పర్యావరణ హితమైన సోలార్ ఇందన ఉత్పత్తిపై వినియోగదారులు దృష్టి పెట్టాలి ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ బి. సుదర్శనం
-మెట్ పల్లి ఆగస్టు 5 ( ప్రజా మంటలు)
మానవాళి మనుగడకు భూగ్రహంపై ఉష్ణ తాపం తగ్గించడానికి, కర్బన
ఉద్గారాలు నివారించి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి స్థానంలో పర్యావరణ హితమైన సోలార్ ఇంధన ఉత్పత్తి వైపు విద్యుత్ వినియోగదారులు దృష్టి పెట్టాలని జగిత్యాల ఎన్పీడీసీఎల్ ఎస్ఈ బి.సుదర్శనం ఉద్బోధించారు.
మెటుపల్లి లో సోలార్ ఇంధన వనరుల ఆవశ్యకతపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ, ప్రస్తుత విద్యుత్ అవసరాలకు దేశంలో థర్మల్ స్టేషన్ ల ద్వారా సింహభాగం ఉత్పత్తి జరుగుతోందని, బొగ్గు మండించడం వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతినడమే కాకుండా, మనుషులకు శ్వాసకోశ వ్యాధులు, ధూళి, పొగ వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏర్పడి ఆసుపత్రుల పాలు కావాల్సి వస్తోందని తెలిపారు.
ఈ సమస్యలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం-సూర్య ఘర్ యోజన, పీఎం-కుసుమ్ తదితర పథకాలు ప్రవేశ పెట్టి కోట్లాది రూపాయలు సబ్సిడీల పేరిట అందించి హరిత ఇంధన ఉత్పత్తిని ప్రోత్సాహిస్తున్నాయని వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు. పౌరులుగా సమాజ హితం పట్ల మనందరికీ బాధ్యత ఉండాలని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా సోలార్ పలకల ఉత్పత్తి దారులు వినియోగదారులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, కిలోవాట్ ఒక్కంటికి అయ్యే ఖర్చు, నిర్వహణ, గ్యారంటీ తదితర సందేహాలను నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మెటుపల్లి డీఈ మధుసూదన్, ఏడీఈ మనోహర్, పరిశ్రమల యజమానులు గుంటుక విష్ణు, మైలారం లింబాద్రి, రాజేందర్, పౌల్ట్రీ పరిశ్రమ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, వెల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు సలీం, వ్యాపారవేత్తలు పండిత్, ప్రతాప్ రెడ్డి, నర్సారెడ్డి, భాస్కర్ రెడ్డి, ఏఈలు అమరేందర్, రవి, అజయ్, శివకుమార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రుణం వసూలు పై ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు నిర్వాకం. - మహిళా కమిషన్ కు ఫిర్యాదు
.jpeg)
జర్నలిస్ట్ అక్రమ నిర్బంధంపై సీపీకి జర్నలిస్టుల పిర్యాదు

ఆకతాయిలకు అడ్డాగా పిట్టల బస్తి కమ్యూనిటీ హాల్

పర్యావరణ హితమైన సోలార్ ఇందన ఉత్పత్తిపై వినియోగదారులు దృష్టి పెట్టాలి ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ బి. సుదర్శనం

ఘనంగా జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్

సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్ ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు

మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన

ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్

ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు లోక్ దళ్ నేత అర్జున్ సింగ్ చౌతాల మద్ధతు

72 గంటల బిసి రిజర్వేషన్ల దీక్ష ముగించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత
