కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

On
కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

విజయవంతంగా పూర్తి చేసిన టీమ్ విమలాకర్

సికింద్రాబాద్ జూలై 10 (ప్రజామంటలు):

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేట్‌లో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ డాక్టర్ విమలాకర్ రెడ్డి  నేతృత్వంలోని టీమ్ విమలాకర్ కేవలం మూడు నెలల వ్యవధిలో 50 మేజర్ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ అధునాతన శస్త్రచికిత్సల్లో ప్యాంక్రియాస్, కాలేయం, బైలరీ ట్రాక్ట్, కొలాన్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ శస్త్రచికిత్సలు మరియు కాంప్లెక్స్ అబ్డోమినల్ వాల్ రీకన్స్ట్రక్షన్‌లు ఉన్నాయి. ఇవన్నీ Da Vinci రోబోటిక్ సర్జికల్ ప్లాట్‌ఫామ్ ద్వారా అత్యాధునిక సాంకేతికతతో నిర్వహించారు. అన్ని శస్త్రచికిత్సలు అత్యుత్తమ ఫలితాలతో, ఎలాంటి ప్రమాదాలు లేకుండా విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గురువారం కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ బేగంపేటలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏవి గురవారెడ్డి మాట్లాడుతూ ఆర్థోపెడిక్స్ విభాగంలో కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో నాలుగు రోబోలు ఉన్నాయని, ఇండియాలో నాలుగు రోబోలు ఉన్న ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇదొక్కటే అన్నారు. ఇప్పటివరకు పదివేలకు పైగా  ఆర్థోపెడిక్ శాస్త్రాజకిత్సలను విజయవంతంగా నిర్వహించామని, ఆ అనుభవంతోనే సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో అబ్డామిన్లో క్లిష్టమైన శాస్త్ర చికిత్సలను డా వించి రోబోటిక్స్ సాయంతో మూడు నెలల్లోనే 50 కి పైగా శస్త్ర చికిత్సలను  నిపుణులైన డాక్టర్ విమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఈ రోబోటిక్స్ వల్ల ఆపరేషన్ చేసే సమయంలో సేఫ్టీ, గ్యారంటీ ఉంటుందన్నారు. టెక్నాలజీ, హ్యూమన్ టచ్ అందజేస్తూ రోగులను గెస్ట్లుగా ట్రీట్ చేస్తూ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ కన్సల్టెంట్ & హెడ్ – సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, GI ఆంకాలజీ, బేరియాట్రిక్, రోబోటిక్ సర్జరీ & లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్  సర్జన్ డా. విమలాకర్ రెడ్డి మాట్లాడుతూ "రోబోటిక్ సర్జరీ ఇప్పుడే అధునాతన అబ్డోమినల్ శస్త్రచికిత్సల కోసం గోల్డ్ స్టాండర్డ్‌గా మారింది. దీనిలో ఉన్న 3D విజన్, రిస్టెడ్ ఇన్‌స్ట్రుమెంట్స్ వల్ల అత్యంత క్లిష్టమైన భాగాల్లో కూడా ఖచ్చితమైన డిసెక్షన్ చేయవచ్చు. ఇది రక్తస్రావం తక్కువగా ఉండేలా, తక్కువ సంక్లిష్టతలతో, త్వరితపరిచే కోలుకునేలా చేస్తుందని తెలిపారు. తక్కువ నొప్పి, తక్కువ ఆసుపత్రి సమయం, త్వరితంగా సాధారణ జీవితానికి తిరిగి రావడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. వృద్ధులు మరియు క్యాన్సర్ పేషెంట్లకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సమయానుసారంగా పోషణ వారిలో జీవన నాణ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.టీమ్ విమలాకర్ యొక్క సర్జికల్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్, మరియు పేషెంట్ ఫస్ట్ కెర్ పట్ల ఉన్న అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. robotic శస్త్రచికిత్సల్లో విద్య, శిక్షణ, మరియు క్లినికల్ రీసెర్చ్ కార్యక్రమాలలో ఈ టీం చురుకుగా పాల్గొంటూ, కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్  దేశంలో అగ్రగామి రోబోటిక్ GI సర్జరీ సెంటర్‌గా నిలిపే ప్రయత్నాల్లో ఉన్నామని తెలిపారు.  ఈ సందర్భంగా శాస్త్ర చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన పేషెంట్లు  వారి అనుభవాలను పంచుకున్నారు.

డాక్టర్ విమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో  ప్యాంక్రియాస్, హెర్నియా, లివర్ సంబంధ సమస్యలతో బాధపడుతున్న తాము శస్త్ర చికిత్స అనంతరం పూర్తిగా కోలుకొని సాధారణ జీవితం గడుపుతున్నామని తెలిపారు. అనంతరం డాక్టర్ విమలాకర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మినిమల్ యాక్సెస్, రోబోటిక్ అసిస్టెంట్ సర్జరీల మధ్య ఉన్న తేడాను వివరించడంతోపాటు, రోబోటిక్ సర్జరీలతో ఉన్న ప్రయోజనాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో టీం విమలాకర్ డాక్టర్ల బృందం పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు గురు పౌర్ణమి సందర్బంగా భక్తుల రద్దీ సికింద్రాబాద్ జూలై 10 (ప్రజామంటలు) : పద్మారావునగర్ లోని శ్రీసాయి కుమార్ వ్యాధి నివారణ  ఆశ్రమ్ లోని శ్రీసాయిబాబా ఆలయంలో గత వారం రోజుల నుంచి నిర్వహిస్తున్న శ్రీసాయి సప్తాహ వేడుకలు గురువారం తో ముగిశాయి. చివరి రోజున ఉదయం శ్రీసాయి కుంభాభిషేకం,శ్రీసాయి విభూతి సేవ,సాయంత్రం మహామృత్యుంజయ హోమం...
Read More...

