ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్
(గొల్లపల్లి ధర్మపురి ) జూలై 05 (ప్రజా మంటలు):
జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శనివారం ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి, ప్రమాదకర స్థితిలో ఉన్న తరగతి గదులను తక్షణమే కూల్చి వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తరువాత సానిటేషన్ అంశంపై అధికారులతో సమీక్షించారు. డ్రైనేజీ,కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచి పరిశుభ్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉండటంతో గోదావరి తీర ప్రాంతాన్ని పరిశీలించి,లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.తరువాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు.అనంతరం మున్సిపల్ అధికారులు నిర్వహించిన వనమహోత్సవంలో పాల్గొని స్వయంగా చెట్లు నాటారు.
ధర్మపురి కేంద్రంలో స్వయం ఉపాధితో అగరత్తులు తయారు చేస్తున్న వారిని కలసి,తయారీ విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు.వారిని ప్రోత్సహిస్తూ మరింత పరిమాణంలో ఉత్పత్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మరియు ఇన్చార్జ్ తహసిల్దార్,మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు
