నేరాల నివారణ లక్ష్యంగా పని చేయాలి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఇబ్రహీంపట్నం జూలై 4 (ప్రజా మంటలు)
వార్షిక తనిఖీల్లో భాగంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి
వార్షిక తనిఖీ లో భాగంగా శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో భాగంగా ఎస్పి పోలీస్ స్టేషన్ పరిసరాలను, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు అనంతరం సిబ్బందిని శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలని అన్నారు. నేరాల నివారనే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.
విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందును అధికారులు,సిబ్బంది సన్నద్ధంగా ఉండాలి పకడ్బంది గా పని చేయాలని, గ్రామాలలో జరిగే శాంతి భద్రతల అంశాలను ముందస్తు సంచారం సేకరించి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాబోవు రోజులలో కురిసే వర్షాల దృష్ట్యా ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా ప్రణాళికా బద్దంగా పని చేయాలని అన్నారు. వర్షాల ప్రభావం, వరద పరిస్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పర్చాలని సూచించారు.ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకుంటూ ప్రజలకు యువతకు ప్రత్యేకంగా సైబర్ నేరాల నివారణ పై చైతన్యాన్ని తీసుకురావాలని సూచించారు. పోలీస్ స్టేషన్ అధికారులు,సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అన్నారు.
అనంతరం సిబ్బంది తో మాట్లాడుతూ... పోలీస్ స్టేషన్ అంతా పరిశుభ్రంగా గా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి అధికారులకు సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టి కి తీసుకొని రావాలి అని సూచించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పి రాములు ,మెట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ ,ఇబ్రహీంపట్నం ఎస్.ఐ అనిల్, ఎస్.ఐ లు శ్రీకాంత్, రాజు, నవీన్ రాజు నాయక్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆధునిక వైద్య విధాన పద్దతులతో మెరుగైన భోదన

కోరుట్ల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీని కలిసి పూల మొక్క అందజేత

విద్యుత్ అంతరాయాల పట్ల అప్రమత్తంగా లేకపోతే చర్యలు తప్పవు ఎన్పి డిసిఎల్ ఎస్ఈ సుదర్శనం
.jpg)
జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులు

రాష్ర్ట పండుగగా ప్రకటించిన తర్వాతే బోనాల ఉత్సవాలకు పెరిగిన విశిష్టత - ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో ఘనంగా వీర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

నేరాల నివారణ లక్ష్యంగా పని చేయాలి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

మాజీ ముఖ్యమంత్రి కీ"శ కె. రోశయ్య జయంతి ని పురస్కరించుకొని ఘన నివాళి అర్పించిన: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల ఓల్డ్ బస్టాండ్ వద్ద 50 వాహనాల సీజ్ : సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్

సారంగాపూర్ వ్యాయామ ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్

ఆషాడ మాస గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న.. మంత్రి సతీమణి కాంత కుమారి
.jpg)
నేరాల నివారనే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
