షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు
హైదరాబాద్ జూలై 10(ప్రజా మంటలు)
రామంతపూర్( వెంకట్ రెడ్డి నగర్ )లోని షిర్డీ సాయి మందిరంలో గురువారం ఉదయాత్ పూర్వం నుండి గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా మూలవిరాట్టు దత్తాత్రేయ స్వామి విగ్రహానికి, షిరిడి సాయి విగ్రహానికి స్వహస్తాలతో భక్తులు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు.
. వైదిక క్రతువులను ఆలయ అధ్యక్షులు వాస్తు, జ్యోతిష్య, పురోహితులు మహదేవ్ భట్ల లక్ష్మణ ప్రసాద్ శర్మ నేతృత్వంలో నిర్వహించారు. వైదిక క్రతువులలో మధు నూరి మహాదేవ శర్మ , విటాల మురళీ శర్మ ,రేపాక కళానిధి శర్మ, సిరిసిల్ల రామ శర్మ, రాజేంద్ర శర్మ ఆలయ అర్చకులు మధు రాజేశ్వర శర్మ, సాయి శర్మ తదితరులు పాల్గొని రుద్ర నమక చమకం పురుష,, శ్రీ సూక్తం లతో క్రతువులు కొనసాగించారు. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సహకరించిన దాతలకు ఆశీర్వచనము, ప్రసాదము శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి నామ స్మరణతో ఆలయం అంతా మారుమోగింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు

పేదల కోసం హైడ్రా.. ఓవైసీల కోసం విత్ డ్రా? - ఫాతిమా కాలేజీపై చర్యలేవి?

బీఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు
