గొల్లపల్లి పట్టణ పద్మశాలి సేవాసంఘంలో (జంధ్యాల) నూలుపౌర్ణమి వేడుకలు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి, ఆగస్టు 09 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం కేంద్రంలో పట్టణ పద్మశాలి సంఘ భవనంలో (జంధ్యాల) నూలుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసంలో వచ్చే రాఖీ పౌర్ణమినీ పద్మశాలి లు నూలు పౌర్ణమి వేడుకలుగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని సంఘ భవనంలో మార్కండేయుని చిత్రపటానికి పూలమాలవేసి అర్చకుల చే ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గాయత్రి మంత్రోపదేశo చేస్తూ సామూహిక యజ్ఞోపవీతం (జంధ్యం) ధరింపజేశారు. సంఘ సభ్యులకు రక్షాబంధనం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం పట్టణ అధ్యక్షులు చౌటపల్లి తిరుపతి మాట్లాడుతూ నూలు పౌర్ణమి రోజున యజ్ఞోపవీతం మార్చుకోవడం ద్వారా, తమను తాము శుద్ధి చేసుకుంటారని నమ్ముతారన్నారు.నూలు పౌర్ణమి గురు శిష్య సంబంధాన్ని సూచిస్తుందనీ గురువు శిష్యుడికి ఉపదేశం ఇచ్చి, అతని ఆధ్యాత్మిక ప్రగతికి బాటలు వేస్తాడన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చౌటపల్లి తిరుపతి,ప్రధాన కార్యదర్శి అందే లక్ష్మణ్, కోశాధికారి అంకం లింబాద్రి, ఉపాధ్యక్షులు ఎనగందుల శంకర్, మండల ప్రధాన కార్యదర్శి అంకం భూమయ్య, అంకం లక్ష్మీనారాయణ, ఎనగందుల సుదర్శన్, జక్కుల శ్రీనివాస్, కోమాకుల భూమయ్య,గుండేటి సత్యనారాయణ,ఎల్లే పవన్, అనుమాండ్ల శ్రీధర్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ

పండుగ పూట విషాదం నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు

శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో ఘనంగా పౌర్ణమి ప్రత్యేక పూజలు

వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.

17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

25వ వార్డులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
