వైద్య ఆరోగ్యశాఖ పదోన్నతులలో అవినీతి అక్రమాలు అవాస్తవం - రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వెంకటేశ్వర్ రెడ్డి
On
సికింద్రాబాద్, ఆగస్ట్ 02 (ప్రజామంటలు):
వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో ఇటీవల జరిగిన పదోన్నతులలో అవినీతి అక్రమాలు జరిగాయని అనడం పూర్తిగా అవాస్తవమని రాష్ర్ట ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం ఐ ఎన్ టి యూ సి 3194 జనరల్ సెక్రటరీ బొందుగుల వెంకటేశ్వర్ రెడ్డి ఖండించారు.
శనివారం ఆయన యూనియన్ రాష్ట్ర నాయకులతో కలసి విలేకరులతో మాట్లాడుతూ.. చాలాకాలంగా వైద్య ఆరోగ్య శాఖలో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ , ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ లకు విన్నవించగా వారు స్పందించి, ఈ సంవత్సరం ఆగస్టు తో ప్యానెల్ ఇయర్ ముగుస్తున్నందున వారు వెంటనే సీనియార్టీ లిస్టులను తయారు చేయించి ప్రస్తుతం ఉన్న ఖాళీలకు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పూర్తి పారదర్శకంగా ఎలాంటి అవినీతి అక్రమాలకు అవకతవకలకు తావు లేకుండా నిబంధన మేరకు ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడం జరిగింది.
ఇది సహించలేని ఒక గుర్తింపు లేని సంఘం నాయకుడు గత పది సంవత్సరాలుగా గత ప్రభుత్వంతో అంట కాగి ప్రస్తుత ప్రభుత్వాన్ని అప్రాతిష్ట పాలు చేసేందుకు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన గుర్తింపు లేని సంఘం ఉద్యోగులు గతంలో వచ్చిన ప్రమోషన్లను తిరస్కరించి మళ్లీ వారి ఇంటి దగ్గరలోనే పనిచేసే స్థానాలు ఉండాలని వారి స్వార్థం కోసం ఈ కౌన్సిలింగ్ ప్రక్రియను బదనాం చేస్తున్నారని ఆయన అన్నారు.
ప్రమోషన్లు పొందిన వారిలో గత నెల జూలై 31న పదవి విరమణ పొందే ఉద్యోగులు ఉన్నందున వారికి ప్రమోషన్లు కల్పించడం జరిగింది అన్నారు. పారదర్శకంగా జరిగిన ఈ పదోన్నతి ప్రక్రియపై అసత్య ఆరోపణలు చేసిన ఉద్యోగుల పైన శాఖపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి అవగాహన లేని సంఘం నాయకుల ప్రకటన వలన పదోన్నతులు అవకాశం ఉన్న ఉద్యోగులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని ఆయన అన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్ ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు
Published On
By Siricilla Rajendar sharma

మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన
Published On
By Siricilla Rajendar sharma

ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్
Published On
By From our Reporter

ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,
Published On
By Siricilla Rajendar sharma

ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు లోక్ దళ్ నేత అర్జున్ సింగ్ చౌతాల మద్ధతు
Published On
By From our Reporter

72 గంటల బిసి రిజర్వేషన్ల దీక్ష ముగించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత
Published On
By From our Reporter

గాంధీలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
Published On
By From our Reporter

ఇది బీసీల ఆత్మగౌరవ పోరాటం - 42% బిసి బిల్లు ఆమోదించాలని దీక్ష - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Published On
By From our Reporter

జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత
Published On
By From our Reporter

రాజకీయ చిక్కులు, ఉపాధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో ప్రధాని మోదీ, అమిత్ షా అధ్యక్షుడు ముర్ము తో భేటీ
Published On
By From our Reporter

బిసి రిజర్వేషన్లకై రేపటి నుండి ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత 3 రోజుల నిరాహార ధీక్ష
Published On
By From our Reporter
