైద్యనిపుణుడు ప్రొఫెస‌ర్‌ సుర్జీత్ సింగ్‌  సికింద్రాబాద్, ఆగస్ట్ 10 (ప్రజామంటలు) : సాధార‌ణంగా మ‌న శ‌రీరంలో ఉండే రోగ‌నిరోధ‌క శ‌క్తి బ‌య‌టి నుంచి వ‌చ్చే బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్లపై పోరాడుతుంది....
Read More...
Local News 

ఫుట్ పాత్ అనాధలకు రాఖీలు కట్టిన స్కై ఫౌండేషన్ సభ్యులు

ఫుట్ పాత్ అనాధలకు రాఖీలు కట్టిన స్కై ఫౌండేషన్ సభ్యులు సికింద్రాబాద్  ఆగస్టు 10 (ప్రజా మంటలు): సిటీలోని ప్రధాన రహదారుల పక్కన ఫుట్ పాత్ లపై దుర్భర జీవనం గడుపుతున్న అనాధలకు, నిరాశ్రయులకు మేము ఉన్నాము.. అని స్కై ఫౌండేషన్ ఆర్గనైజర్లు అండగా నిలిచారు. రక్షాబంధన్ పండుగ వేడుకల సందర్భంగా అందరూ వేడుకలు చేసుకుంటుంటే అనాధల వద్దకు వెళ్లిన వీరు మీకు మేము  ఉన్నామని అంటూ...
Read More...
National  International  

ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు

ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు అదే దారిలో ఇండియా,కెనడా దేశాలు మాడ్రిడ్ ఆగస్ట్ 09: F-35 విమానాలను స్పెయిన్ తిరస్కరించింది, US జెట్ ఒప్పందం నీరుగారిపోయింది, ట్రంప్ కలలు చెదిరిపోయాయి. గతంలో అమెరికాతో ఎఫ్ 35 జెట్ ఫైటర్ విమానాల కొనుగోలో ఒప్పందంను స్పెయిన్ రద్దు చేసుకోవాలనుకున్నాడు.అమెరికా నుండి F-35 కొనుగోలును కెనడా పునరాలోచించుకుంటోంది స్పెయిన్ చర్య ఇతర దేశాల ప్రాధాన్యతలు...
Read More...
National  Local News  State News 

మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం

మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం న్యూఢిల్లీ ఆగస్ట్ 09: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలోని ధరాలిలో, ఆగస్టు 5, 2025 మంగళవారం, రోజున కురిసిన వర్షానికి,  మేఘావృతం కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలో ఇళ్లు కొట్టుకుపోయాయి. ఉత్తరాఖండ్‌లోని ధరాలి గ్రామం ఆకస్మిక వరదలతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది; విధ్వంసం మధ్య ప్రాణాలతో బయటపడినవారు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు శనివారం నాటికి హెలికాప్టర్లను ఉపయోగించి 825...
Read More...
Local News  State News 

గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు సికింద్రాబాద్, ఆగస్ట్ 09 (ప్రజామంటలు ) :   రాఖీ పౌర్ణమి సందర్భంగా గాంధీ ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యులు నర్సులు, పోలీసులు, సిబ్బంది, రోగులు, వారి సహాయకులకు చిన్నారులు రాఖీలు కట్టారు. జనహిత సేవా ట్రస్ట్,జానకి జీవన్ ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్ డ్  స్కూల్ విద్యార్థులు, వాత్సల్య సింధు ఆశ్రమం, వైదేహి ఆశ్రమానికి చెందిన చిన్నారులు వారికి...
Read More...
Local News  Spiritual   State News 

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క కిమ్స్ హాస్పిటల్‌లో రాఖీ కట్టి ధైర్యం చెప్పిన సోదరిసికింద్రాబాద్ ఆగస్టు09 (ప్రజామంటలు):   రాఖీ కట్టి ధైర్యం చెప్పడం ఒకటి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ్ముడి ప్రాణం కాపాడడం మరొకటి. ఆ రెండవది చేయాలంటే అసాధారణ ధైర్యం కావాలి. మానవ సంబంధాలు రోజు,రోజుకి  క్షీణిస్తున్న ప్రస్తుత  రోజుల్లో, ఓ అక్క తన తమ్ముడి కోసం వివరాలు...
Read More...
Local News 

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం   కదిలిన విద్యుత్ యంత్రాంగం 

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం    కదిలిన విద్యుత్ యంత్రాంగం     మెట్పల్లి ఆగస్ట్ 9 ( ప్రజా మంటలు) రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ ప్రమాదాలను సమూలంగా నిర్మూలించడానికి, ఏళ్ల తరబడి మిగిలిపోయిన, పాతబడిపోయి దుర్భరంగా, ప్రమాదకరంగా ఉన్న నెట్వర్క్ ను సరిదిద్దే ప్రక్రియకు ఎన్పీడీసీఎల్ యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా ప్రతి సెక్షన్లో కనీసం రోజుకు రెండు చొప్పున ప్రమాదాలకు అవకాశం ఉన్న...
Read More...
Local News 

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు.  దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన .  జగిత్యాల ఆగస్టు 9 ( ప్రజా మంటలు) పట్టణం మార్కెట్లోని ప్రముఖ భవానీ శంకర శ్రీనివాసా ఆంజనేయస్వామి  దేవాలయం కి అడ్డంగా షెడ్లు వేసుకొని కూరగాయల దుకాణాలు నిర్వహిస్తూ భక్తులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం పెద్ద ఎత్తున భక్తులు ఆందోళనకు దిగారు. మార్కెట్లో అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్రతిరోజు...
Read More...