అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జులై 7 ( ప్రజా మంటలు)
జిల్లా లో జరుగు రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ , అదనపు కలెక్టర్ లత ఆధ్వర్యంలో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించినారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్పీ మాట్లాడుతూ ... రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోంది అన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా స్థాయిలో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో డిస్టిక్ ట్రాఫిక్ అనాలసిస్ బ్యూరో ని ప్రారంభించి ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంట రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉందని అందులో బాగంగా జాతీయ రహదారి పై ఉన్న అన్ని గ్రామాల్లో అవగాహాన కార్యక్రమాలు చేపట్టాలని ఆదే విదంగా హైవేలపై జరిగే యాక్సిడెంట్ లకు సంబంధించి ఫస్ట్ రెస్పాండర్స్ గా ఉండేందుకు హైవేలపై ఉన్న పెట్రోల్ బంక్ వారికి, ధాబాలో పనిచేసే వారికి, యూత్ ,విలేజెస్, కి ఫస్ట్ ఎయిడ్ మరియు సిపిఆర్ పై అవగాహన కలిగించాలని అధికారులకు సూచించారు.
జిల్లా లో ఉన్న 43 బ్లాక్ స్పాట్స్(ప్రమాదాలు అధికముగా జరుగు ప్రదేశాలు) ను పంచాయతీ రాజ్ మరియు ఆర్&బి ప్రబుత్వ శాఖల సమన్వయంతో ప్రమాదాల నివరణ పై దృష్టి సారించాలని అన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ ... జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ వైకల్యం బారిన పడకుండా, ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు లేకుండా రహదారి ప్రమాదాలు సంభవించకుండా రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రోడ్డు కండిషన్ లో లేకపోవడం, సైనేజ్ బోర్డులు,అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్ లు లేకపోవడం వల్ల అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
సంబంధిత ఇంజనీరింగ్ శాఖలు అలాంటి ప్రదేశాలను గుర్తించి వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఆర్టీఓ లు డిఎస్పీలు మరియు, మున్సిపల్ అధికారులు, పంచాయతీ అధికారులు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ చాన్సలర్ భేటి

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం
