కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ జపం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
వరదలు వస్తే ఆదుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉంది.
సిబిఐ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.
హరీష్ రావు,సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్సెప్టెంబర్ 01 (ప్రజా మంటలు):
ప్రజలకు న్యాయం చేయలేక, కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ జపం చేస్తోందని,కేసీఆర్ పై సీబీఐ విచారణ చేసే పరిస్థతి వచ్చింది అంటే పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత, పార్టీ నాయకత్వం దీన్ని వ్యతిరేకించి, కనీసం రాష్ట్ర బంద్ కు కూడా పిలుపు ఇవ్వలేని స్థితిలో ఉందా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
అమెరికా నుండి తిరిగి వచ్చిన కవిత పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ అనేక అంశాలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పి.సి.ఘోష్ కమిషన్ పేరుతో టైం పాస్ చేస్తోంది.రేవంత్ రెడ్డికి కేసీఆర్ పెరు చెప్పకపోతే పేపర్ లో ఫోటో రాదు.నేను డైరెక్ట్ గా పేర్లు చెప్పిన వారిపై విచారణ చేయండి.మీకు,మీకు ఒప్పందాలు ఉన్నాయి
మేము ఎంపీలుగా ఉన్నప్పుడు ఆరు నెలల ముందు యూరియా కోసం కేసీఆర్ మమ్మల్ని అలెర్ట్ చేసేవారు. కాలేశ్వరం లాంటి తరగని ఆస్తిలో మేడిగడ్డ అనేది చిన్న పార్ట్
కేసీఆర్ తెలంగాణకు నీళ్లు తేవడం కోసం ఆరు,ఏడు నెలలు రీసెర్చ్ చేశారు.కేసీఆర్ కు తిండి ధ్యాస,.డబ్బు ధ్యాస ఉండదు. కేసీఆర్ పై ఆబండాలు వేస్తున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టును 200 ఏళ్ళు ప్రజలు గుర్తు ఉంచుకుంటున్నారు.
కేసీఆర్ కు అవినీతి మరక ఎట్లా వచ్చింది బిఆర్ఎస్ శ్రేణులు ఆలోచించాలి. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్ళ వల్ల అవినీతి మరక అంటింది.కేసీఆర్ కు అవినీతి మరక అంటించడంలో హరీష్ రావు,మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు,కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిపాత్ర ఉందని ఆమె ఆరోపించారు.
నాపై ఎన్ని కుట్రలు చేసినా నేను స్వతంత్రంగానే....
కేసీఆర్ ను నేడు రేవంత్ రెడ్డి విమర్శించే పరిస్థితి వచ్చింది.నాపై హరీష్ రావు,సంతోష్ రావు ఎన్ని కుట్రలు చేసినా భరించాను.హరీష్ రావు,సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు.
దగ్గర ఉండి అవినీతి అనకొండలు కేసీఆర్ ను బాద్నాం చేస్తున్నారు.నా వెనుక బీజేపీ ఉంది,కాంగ్రెస్ ఉంది అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.నాది కేసీఆర్ బ్లడ్.నేను ఇండిపెండెంట్ గా వుంటాను.కేసీఆర్ లాంటి మహానేతపై సీబీఐ విచారణ చేసే పరిస్థితి వచ్చిందను అన్నారు.
కేసీఆర్ పై సీబీఐ విచారణ చేసే పరిస్థతి వచ్చింది అంటే పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత
నాపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే మీ తోలు తీస్తా*
బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ బీసీలను బలి చేస్తున్నారు.బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు.బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేము బీహార్ వెళ్లి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాము
More News...
<%- node_title %>
<%- node_title %>
బహుళ అంతస్తుల భవనాలు,ఇతర నిర్మాణాల అనుమతులలో జాప్యం కూడదు సి ఎం రేవంత్ రెడ్డి

ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో ప్రకంపనలు
-overlay.jpeg-overlay.png)
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

సంప్రదాయ రీతిలో భాగవత సప్తాహాలు ప్రారంభం

నిబద్ధత క్రమశిక్షణతో పనిచేస్తేనే ప్రజల్లో మంచి పేరు వస్తుంది.. డిఈ దురిశెట్టి మనోహర్ అంకితభావంతో పని చేశారు.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. విద్యుత్ శాఖకే వన్నె తెచ్చారు.. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో భక్తి పారవశ్యంలో భక్తులు

మా కామాఖ్య హాస్పిటల్ వారిచే ప్రెస్ క్లబ్ గణపతి వద్ద అన్నప్రసాద వితరణ

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో

పాత పెన్షన్ స్కీం అమలు చేయాలి

గౌడ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం

కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ జపం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత -పర్యావరణ పరిరక్షణకై మక్తాల దంపతులు
