మానవత్వం మరిచిన పిన్ని మమత
కోరుట్లలో హృదయ విదారక ఘటన
కోరుట్ల జూలై 07:
ఇటీవల కోట్లలో చోటుచేసుకున్న చిన్నారి హత్య కేసు, జిల్లాను విషాదంలో ముంచింది. కేవలం ఐదు సంవత్సరాల చిన్నారి హితీక్షను ఆమె సొంత "పిన్ని మమత" అత్యంత క్రూరంగా హతమార్చిన దృశ్యం, ప్రతి మనిషి హృదయాన్ని కలిచివేసింది.
పోలీసులు ఈ కేసును, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించగలిగారు., ఆడుకుందామని చెప్పి హితీక్షను బాత్రూంకు తీసుకెళ్లిన పిన్ని మమత, అక్కడే కత్తితో పొడిచి హత్య చేసింది. అనంతరం ఏమీ తెలియనట్టు నటిస్తూ, కుటుంబ సభ్యులతో కలిసి ఏడవడమంటే ఆమె హృదయం ఎంత క్రూరంగా మారిందో చెప్పడానికే మాటలు రావు.
ఈ దారుణానికి తోడికోడలిపై ఉన్న అసూయ, కోపమే కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కుటుంబ సంబంధాలు ప్రేమ పునాది మీద నిర్మించబడ్డవిగా భావిస్తాం. కానీ ఇక్కడ అదే బంధం ప్రాణాలను బలితీసుకున్న విషాదకర ఉదంతంగా మారింది.
ఇలాంటి ఘటనలు సమాజంలోని మానవతా విలువల పతనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మనిషి కోపం, అసూయ, స్వార్థం వల్ల ఎంతటి క్రూరంగా మారగలడో ఈ సంఘటన మరోసారి తేటతెల్లం చేసింది.
చిన్నారుల రక్షణ కోసం మరింత కఠిన చట్టాలు, సామాజిక అవగాహన, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెరగాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఇలాంటి సంఘటనలు మన మనసును కలిచివేస్తున్నా, సామాజికంగా మేలుకోమన్న హెచ్చరికలుగా తీసుకోవాలి.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ చాన్సలర్ భేటి

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం

తండ్రి మరణం.. తల్లి అదృశ్యం... గాంధీలో దైన్యస్థితిలో మూడేండ్ల చిన్నారి

వర్ష కొండ గంగపుత్ర సంఘం లో గణనాథుని సన్నిధిలో అన్న ప్రసాదం
