జర్నలిస్ట్ అక్రమ నిర్బంధంపై సీపీకి జర్నలిస్టుల పిర్యాదు
శాంతిభద్రతల పరిరక్షణలో జర్నలిస్టుల సహాకారం అవసరం
మెరుగైన సమాజం కోసం కలసి పని చేయాలన్న సీపీ సీవీ ఆనంద్
సున్నితమైన అంశాల వార్తా ప్రసారంలో సంయమనం పాటించాలని సూచన
సికింద్రాబాద్, ఆగస్ట్ 05 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ బిగ్ టీవీ జర్నలిస్ట్ నర్సింగ్ రావును అన్యాయంగా నిర్బందించడంతో పాటు ఛోటా న్యూస్ యాప్ పైన కేసును నమోదు చేయడంపైన జర్నలిస్టులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్టులు, నార్త్ జోన్ జర్నలిస్టుల ప్రతినిధి బృందం మంగళవారం హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ను కలిసి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీపీ స్పందిస్తూ ..కేసును తొలగిస్తామని హామీ నివ్వడంతో పాటు మరొక్కసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.
సీపీ మాట్లాడుతూ... సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసుల పాత్రతో పాటు జర్నలిస్టుల సహాకారం కూడా ఎంతైనా అవసరమని తెలిపారు. వార్తా ప్రసారంలో సంయమనం పాటించాలని, వీడియోల ప్రసారంలోను సున్నితమైన అంశాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీపీ స్పందన పట్ల జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో పలు ప్రముఖ మీడియా సంస్థల ప్రతినిధులు గోపి యాదవ్, నగేష్, కునాల్, సురేష్, రత్న కుమార్, రాఘవ, ప్రవీణ్, నార్త్ జోన్ జర్నలిస్టులు రమేష్, నర్సింగ్, శ్రీకాంత్, బాలకృష్ణ, నరేష్, వంశీ, వాసు, మల్లికార్జున్, శ్రీనివాస్, భాగ్యనగర్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు సత్యం, ప్రధాన కార్యదర్శి చందు, పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేడు ప్రొ.జయశంకర్ సార్ జయంతి

విశ్వాసానికి ప్రతీక శునకం నిఘానేత్రం.

రుణం వసూలు పై ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు నిర్వాకం. - మహిళా కమిషన్ కు ఫిర్యాదు
.jpeg)
జర్నలిస్ట్ అక్రమ నిర్బంధంపై సీపీకి జర్నలిస్టుల పిర్యాదు

ఆకతాయిలకు అడ్డాగా పిట్టల బస్తి కమ్యూనిటీ హాల్

పర్యావరణ హితమైన సోలార్ ఇందన ఉత్పత్తిపై వినియోగదారులు దృష్టి పెట్టాలి ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ బి. సుదర్శనం

ఘనంగా జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్

సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్ ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు

మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన

ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్

ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,
