మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన
మేడిపల్లి ఆగస్టు 5 (ప్రజా మంటలు)
ఉద్యాన శాఖ, జగిత్యాల వారి ఆధ్వర్యంలో మేడిపల్లి మండలంలోని మన్నెగూడెం రైతు వేదికలో రైతులకు ఆయిల్ పామ్ సాగు మరియు వివిధ ఉద్యాన పంటలు - పథకాలపై అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమశాఖ అధికారి
జి. శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ మొక్క నాటిన 4 సంవత్సరాలనుండి దిగుబడి ప్రారంభమై 30 సంవత్సరాల వరకు కొనసాగునని తెలిపారు. మొక్కలను 90% సబ్సిడీ పై 20 రూ./- లకే ఇస్తున్నామని, డ్రిప్ పై 80%-100% సబ్సిడీ అందిస్తున్నామని, ప్రతి ఎకరానికి 4200/- సంవత్సరానికి చొప్పున 4 సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులు చెల్లిస్తున్నామని, జిల్లాలో ఇప్పటివరకు 4700 ఎకరాలలో ఆయిల్ పామ్ తోటలు ఉన్నాయని, వరి పంటతో పోలిస్తే అకాల వర్షాలు, వడగళ్ళ వానలవల్ల నష్టం ఉండదని, కోతుల బెడద ఉండదని,1993 ఆయిల్ పామ్ చట్టం ప్రకారం గెలలను ప్రభుత్వం నిర్దారించిన రేట్ కు కంపెనీ కొనుగోలు చేస్తుందని తెలిపారు.
4700 ఎకరాలలో ఆయిల్ పామ్ తోటలు సాగులో ఉన్నాయని బుగ్గారం మండలంలోని యశ్వంతరావు పేట గ్రామంలో సెప్టెంబర్ 4 న ఫ్యాక్టరీ శంకస్థాపన చేస్తునరని, తెలిపారు.
ఆయిల్ పామ్ లో అరటి, బొప్పాయి, వక్క, కోకో వంటి అంతర పంటలు వేసుకొని అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు.
ఆయిల్ పామ్ తో పాటు మామిడి, అరటి, బొప్పాయి, జామ, డ్రాగన్ ఫ్రూట్, నిమ్మ , దానిమ్మ, అవకాడో వంటి పండ్ల తోటల పెంపకానికి సబ్సిడీ అందిస్తున్నామని, లిల్లీ పూల సాగుకు ఎకరానికి 40,000/-, ఉల్లి సాగుకు 8000/-, బంతి చామంతి గులాబీ పూల సాగుకు 8000/- , వెర్మికoపోస్టు నిర్మిoచుకోడానికి 50000/- సబ్సిడీ అందిస్తున్నామని తెలుపుతూ ఆసక్తి గల రైతులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి శ్యామ్ ప్రసాద్, మన్నెగూడెం మాజీ సర్పంచ్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, లోహియా కంపెనీ మేనేజర్.విజయ్ భారత్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి .సురేందర్ నాయక్, లోహియా కంపెనీ క్షేత్ర కార్యనిర్వహకుడు . అన్వేష్ , డ్రిప్ కంపెనీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
రుణం వసూలు పై ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు నిర్వాకం. - మహిళా కమిషన్ కు ఫిర్యాదు
.jpeg)
జర్నలిస్ట్ అక్రమ నిర్బంధంపై సీపీకి జర్నలిస్టుల పిర్యాదు

ఆకతాయిలకు అడ్డాగా పిట్టల బస్తి కమ్యూనిటీ హాల్

పర్యావరణ హితమైన సోలార్ ఇందన ఉత్పత్తిపై వినియోగదారులు దృష్టి పెట్టాలి ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ బి. సుదర్శనం

ఘనంగా జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్

సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్ ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు

మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన

ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్

ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు లోక్ దళ్ నేత అర్జున్ సింగ్ చౌతాల మద్ధతు

72 గంటల బిసి రిజర్వేషన్ల దీక్ష ముగించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత
