కౌన్సిలింగ్ తో వృద్ధుల కేసులు పరిష్కారం
జగిత్యాల ఆగస్టు 03 (ప్రజా మంటలు):
కన్న తల్లి,దండ్రులను పోషించక నిరాధరిస్తున్న కొడుకులకు, వారి కోడళ్లకు తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు గౌరిశెట్టి విశ్వనాథం,వెల్ముల ప్రకాష్ రావు ,పి.సి.హన్మంత రెడ్డి,ప్రభాకర్ రావు,రాధ తదితరులు కౌన్సిలింగ్ చేశారు.
తాము తమ తల్లిదండ్రులను పోషిస్తూ, బాగోగులుచేసుకోవడానికి సమ్మతించి ఒప్పంద పత్రం రాసిచ్చారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ కార్యాలయం కౌన్సిలింగ్ కేంద్రం కు జిల్లాలోని జగిత్యాల పట్టణం, మల్యాల,పెగఢపల్లి,ధర్మపురి, కోడీమ్యాల, కోరుట్ల,కథలపూర్,మెట్ పల్లి,మల్లాపూర్,ఇబ్రహీంపట్నం,
మేడిపల్లి మండలాలకు చెందిన ఆ కొడుకులు, కూతుర్లను, కోడళ్లను ఆ వృద్ధ తల్లిదండ్రుల అభ్యర్థన పై పిలిపించి వయోవృద్ధుల చట్టం పై హరి అశోక్ కుమార్ అవగాహన కల్పించారు.
తల్లిదండ్రులను పోషించక నిరాదరణకు గురిచేస్తే రెవెన్యూ డివిజనల్ అధికారి అయిన వయో వృద్ధుల ట్రిబ్యునల్ చైర్మన్ 6 మాసాలకు పైగా జైలు శిక్ష,జరిమానా విధించే వీలు ఆ చట్టంలో ఉందని,మాయ మాటలతో,బెదిరింపులతో వారి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్నా అట్టి ఆస్తులు తిరిగి ఆ తల్లిదండ్రుల పేరిట మార్పిడి చేసే అధికారం జిల్లా కలెక్టర్ కు ఉందని కౌన్సిలింగ్ చేయడంతో ఆ కొడుకులు సమ్మతించి ఒప్పంద పత్రం రాసిచ్చి ఆ వృద్ధ తల్లిదండ్రులను తమ వెంట తీసుకెళ్లారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రుణం వసూలు పై ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు నిర్వాకం. - మహిళా కమిషన్ కు ఫిర్యాదు
.jpeg)
జర్నలిస్ట్ అక్రమ నిర్బంధంపై సీపీకి జర్నలిస్టుల పిర్యాదు

ఆకతాయిలకు అడ్డాగా పిట్టల బస్తి కమ్యూనిటీ హాల్

పర్యావరణ హితమైన సోలార్ ఇందన ఉత్పత్తిపై వినియోగదారులు దృష్టి పెట్టాలి ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ బి. సుదర్శనం

ఘనంగా జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్

సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్ ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు

మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన

ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్

ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు లోక్ దళ్ నేత అర్జున్ సింగ్ చౌతాల మద్ధతు

72 గంటల బిసి రిజర్వేషన్ల దీక్ష ముగించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత
