గాంధీ ఆసుపత్రిని 3 వేల పడకలకు అప్ గ్రేట్ చేయాలి
సమస్యలను తీర్చాలని ప్రభుత్వానికి వినతి
- గాంధీ ఆసుపత్రిలో పీవైఎల్ ప్రతినిధుల పర్యటన
సికింద్రాబాద్, సెప్టెంబర్ 01 (ప్రజామంటలు) :
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రుల్లో ఒకటైన గాంధీ ఆసుపత్రి మూడు వేల పడకలతో, అన్ని సౌకర్యాలతో ఆప్ గ్రేట్ చేయాలని ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ (పీ.వై.ఎల్) నాయకులు డిమాండ్ చేశారు. వేల పడకల పరిమితిని కలిగి ఉన్నా, రోజూ దాదాపు రెండున్నర వేల మంది రోగుల ఇన్ పేషెంట్లు రావడంతో ఆసుపత్రిలో అనేక సౌకర్యాలతో రోగులు అవస్థ పడుతున్నారన్నారు. పి.వై.ఎల్ గ్రేటర్ హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆసుపత్రిని సందర్శించారు. రోగులతో, వారి సహాయకులతో మాట్లాడారు ఎమర్జెన్సీ బ్లాక్ ఇతర ఓ.పి బ్లాకులను సందర్శించారు. వారి దృష్టికి వచ్చిన సమస్యలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాజకుమారి దృష్టికి తీసుకెళ్లారు. ఎమర్జెన్సీ వార్డులో నీళ్లు పై నుంచి లీకవుతున్నాయని, టాయిలెట్స్ వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని, స్కానింగ్ మెషిన్లు ఒకటే పని చేయడంతో పేషెంట్లు 10, 15 రోజులు డేట్లు ఇస్తున్నారని, ఓపికౌంటర్లు సరిపోక గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించి ఇబ్బందులు తొలగించాలని లేనియెడల ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.పీ.వై.ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం . రవికుమార్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష కార్యదర్శులు బి.ఎస్. కృష్ణ కొల్లూరు భీమేష్, హైదరాబాద్ ఉపాధ్యక్షులు కుంబోజి కిరణ్, కే. మల్లేష్, సహాయ కార్యదర్శిలు బంగారు శ్రీనివాస్, బాలు, నగర కోశాధికారి ప్రకాష్, నగర నాయకులు రాజు, సాయి, అంజి, రాము, అశోక్,టీయూసీఐ నాయకులు తలారి వెంకటేష్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గీత భవన్ లో కొనసాగుతున్న అష్టాదశ పురాణ ప్రవచనం

కొడిమ్యాల పోలీసుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు

బీహార్ లో తేజస్విని సీఎం చేయడంపై కాంగ్రెస్ సందేహాలు?
.jpeg)
సోషల్ మీడియా అప్ లను నిషేధించిన నేపాల్ ప్రభుత్వం
.jpeg)
కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పై గాంధీలో ర్యాలీ

నల్లగుట్ట స్కూల్ లో ఘనంగా టీచర్స్ డే సెలబ్రేషన్స్...

గాంధీ ఆసుపత్రిలో పెయిన్ క్లినిక్ ప్రొసీజర్ రూమ్ ప్రారంభం

ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా పోటీలలో విద్యార్థుల ప్రతిభ

బైకుల దొంగ దంపతులను పట్టించిన సీసీ టీవీ ఫుటేజీ

కేరళ తరహాలో వయోధికులకు కమిషన్ ఏర్పాటు చేయాలి
.jpeg)
పడకేసిన పారిశుధ్యం - మొద్దు నిద్రలో వైద్య అధికారులు

మల్లాపూర్ మం. నడికుడ జి.పి.లో హక్కుల కమిటీచే రికార్డుల తనిఖీ
