ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జగిత్యాల ఆగస్టు 4 (ప్రజా మంటలు)
ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.
సోమవారం కలెక్టరెట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్ బి.ఎస్ లత, ఆర్డీఓలతో తో కలిసి స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 43 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
*లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని జిల్లా కలెక్టర్కు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వినతి*
గతంలో ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ అయిన వారికి నిర్మాణం ఆగిపోయిన దశలో తిరిగి వారి కి నూతనంగా ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలవగా జీవన్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల కోసం వారితో కలిసి ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు .ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు ఇప్పించాలని జీవన్ రెడ్డి వినతిపత్రంలో కోరారు.
ప్రజావాణి కార్యక్రమంలో జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి ఆర్డీఓలు మధు సుధన్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్, డి ఆర్ డి ఓ రఘు వరన్, డిపిఓ మధన్ మోహన్, వివిధ జిల్లా అధికారులు, తహసీల్దర్లు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రుణం వసూలు పై ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు నిర్వాకం. - మహిళా కమిషన్ కు ఫిర్యాదు
.jpeg)
జర్నలిస్ట్ అక్రమ నిర్బంధంపై సీపీకి జర్నలిస్టుల పిర్యాదు

ఆకతాయిలకు అడ్డాగా పిట్టల బస్తి కమ్యూనిటీ హాల్

పర్యావరణ హితమైన సోలార్ ఇందన ఉత్పత్తిపై వినియోగదారులు దృష్టి పెట్టాలి ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ బి. సుదర్శనం

ఘనంగా జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్

సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్ ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు

మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన

ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్

ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు లోక్ దళ్ నేత అర్జున్ సింగ్ చౌతాల మద్ధతు

72 గంటల బిసి రిజర్వేషన్ల దీక్ష ముగించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత
