ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత
బాలికల ఆరోగ్యానికి సంబంధించి పెద్ద సమస్య రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం
- ఐఎం ఏ అధ్యక్షులు డాక్టర్ గూడూరి హేమంత్
-ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి
గొల్లపల్లి జూలై 10 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండల కేంద్రంలోని గురువారం బాలికల ఉన్నత పాఠశాలలో ఐఎంఏ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా వైద్య పరీక్షలు మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూక్ష్మపోషకాల లేమి వల్ల ప్రపంచవ్యాప్తంగా పందొమ్మిదేళ్ల లోపు బాలికలు దాదాపు అయిదుకోట్ల మంది తక్కువ బరువుతో ఉన్నారు. మరో పదికోట్ల మంది రక్తహీనతతో బాధపడుతున్నారని తెలిపారు.
మనదేశంలో 56 శాతం అమ్మాయిలు పోషకాహార లోపం కారణంగా తలెత్తే రక్తహీనత బాధితులు పిల్లలు ఇలా దీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడడం వల్ల వారి విద్య, ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లుతున్నయని ఆవేదన వ్యక్తపరిచారు. ఈపరిస్థితి లింగ సమానత్వానికి ప్రధాన ఆటంకంగా మారుతోంది. ఈ సమస్యల్ని అధిగమిస్తే లక్షలాది బాలికల ప్రాణాలు నిలవడమే కాదు, ఉత్పాదకత 17 శాతం పెరుగుతుందని తెలిపారు.
స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ స్వరూప ఆధ్వర్యంలో విద్యార్థినిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు 36 మంది విద్యార్థినిలకు మందులను ఉచితంగా విద్యార్థులకు శానిటరీ ఫ్యాట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.అనిత, వైద్య సిబ్బంది ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
