పేదల కోసం హైడ్రా.. ఓవైసీల కోసం విత్ డ్రా? - ఫాతిమా కాలేజీపై చర్యలేవి?
బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి..
సికింద్రాబాద్ జూలై10 (ప్రజామంటలు):
హైదరాబాద్ లోని సల్కం చెరువులో 40% ఆక్రమించి అక్రమంగా నిర్మించిన ఒవైసీ కి చెందిన ఫాతిమా మహిళా కాలేజీలో 10 వేల మందికి విద్య అందిస్తున్నారని విద్యార్థుల జీవితాలను నాశనం చేయలేమని హైడ్రా కమిషనర్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటని బిజెపి రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి విమర్శించారు. ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు పొంది అప్పు చేసుకొని పేదొల్లు ఇండ్లు కట్టుకుంటే హైడ్రా పేరిట నిరుపేదల ఇళ్లను కూల్చి నిలువ నీడ లేకుండా చేసిన ప్రభుత్వం ఫాతిమా కాలేజీ విషయంలో ఎందుకు స్పందించడం లేదన్నారు. అప్పుడు అనుమతులు ఇచ్చిన అధికారులు ఇప్పుడు అనుమతులు లేవంటూ చట్ట విరుద్ధంగా నిర్మించారంటూ సరికాదన్నారు.బిజెపి నాయకులు ఇట్టి విషయాన్ని గుర్తు చేస్తే ఒవైసీ భజన చేయనిదే బిజెపి వాళ్లకు పొద్దు గడవదు అని కాంగ్రెస్ నాయకులు వెటకారంగ మాట్లాడడం చూస్తే కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ అని మరోసారి రుజువయిందని అన్నారు ఓవైసీ సోదరులు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మేనల్లుళ్లు అవుతారా అంటూ ఎద్దేవా చేశారు.
విద్యా సంవత్సరం మధ్యలో కూల్చలేమని విద్యార్థుల ఇబ్బందులు పడకుండా విద్యా సంవత్సరం ముగిశాక కూల్చేస్తాం అన్న ప్రభుత్వం విద్యాసంవత్సరం పూర్తయినాక ఎందుకు కూల్చలేదని మరి చర్యలు ఎప్పుడు తీసుకుంటారని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని పేదలకు ఒక న్యాయం అక్బరుద్దీన్ కు ఒక న్యాయం తగదని వెంటనే ప్రభుత్వం స్పందించి ఒవైసీకి చెందిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు సరోజినీ. వనజ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
