రికార్డు ప్రయాణంతో నెల‌లు నిండ‌ని శిశువును కాపాడిన కిమ్స్ క‌డ‌ల్స్ బృందం

On
రికార్డు ప్రయాణంతో నెల‌లు నిండ‌ని శిశువును కాపాడిన కిమ్స్ క‌డ‌ల్స్ బృందం

 సూర‌త్ నుంచి హైద‌రాబాద్‌కు 1300 కిలోమీట‌ర్ల రోడ్డు ప్రయాణం
 * వెంటిలేట‌ర్ మీద పెట్టి 1.1 కిలోల శిశువును తీసుకొచ్చిన వైద్యులు
 * ప్రపంచంలో ఇలాంటి సుదీర్ఘప్రయాణం ఇప్పటికి 723 కిలోమీట‌ర్లే
 * కిమ్స్ క‌డ‌ల్స్ లో శిశువుకు సంపూర్ణ చికిత్స‌.. పూర్తిగా కోలుకున్న బాబు
 * ఇది గిన్నిస్ రికార్డు అవుతుందంటున్న వైద్యనిపుణులు

సికింద్రాబాద్, సెప్టెంబర్ 01 (ప్రజామంటలు) :

 అది గుజ‌రాత్‌లోని సూర‌త్ న‌గ‌రం. అక్కడున్న ఓ తెలుగు కుటుంబానికి నెల‌లు నిండ‌క‌ముందే, అంటే ఏడో నెల‌లోనే ఒక మ‌గ‌బిడ్డ పుట్టాడు. కానీ కేవ‌లం 1.1 కిలోల బ‌రువు మాత్రమే ఉన్న ఆ శిశువుకు.. అనేక ఆరోగ్యప‌రమైన స‌మ‌స్యలు త‌లెత్తాయి. తీవ్రమైన సెప్సిస్‌, ఊపిరి అంద‌క‌పోవ‌డం, శ‌రీరంలో ప‌లు అవ‌య‌వాలు ప‌నిచేయ‌క‌పోవ‌డం లాంటివి వ‌చ్చాయి.

దాంతో అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించ‌డం మొద‌లుపెట్టినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో ఆ బాబు తండ్రి సికింద్రాబాద్‌లోని కిమ్స్ క‌డ‌ల్స్  ఆస్పత్రిని సంప్రదించారు. ఎయిర్ అంబులెన్సులో తీసుకొద్దామ‌ని ప్రయ‌త్నించినా, ఆ తండ్రి ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా రోడ్డు మార్గంలో తీసుకురావాల్సి వ‌చ్చింది. అలా తీసుకొచ్చిన బృందానికి మార్గద‌ర్శక‌త్వం వ‌హించి, ఇక్కడ ఆ బాబుకు చికిత్స అందించి, పూర్తిగా కోలుకునేలా చేసిన కిమ్స్ క‌డ‌ల్స్ ఆస్పత్రి క్లినిక‌ల్ డైరెక్టర్, చీఫ్ నియో నాటాల‌జిస్ట్ డాక్టర్ బాబు ఎస్. మ‌దార్కర్ ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను సోమవారం విలేక‌రుల స‌మావేశంలో వెల్లడించారు.

ఓ చిరుద్యోగికి ఈ క‌ష్టం వ‌చ్చింది. అక్కడినుంచి ఇక్కడ‌కు తీసుకురావ‌డానికి ఎయిర్ అంబులెన్సు ఖ‌ర్చు తాను భ‌రించ‌లేన‌ని ఆయ‌న చెప్పడంతో రోడ్డు మార్గంలో తీసుకురావాల‌ని నిర్ణయించాం. అయితే, అంత త‌క్కువ బ‌రువుండి, నెల‌ల నిండ‌క‌ముందే పుట్టి, అనేక ఆరోగ్య స‌మ‌స్య‌లున్న శిశువును రోడ్డు మార్గంలో తీసుకురావ‌డం చాలా క‌ష్టంతో కూడుకున్నప‌ని, 1300 కిలోమీట‌ర్ల దూరం ఉండ‌డంతో సుమారు 14-16 గంట‌ల ప్రయాణం అవుతుంది. అంత‌సేపూ బాబును వెంటిలేట‌ర్ మీదే ఉంచాలి. అందుకు చాలా ఆక్సిజ‌న్ అవ‌స‌రం అవుతుంది. అందుకోసం బాబును తీసుకొచ్చే అంబులెన్సే కాకుండా, వెన‌కాల మ‌రో అంబులెన్సును కూడా పెట్టాం. అందులో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు ఉన్నాయి. దారిలో నాసిక్‌లోను, మ‌రికొన్నిచోట్ల సిలిండ‌ర్లు మార్చుకున్నాం. 