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు జూలై 10, ఎల్కతుర్తి (ప్రజామంటలు) :ఎల్కతుర్తి మండలంలోని జీల్గుల గ్రామానికి చెందిన పెద్ది సౌందర్య, బండి మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి  గురువారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ...
Read More...
Local News 

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు సికింద్రాబాద్ జులై 10 (ప్రజామంటలు): కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేస్తున్న హిందీ అధికారిక భాషా విభాగం 50ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో  గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధికారిక భాషా విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ మీనాక్షీ జాలీ తెలిపారు.ఈ మేరకు  సికింద్రాబాద్ కవాడీగూడలోని సీజీఓ టవర్స్లో  ఆమె శుక్రవారం మీడియాకు...
Read More...
Local News 

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసిన టీమ్ విమలాకర్ సికింద్రాబాద్ జూలై 10 (ప్రజామంటలు): కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేట్‌లో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ డాక్టర్ విమలాకర్ రెడ్డి  నేతృత్వంలోని టీమ్ విమలాకర్ కేవలం మూడు నెలల వ్యవధిలో 50 మేజర్ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ అధునాతన శస్త్రచికిత్సల్లో ప్యాంక్రియాస్, కాలేయం, బైలరీ ట్రాక్ట్,...
Read More...
Local News 

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి సికింద్రాబాద్, జూలై 10 (ప్రజామంటలు) : ఉద్యోగులు తమ విధులు నిర్వర్తిస్తూనే మరో వైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ జన్మదిన వేడుకల సందర్బంగా గురువారం టీఎన్జీవో నాయకులు గాంధీ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ...
Read More...
Local News 

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత బాలికల ఆరోగ్యానికి సంబంధించి పెద్ద సమస్య రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం  - ఐఎం ఏ అధ్యక్షులు డాక్టర్ గూడూరి హేమంత్  -ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి   గొల్లపల్లి జూలై 10 (ప్రజా మంటలు):  గొల్లపెల్లి మండల కేంద్రంలోని గురువారం  బాలికల ఉన్నత పాఠశాలలో ఐఎంఏ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో అనీమియా ముక్త్...
Read More...
Local News  State News 

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి మహిళలు వస్తాం... ఇచ్చిన హామీలపై చర్చిద్దాం ఏపీలో కలిపిన ఐదు గ్రామాలు వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  లేఖ తెలంగాణ జాగృతిలో చేరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీఐటీయూ కార్యదర్శి వీరన్న కొత్తగూడెం జూలై 10:    "పదే పదే కేసీఆర్ మహిళలకు...
Read More...
Local News 

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం' దేవాలయ ఏకీకరణ దేవాలయ రక్షణ (అంకం భూమయ్య) మల్యాల జులై 10 (ప్రజా మంటలు):    మల్యాల మండలం కొండగట్టులో గురుపూర్ణిమ వ్యాస పూర్ణిమ గురువారం రోజున తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో 30. వ గిరి ప్రదక్షిణ చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారామ్ మహారాజ్ ఆధ్వర్యంలో ఈ...
Read More...
Local News 

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి 

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి  గొల్లపల్లి జూలై 10 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో  ట్రాక్టర్లు ఇనుప కేజీ వీలతో రోడ్డు పై తిరిగినచో కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ ఎం, కృష్ణ సాగర్ రెడ్డి హెచ్చరించారు ఎస్ఐ మాట్లాడుతూ కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్లపై ట్రాక్టర్ కేజీ వీల్స్ తో తిరగడం వల్ల బీటీ...
Read More...
Local News 

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం  బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం వేలేరు, జూలై 10 (ప్రజామంటలు):బాల్య వివాహాల చట్టం గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో గురువారం మండలంలోని వేలేరు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి క్షమా దేశ్పాండే గారు (డీఎల్‌ఎస్‌ఏ జడ్జ్) అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాల్యవివాహాలు పిల్లల మానసిక...
Read More...
Local News 

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు 

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు  హైదరాబాద్ జూలై 10(ప్రజా మంటలు)  రామంతపూర్( వెంకట్ రెడ్డి నగర్ )లోని షిర్డీ సాయి మందిరంలో గురువారం ఉదయాత్ పూర్వం నుండి గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మూలవిరాట్టు దత్తాత్రేయ స్వామి విగ్రహానికి, షిరిడి సాయి విగ్రహానికి స్వహస్తాలతో భక్తులు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. . వైదిక...
Read More...
Local News  State News 

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు జగిత్యాల జూలై 10:   జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ ఎన్నికలలో అధ్యక్షులు చీటీ శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి, బెజ్జంకి సంపూర్ణ చారి, కోశాధికారిగా సిరిసిల్ల వేణు గోపాల్ ‌ఘన విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా హైదర్ అలీ, గడ్డల హరికృష్ణ కృష్ణ, అల్లే రాము లు, సహాయ కార్యదర్శి గా కోరే రాజ్ కుమార్,గుర్రపు చంద్ర...
Read More...