ఏకలవ్య భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ జూలై 06:
ట్యాంక్ బండ్ వద్ద ఏకలవ్యుడి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,ఏకలవ్యుడి చిత్రపటానికి నివాళులర్పించారు.
ఎమ్మెల్సీ కవిత ఈసందర్భంగా మాట్లాడుతూ,: ఏకలవ్యుడు భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను
కెసిఆర్ మొదలుపెట్టిన ఏకలవ్యుడు భవన నిర్మాణాన్ని పూర్తి చేయని దారుణ పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది . కెసిఆర్ ఎరుకల ఎంపవర్మెంట్ స్కీంని ప్రవేశపెట్టారు
ఆ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కింది .పలు సందర్భాల్లో నేను శాసనమండలిలో ఈ అంశాన్ని లేవనెత్తాను. అయినా కూడా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం దారుణం.50 వేల ఎరుకల కుటుంబాలకు రూ 60 కోట్ల మేర లబ్ధి చేకూర్చే ఈ పథకాన్ని మరింత మెరుగుపరిచి ప్రభుత్వం యధాతధంగా అమలు చేయాలి
ఎరుకల సామాజిక వర్గ రాజకీయ అభివృద్ధి కోసం కూడా అందరూ కృషి చేయాలి.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సామాజిక వర్గానికి అన్ని పార్టీలు సముచిత అవకాశాలు కల్పించాలి
రూ 500 కోట్లతో తక్షణమే ఎరుకల కార్పొరేషన్ లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కి డిమాండ్ చేస్తున్నాను.బహుజనుల పట్ల ఏ విధంగా అణిచివేత ఉందని చెప్పడానికి ఏకలవ్యుడి జీవితమే ఒక ఉదాహరణ
చరిత్రను నిలబడిపోయే త్యాగం చేసిన ఏకలవ్యుడి అందరికీ స్ఫూర్తి ప్రదాత. సమాజానికి మంచి మార్గం చూపించే ప్రయత్నం చేసి ఆరాధ్య దైవమయ్యారు .బహుజనలకు రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు దక్కాలన్న ఉద్యమంలో పాల్పంచుకోవడం సంతోషంగా ఉంది
రాబోయే రోజుల్లో ఏకలవ్యుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయించుకునే ప్రయత్నం చేద్దామని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు.

హనుమాన్ చాలీసా భక్త బృందం చే హరిహరాలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం

ఏకలవ్య భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

వేములకుర్తి గంగనాల ఆయకట్టకు నీటి విడుదల

కళ్యాణం..కమనీయం.. కన్నులపండువగా శ్రీలక్ష్మీనారాయణ కళ్యాణ వేడుకలు

కాపులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

ఎస్ఎస్ఎస్ ఎం డి .జి స్కూల్లో ఘనంగా గోరింటాకు ఉత్సవము

పద్మారావునగర్ లో సాయి సప్తాహం

ఉత్తమ డాక్టర్లకు మెడికల్ ఎక్సలెన్సీ అవార్డులు *రాజ్ భవన్ లో ప్రధానం చేసిన గవర్నర్

ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి
