రుణం వసూలు పై ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు నిర్వాకం. - మహిళా కమిషన్ కు ఫిర్యాదు
అద్దెకు ఉన్నవారిపై దాష్టీకం..బలవంతంగా గెంటివేత
బ్యాంకు దురాగాతాలపై జాతీయ మానవ హక్కుల కమిషను, రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు
సికింద్రాబాద్, ఆగస్ట్ 05 (ప్రజామంటలు) :
ఐడీఎఫ్ సీ బ్యాంకు తమకు బాకీ ఉన్న గృహ రుణాన్ని వసూళు చేసేందుకుగాను ఓనర్ తీసుకున్న రుణంతో సంబందం లేని ఇంట్లో కిరాయికి ఉన్న వారిపై తమ ప్రతాపం చూపెడుతూ… బలవంతంగా ఖాళీ చేయించి దాష్టికానికి ఒడిగట్టిన అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.... సికింద్రాబాద్ సెకండ్ బజార్ లోని 8–-3–-108లో నివాసం ఉండే ఓ వ్యక్తి ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు వద్ద గృహ రుణం తీసుకున్నారు. అయితే ఇంటి యజమాని రుణాన్ని తగిన సమయంలో చెల్లించలేదు. దీంతో ఐడీఎఫ్సీ బ్యాంకు అధికారులు ఇంటి యజమానికి నోటీసులు ఇచ్చి కిరాయికి ఉండే వాళ్లకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
కిరాయిదారులు కోర్టుకు వెళితే తమకు ఇబ్బంది అవుతుందని ఉద్దేశ్య పూర్వకంగా బ్యాంకు అధికారులు వ్యవహరించారు. అయితే జూలై 30వ తేదీన పోలీసు బలగాలతో బ్యాంకు అధికారులు అక్కడికి చేరుకున్నారు. వచ్చి రాగానే యజమాని ఇంటిని సీజ్ చేసి అందులో కిరాయికి ఉన్న వారిపై జులుం ప్రదర్శించారు. 3వ ప్లోర్లో లో ఉండే చెన్నమ్మ అనే మహిళకు రెండు నెలల క్రితం మేజర్ సర్జరీ జరిగి విశ్రాంతి తీసుకుంటుంది. అలాగే 75 ఏళ్ల వృద్ధురాలు కాలుకు ప్రాక్చర్ అయి ఇంట్లోనే ఉంటుంది. కానీ బ్యాంకు అధికారులకు ఇవన్నీ చూపించినా. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని నెత్తినోరు మొత్తుకున్నా తమకు సంబంధం లేదని పట్టించుకోకుండా మార్కెట్ పోలీసులతో బలవంతంగా ఖాళీ చేయించారు.
తమ కూతురు చదువుకుంటుందని పుస్తకాలు ఉన్నాయని చెప్పినా వినకుండా కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటకు పంపించారు. ఇప్పుడు ఇద్దరు పేషంట్లతో ఆ కుటుంబం రోడ్డు మీదకు వచ్చింది. కిరాయికి ఉండే వ్యక్తులకు నోటీసులు ఇవ్వాల్సి ఉన్నా, ఇంటి రుణంతో వాళ్లకు సంబంధం లేదన్నారు. అన్ని నిబంధనలు ఉల్లంఘించి ఇలా కట్టుబట్టలతో పేషంట్లను రోడ్డుపై పడేశారని,గృహ సామాగ్రీని మొత్తం ఇంట్లోనే పెట్టి సీజ్ చేశారని మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన బ్యాంకు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెన్నమ్మ అనే మహిళ జాతీయ మానవ హక్కుల కమిషన్ తో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ కు మంగళవారం ఫిర్యాదు చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేడు ప్రొ.జయశంకర్ సార్ జయంతి

విశ్వాసానికి ప్రతీక శునకం నిఘానేత్రం.

రుణం వసూలు పై ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు నిర్వాకం. - మహిళా కమిషన్ కు ఫిర్యాదు
.jpeg)
జర్నలిస్ట్ అక్రమ నిర్బంధంపై సీపీకి జర్నలిస్టుల పిర్యాదు

ఆకతాయిలకు అడ్డాగా పిట్టల బస్తి కమ్యూనిటీ హాల్

పర్యావరణ హితమైన సోలార్ ఇందన ఉత్పత్తిపై వినియోగదారులు దృష్టి పెట్టాలి ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ బి. సుదర్శనం

ఘనంగా జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్

సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్ ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు

మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన

ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్

ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,