మ‌ధ్యమ‌ధ్యలో బాబుకు శ్వాస‌ప‌ర‌మైన ఇబ్బంది, గుండె కొట్టుకునే రేటు మార‌డం లాంటి స‌మ‌స్యలు త‌లెత్తాయి. అయినా నిపుణులైన వైద్యులు, న‌ర్సింగ్ సిబ్బంది కూడా అంబులెన్సులో ఉండ‌డంతో వెంట‌నే వాటిని స‌రిచేయ‌గ‌లిగారు. అంత సుదూర ప్రయాణం కావ‌డంతో సిబ్బంది కూడా కొంత అనారోగ్యం పాల‌య్యారు. కొంద‌రికి వాంతులు అయ్యాయి, నీర‌స‌ప‌డ్డారు. అయినా బాబును సుర‌క్షితంగా సికింద్రాబాద్ చేర్చాల‌న్న ఏకైక ల‌క్ష్యంతో అంతా క‌లిసి క‌ష్టప‌డ్డారు. ఎందుకైనా మంచిద‌ని మొత్తం మూడు బృందాలుగా వైద్యులు, న‌ర్సుల‌ను పంపాం. ఈ బృహ‌త్ ప్రయ‌త్నంలో మొత్తం 31 మంది సిబ్బంది పాల్గొన్నారు. కిమ్స్ కడల్స్ మరియు రెడ్ హెల్త్ అంబులెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో రోడ్డు మార్గం ద్వారా చిన్నారిని తరలించడంలో సహకరించారు. అలాగే 15 మంది వైద్యులు, న‌ర్సులు, బ‌యోమెడిక‌ల్ సిబ్బంది, మార్కెటింగ్ సిబ్బంది, 11 మంది బ్యాక్ ఎండ్ నిపుణులు, ఐదుగురు ప‌రోక్ష స‌హాయ సిబ్బంది ఉన్నారు. వీరంతా నిర్విరామంగా క‌ష్టప‌డి బాబును సుర‌క్షితంగా సూర‌త్ నుంచి సికింద్రాబాద్ చేర్చారు. ఈ మార్గంలో కిమ్స్ అనుబంధ ఆస్పత్రులు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు అందించ‌డం, ఇత‌ర సాయం చేయ‌డం కూడా చాలా ఉప‌యోగ‌ప‌డింది. ఇక్కడ‌కు వ‌చ్చిన త‌ర్వాత ప‌రీక్షిస్తే, బాబుకు మ‌ల్టీ ఆర్గాన్ స‌మ‌స్యలు ఉన్నాయి. దాదాపు రెండు నెల‌ల పాటు బాబును ఆస్పత్రిలో ఉంచి మంచి చికిత్స చేశాం. దాంతో ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. 1.9 కిలోల బ‌రువుకు చేరుకున్నాడు. వెంటిలేట‌ర్, ఆక్సిజ‌న్ తీసేసినా సాధార‌ణంగానే ఉన్నాడు. త‌ల్లిపాలు తాగుతున్నాడు. వాళ్ల తాత కుటుంబం ఇక్కడే ఉండ‌డంతో కొన్నాళ్లు న‌గ‌రంలోనే ఉంటారు. మ‌ధ్యమ‌ధ్యలో ఫాలో అప్ ప‌రీక్షల‌కు రావ‌ల్సి ఉంటుంద‌ని చెప్పాం. బాబు ఏడుస్తూ, ఆడుకుంటూ బాగా చురుగ్గా ఉన్నాడు. ప్రపంచంలో ఇప్పటివ‌ర‌కు ఇలా రోడ్డుమార్గంలో నెల‌లు నిండ‌ని శిశువుల‌ను తీసుకొచ్చిన గ‌రిష్ఠ దూరం కేవ‌లం 723 కిలోమీట‌ర్లు మాత్రమే. అదే మ‌న దేశంలో అయితే అది 513 కిలోమీట‌ర్లే. అందువ‌ల్ల ఇది గిన్నిస్ రికార్డు అవుతుంది అని డాక్టర్ బాబు ఎస్. మ‌దార్కర్ వివ‌రించారు.బాబును తీసుకొచ్చిన బృందంలో డా స‌తీష్‌, డా రియాన్, డా  సంతోష్, చిన్నా బ్రద‌ర్, స‌న‌ల్ బ్రద‌ర్, అంబులెన్సు పైల‌ట్లు ఆనంద్, మోహ‌న్ ఉన్నారు. ఆస్పత్రితోపాటు కిమ్స్ ఫౌండేష‌న్ త‌ర‌ఫున సహాయం అందించిన సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కర‌రావు, మెడిక‌ల్ స‌ర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు, ఆస్పత్రి సీఈఓ డా అభిన‌య్ బొల్లినేని త‌దిత‌రులంద‌రికీ బాబు తండ్రి కృత‌జ్ఞత‌లు తెలిపారు. త‌న బాబును కంటికి రెప్పలా కాపాడి, క్షేమంగా అప్పగించిన కిమ్స్ యాజ‌మాన్యానికి, వైద్యుల‌కు, న‌ర్సింగ్ సిబ్బందికి ఆయ‌న కృత‌జ్ఞత‌లు తెలిపారు.

Tags
Join WhatsApp

More News...

జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు 

జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు  జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక వేదికను అలంకరింపజేసి ఉత్సవ మూర్తులను వేదికపై ఉంచి కళ్యాణాన్ని...
Read More...

ఎన్ టివి జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ జగిత్యాలలో నిరసన

ఎన్ టివి జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ జగిత్యాలలో నిరసన జగిత్యాల  జనవరి 14 (ప్రజా మంటలు) ఎన్ టివి ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్‌, రిపోర్టర్లు చారి, సుధీర్‌లను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ జగిత్యాల పట్టణంలో  టి యు డబ్ల్యూ జే (ఐ జె యు) ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ...
Read More...
Local News  Crime 

గంజాయి పట్టివేత యువత పై కేసు నమోదు

గంజాయి పట్టివేత యువత పై కేసు నమోదు గొల్లపల్లి జనవరి 14  (ప్రజా మంటలు )   గొల్లపల్లి మండలం లోనీ చందోలి గ్రామ శివారులో యువకుడు గంజాయితో వెళుతున్నాడని పక్క సమాచారం మేరకు చందోలి శివారులో పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా  యువకుడిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా అతడి వద్ద 89 గ్రాముల గంజాయి లభించగా వివరాల్లోకెళ్తే వెల్గటూర్ మండలo
Read More...
Local News 

ఆకట్టుకున్న సందేశాత్మక ముగ్గు

ఆకట్టుకున్న సందేశాత్మక ముగ్గు జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంగళవారం జగిత్యాలలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో జగిత్యాల‌కు చెందిన యూట్యూబ్ స్టార్ దేశవేని మమత వేసిన సందేశాత్మక ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “రైతు లేనిదే రాజ్యం లేదు… జవాన్ లేకపోతే దేశానికి రక్షణ లేదు” అనే నినాదంతో, పలు రకాల అందమైన రంగులను...
Read More...

హైదరాబాద్‌లో జర్నలిస్టుల అరెస్టులు

హైదరాబాద్‌లో జర్నలిస్టుల అరెస్టులు హైదరాబాద్ జనవరి 14 (ప్రజా మంటలు): హైదరాబాద్‌లో జర్నలిస్టుల వరుస అరెస్టుల వ్యవహారంపై మాజీ మంత్రి హరీశ్ రావు డీజీపీతో ఫోన్‌లో మాట్లాడారు. పండుగ పూట అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లకు వెళ్లి తలుపులు పగలగొట్టి అరెస్టులు చేయడం అవసరమా? అని ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండా, చట్టపరమైన ప్రొసీజర్ అనుసరించకుండా జర్నలిస్టులను అరెస్టు చేయడం సరికాదని హరీశ్...
Read More...
Local News  State News 

జగిత్యాల ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్‌లో కలకలం

జగిత్యాల ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్‌లో కలకలం జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ హాస్టల్‌లో విద్యార్థినుల మొబైల్ ఫోన్లు లాక్కొని, సంక్రాంతి పండుగకు ఇంటికి పంపించకుండా గదుల్లో నిర్బంధించారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. హాస్టల్‌లో సెలవులపై ముందస్తు ప్రకటన లేకుండా విద్యార్థినుల వ్యక్తిగత కమ్యూనికేషన్‌ను ఆపివేయడం,...
Read More...

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో వైభవంగా ముగ్గుల పోటీలు _ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో వైభవంగా ముగ్గుల పోటీలు _ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్      జగిత్యాల జనవరి 13 ( ప్రజా మంటలు)జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్  బి.సత్యప్రసాద్, అధ్యక్షతన మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీల కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు హాజరైనారు. జగిత్యాల జిల్లా లోని...
Read More...

జగిత్యాల ,రాయికల్ మున్సిపాలిటీ పై బీజేపీ జెండా ఎగరవేయడమే మా లక్ష్యం  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి ప్రవీణ్

జగిత్యాల ,రాయికల్ మున్సిపాలిటీ పై బీజేపీ జెండా ఎగరవేయడమే మా లక్ష్యం  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి ప్రవీణ్    జగిత్యాల జనవరి 13 (ప్రజా మంటలు)నియోజక వర్గంలోని జగిత్యాల, రాయికల్ రెండు మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బిజెపి పార్టీ పని చేస్తుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి ప్రవీణ్ అన్నారు జగిత్యాల నియోజకవర్గం కార్యాలయము కమలా నిలయంలో మీడియా సమావేశంలో బిజెపి పార్టీ శ్రేణులతో కలిసి ఆమె...
Read More...
Local News  State News 

తలసాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పీఎస్ లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

తలసాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పీఎస్ లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు సికింద్రాబాద్,  జనవరి 13 ( ప్రజామంటలు ):  బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బన్సీలాల్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు.తలసాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్న కాంగ్రెస్ నేతలు, వాటిని...
Read More...
Local News 

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి పురస్కారాలు

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి పురస్కారాలు జగిత్యాల జనవరి 13 (ప్రజా మంటలు): తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో   వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన సీనియర్ సిటీజెన్లకు  సంక్రాంతి పురస్కారాలను , ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. మంగళవారం జిల్లా సీనియర్ సిటీజేన్స్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో...
Read More...
Local News 

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే

   మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే హైదరాబాద్, జనవరి 13 (ప్రజా మంటలు): ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, మినీ స్టేడియం మంజూరైనప్పటికీ...
Read More...
National  Opinion  Spiritual  

సంక్రాంతి – ముగ్గులు ::సంప్రదాయం, శాస్త్రం, స్త్రీశక్తి

సంక్రాంతి – ముగ్గులు ::సంప్రదాయం, శాస్త్రం, స్త్రీశక్తి ముగ్గులు ఏ ప్రదేశాన్నైనా సౌందర్యవంతంగా మార్చడమే కాక, ఆ ఇంటిని లక్ష్మీ నివాసంగా మలిచే పవిత్ర చిహ్నాలు. రంగురంగుల డిజైన్లు మాత్రమే కాదు, ప్రతి ముగ్గు వెనుక దాగి ఉన్న శాస్త్రీయత, ఆధ్యాత్మిక భావన, సామాజిక ఉద్దేశం చాలా లోతైనవి. రోజూ మనం చూసే ఒక సాధారణ ముగ్గుకే ప్రత్యేక అర్థం ఉంది. ఆ అర్థం,...
Read More...