ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు కృషి -ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సామాజిక విప్లవానికి తెలంగాణ జాగృతి నాయకత్వం వహిస్తుంది
సామాజిక తెలంగాణ సాధన కోసం ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టబోం
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి
ఢిల్లీలో కాంగ్రెస్ దొంగ ధర్నాలతో ఒరిగేదేమీలేదు
బీసీల నోటికాడి ముద్దను బీజేపీ లాక్కుంటుంది
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ ఆగస్ట్ 06:
తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఘనంగా సంస్థ ఆవిర్భావ ఉత్సవాలు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు నిర్వహించారు.
రాష్ట్రంలో సామాజిక విప్లవానికి తెలంగాణ జాగృతి నాయకత్వం వహిస్తుందని, సాంస్కృతిక విప్లవంతో పాటు సామాజిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ సాధనకు ఒక్క అంశాన్ని వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు.
బుధవారం నాడు బంజారాహిల్స్ లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో తెలంగాణ జాగృతి ఆవిర్భావ ఉత్సవాలు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జాగృతి ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత జాతీయ పతాకం, తెలంగాణ జాగృతి జెండా ఎగరవేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి ఎమ్మెల్సీ కవిత పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ కోసం, బీసీల కోసం ఉద్యమం చేస్తానని ప్రొఫెసర్ జయశంకర్ సార్ అనేవారని గుర్తు చేశారు. ప్రపంచీకరణ, కార్పొరేట్ల నేపథ్యంలో వృత్తి పనులు నాశనమవుతున్న క్రమంలో సామాజిక విప్లవం రావాలి అనే ఆకాంక్షించేవారని, భౌగోళిక తెలంగాణ సాధనతో పాటు సామాజిక తెలంగాణ ధ్యైయంగా ఉండాలని చెప్పేవారని, కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్పూర్తితో తెలంగాణ జాగృతి పనిచేస్తుందని తెలిపారు.
నిరహార దీక్షను ప్రభుత్వం భగ్నం చేసింది
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై తాను చేపట్టిన 72 గంటల పాటు నిరహార దీక్షను ప్రభుత్వం భగ్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ధర్నా కోసమే తన దీక్షను భగ్నం చేశారని ఆరోపించారు. బీసీ బిల్లుల ఆమోదానికి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రపతిని కలవాలని, గవర్నర్ ఆర్డినెన్సు జారీ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించాలని డిమాండ్ చేశారు.
అటువంటి నిర్దిష్టమైన చర్యలు చేపట్టకుండా ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా బీసీ బిడ్డలను మోసం చేస్తున్నట్లేనని సూచించారు. కాంగ్రెస్ దొంగ ధర్నాలు కాదు.... ఫలితం వచ్చే చర్యలు చేపట్టాలి అని అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం కలిసి బీసీలను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీసీల నోటికాడి ముద్దను లాక్కోడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ బీసీ వ్యతిరేక వైఖరికి ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లలో ముస్లీంల రిజర్వేషన్లు ఉన్నారా లేదా అన్నదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టత ఇవ్వకముందే అందులో ముస్లీం రిజర్వేషన్లు ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఎలా తెలుసు ? అని ప్రశ్నించారు. నాటకాలు ఆడుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ బీసీలు బుద్దిచెబుతారని హెచ్చరించారు. అఖిలపక్షాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి తీసుకెళ్లాలని, ఈ మేరకు అన్ని పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ సాంస్కృతి పరిరక్షణ కోసం తెలంగాణ జాగృతి
తెలంగాణ సాంస్కృతి పరిరక్షణ కోసం తెలంగాణ జాగృతి ఏర్పడిందని, కేసీఆర్ చెప్పిన అనేక అంశాలను ప్రాతిపదికన చేసుకొని వారు చూపిన బాటలో ఉద్యమాలు చేశామని వివరించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పిన అంశాలను దారిదీపాలుగా, మార్గదర్శకంగా తీసుకొని ముందుకెళ్లామని, ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్పూర్తిని ముందు తరాల వారికి పంచాల్సిన అవసరం ఉందని తెలిపారు.
జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి సందర్భంలో కచ్చితంగా తెలంగాణ జాగృతి ఇంకా బలంగా పనిచేయాలని, చేసే ప్రతీ పనిలో తెలంగాణ సోయి ఉండాలని చెప్పారు. సామాజిక తెలంగాణ సాధన అంటే ఢిల్లీకి పోయి ఉట్టి ధర్నాలు చేయడం కాదని, సామాజిక తెలంగాణ అంటే గ్రామ గ్రామాన ప్రతీ ఒక్కరి జీవన శైలిలో మార్పులు తీసుకురావడమని అన్నారు. తెలంగాణ జాగృతి సంస్థను మరింత బలోపేతం చేయడానికి మరిన్ని కమిటీలు వేస్తున్నామని తెలియజేశారు.
తెలంగాణ జాగృతి ఆవిర్భావ ఉత్సవాల్లో జాగృతి నాయకులు నవీన్ ఆచారి, వరలక్ష్మీ, రూప్ సింగ్, సంపత్ గౌడ్, మరిపెల్లి మాధవి, కొట్టాల యాదగిరి, రాము యాదవ్, అర్చనా సేనాపతి, శ్రీకాంత్ గౌడ్, లలితా యాదవ్, మహేందర్, లింగం తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రో జయశంకర్ కు బార్ అసోసియేషన్ నివాళి

కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే శ్రీగణేష్ జన్మదిన వేడుకలు

ఆచార్యుడిని యాది మరిచిన గాంధీ ఆసుపత్రి

కస్తూర్బా స్కూల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ఆచార్య జయ శంకర్ తల్లీ తెలంగాణ విమోచనం కోసం పోరాడిన శిఖరం ఆయన

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

పెగడపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఈవీఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు కృషి -ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

గిత్యాల ఆర్టీఓ ఆఫీస్‌లో ఏసీబీ ఆకస్మిక దాడులు డిటివో నాయక్

సకాలంలో గుర్తించి, ట్రీట్మెంట్ తీసుకుంటే వాస్క్యులర్ సమస్య నివారించవచ్చు
