మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్
పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి మహిళలు వస్తాం... ఇచ్చిన హామీలపై చర్చిద్దాం
ఏపీలో కలిపిన ఐదు గ్రామాలు వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్
ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ
తెలంగాణ జాగృతిలో చేరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీఐటీయూ కార్యదర్శి వీరన్న
కొత్తగూడెం జూలై 10:
"పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని సీఎం రంకెలు వేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారు. మేం మహిళలు అందరం మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు.
మహిళలకు నెలకు రూ.2,500 ఎందుకు ఇస్తలేరో చర్చ చేద్దాం. కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ కింద తులం బంగారం ఇస్తలేరో, ఎందుకు పింఛన్లు పెంచడం లేదో చర్చిద్దాం" అని స్పష్టం చేశారు.
కొత్తగూడెంలో బుధవారం నిర్వహించిన తెలంగాణ జాగృతి విస్తృత సమావేశంలో సీపీఎం జిల్లా నాయకుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీరన్న తన అనుచరులతో కలిసి ఎమ్మెల్సీ కవిత సమక్షంలో తెలంగాణ జాగృతి లో చేరారు. ఆయనకు తెలంగాణ జాగృతి కండువాను కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.... తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి విస్మరిస్తోందని మండిపడ్డారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 42 శాతం రిజర్వేషన్లు సాధకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి ఈ నెల 17వ తేదీన రైల్ రోకో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ జాగృతిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతపరుస్తున్నామని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అనడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని, సంపూర్ణ రైతురుణమాఫీ కాలేదనీ, ప్రజా సమస్యలపై చర్చకు రమ్మంటే సీఎం పారిపోయారని మండిపడ్డారు.ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తామని రేవంత్ రెడ్డి మాట తప్పారని తెలిపారు.
సింగరేణిని రేవంత్ రెడ్డి పట్టించుకోవడంలేదనీ, సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు రావడం లేదని ప్రస్తావించారు. సింగరేణి బొగ్గు గనులను ప్రయివేటుపరం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి,అసమర్థ ముఖ్యమంత్రి అనే బిరుదు ఇచ్చామని చెప్పారు. మహిళల పక్షాన జాగృతి పోరాటం చేస్తుందనీ స్పష్టం చేశారు.
"కొత్తగూడెం జిల్లా అంటే పరిశ్రమలు ఉండే జిల్లా. ఐటీసీలో కాలుష్యం లేకుండా పరిశ్రమ యాజమాన్యం దృష్టి సారించాలి. స్పాంజ్ ఐరన్ కర్మాగారాన్ని పునరుద్ధరణ చేయాలి." అని డిమాండ్ చేశారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో తిరిగి కలపాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు.
"భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామ పంచాయతీలు ఆందోళనలో ఉన్నాయి. భద్రాచలం రాముడి భూములు పురుషోత్తపట్నంలో ఉన్నాయి.ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చొరవ తీసుకోవాలి. తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు తుమ్మల ఐదు గ్రామ పంచాయతీలపై లెటర్ ఇచ్చారు. పురుషోత్తపట్నంలో ఉన్న రాముడి భూములను చూడటానికి వెళ్లిన రామాలయం ఈవోపై దాడి చేశారు. భద్రాచల రాముడు తెలంగాణ దేవుడు." అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆడబిడ్డ,బీసీ బిడ్డ భద్రాచలం రామాలయం ఈవో రమాదేవిపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు ప్రకటించారు. సీతారామ ఎత్తిపోతల పథకం పనులు కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనే 70 శాతం పూర్తయ్యాయని.. మిగతా పనులు పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
