ఇది బీసీల ఆత్మగౌరవ పోరాటం - 42% బిసి బిల్లు ఆమోదించాలని దీక్ష - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం రావాలి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ ఆగస్ట్ 04:
బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అనేక పోరాటాలు చేసిందనీ, కాంగ్రెస్ హామీ ఇచ్చిన, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన మేర, 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ తో ఈరోజు నుండి 72గంటల పాటు దీక్ష చేస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
ముందుగా అనుకున్నట్లే ఈరోజు ఉదయం 10.30 లకు కవిత, ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్ లో దీక్ష ప్రారంభించారు.
ఈసందర్భంగా అక్కడ చేరిన వేలాదిమంది అభిమానులను, కార్యకర్తలను, బిసి నాయకులను, కుల సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ, సబ్బండవర్గాలు బాగుండాలని తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ వచ్చాక అనేక పనులు చేసుకున్నాము. తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం రావాలనీ అన్నారు.
సమాజంలో సగం జనాభా బీసీలు ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని వెంటపడుతున్నాం. తెలంగాణ జాగృతి పోరాటాలతో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో బిల్లు పెట్టారు
సావిత్రిభాయి పూలే జయంతిని ఉమెన్స్ టీచర్స్ డే గా ప్రకటించారు.జ్యోతిభా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టమంటే ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై పెట్టింది. ఈ రోజు జరిగేది బీసీల
ఆత్మగౌరవ పోరాటం
ముస్లిం 10 శాతం రిజర్వేషన్లకు ప్రత్యేకంగా బిల్లు ఆపెడతామని కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలి.ముస్లింలకు 10శాతం ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నాం.
బీజేపీ అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం.బీజేపీ కేంద్ర ప్రభుత్వం,గవర్నర్ సంతకం పెట్టకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తాము
ఉమ్మడి ఏపీలో అంబేద్కర్ విగ్రహం కోసం 48 గంటలు దీక్ష చేశాము. ఆంధ్రా వాళ్ళ కంటే మీరు పాపం అయ్యారా...?
తెలంగాణలో ధర్నా చౌక్ లు ఓపెన్ చేశామని సీఎం ఢిల్లీలో గప్పాలు కొడుతున్నారు.తెలంగాణ జాగృతి దీక్షకు పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు భయం
ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద 72గంటలు దీక్ష చేయడానికి
ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వాలి.బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు అంతా ఏకంకావాలి
రెండు ఏళ్లనుంచి ఊర్లల్లో సర్పంచులు,ఎంపీటీసీలు ఉన్నారా.బీసీలకు హక్కులు వచ్చాకే స్థానికసంస్థల ఎన్నికలు జరపాలి
బీసీ రిజర్వేషన్ల కోసం తమిళనాడులో 9 సంవత్సరాలు స్థానికసంస్థల ఎన్నికలు జరగలేదు. తమిళనాడు పట్టుపట్టడంతోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యంఅయ్యాయి. తెలంగాణ జాగృతి ఎప్పుడూ శాంతియుతంగానే దీక్షలు చేసింది.72 గంటలు పర్మిషన్ ఇవ్వకుండా నన్ను తీసుకువెళ్లి పోలీసు స్టేషన్ లో పెట్టినా,హాస్పిటల్ లో పెట్టినా,ఇంటి దగ్గర పెట్టినా అక్కడే దీక్ష చేస్తాను
రాజకీయ పార్టీలు ఏం మాట్లాడినా పట్టించుకోకుండా బీసీ రిజర్వేషన్ల సాధనకోసం బీసీలు ఏకం కావాలి. 72గంటల నిరాహారదీక్షకు దిగిన జాగృతి అధ్యక్షురాలు కవిత
బీసీ రిజర్వేషన్లు సాధనే లక్ష్యంగా ఎమ్మెల్సీ కవిత నిరాహారదీక్ష. బీసీల హక్కులు సాధించేవరకు 72గంటల దీక్షను కొనసాగిస్తాను
హాస్పిటల్ తీసుకెళితే హాస్పిటల్లో.. ఇంటికి తీసుకెళితే ఇంట్లో దీక్ష చేస్తాను.బీసీల హక్కులు సాధించేవరకు దీక్ష విరమించను.బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ లో సైతం దీక్షకు దిగుతాం
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే.నాది రాజకీయ పోరాటం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం.గాంధీ చెప్పిన అహింసా మార్గంలోనే 42శాతం రిజర్వేషన్లు సాధిస్తాం*
కేంద్రంపై నెపాన్ని నెట్టి కాంగ్రెస్ చేతులు దులుపుకోచాలని చూస్తుంది.రిజర్వేషన్లు రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమని బీజేపీ చెప్తుంది.
బీసీ, ముస్లిం రిజర్వేషన్లు వేర్వేరుగా ఉండాలి
కేంద్రంలో ఉన్న బీజేపీ సంతకాలు పెట్టడం లేదని బీసీలను కాంగ్రెస్ మోసం చేయవద్దు.బీసీలకు హక్కులు వచ్చాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.
ముస్లింలకు 10శాతం రిజర్వేషన్లు ప్రత్యేకంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించాలి
More News...
<%- node_title %>
<%- node_title %>
రుణం వసూలు పై ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు నిర్వాకం. - మహిళా కమిషన్ కు ఫిర్యాదు
.jpeg)
జర్నలిస్ట్ అక్రమ నిర్బంధంపై సీపీకి జర్నలిస్టుల పిర్యాదు

ఆకతాయిలకు అడ్డాగా పిట్టల బస్తి కమ్యూనిటీ హాల్

పర్యావరణ హితమైన సోలార్ ఇందన ఉత్పత్తిపై వినియోగదారులు దృష్టి పెట్టాలి ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ బి. సుదర్శనం

ఘనంగా జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్

సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్ ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు

మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన

ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్

ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు లోక్ దళ్ నేత అర్జున్ సింగ్ చౌతాల మద్ధతు

72 గంటల బిసి రిజర్వేషన్ల దీక్ష ముగించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత
