నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు
సికింద్రాబాద్ జులై 10 (ప్రజామంటలు):
కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేస్తున్న హిందీ అధికారిక భాషా విభాగం 50ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధికారిక భాషా విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ మీనాక్షీ జాలీ తెలిపారు.ఈ మేరకు సికింద్రాబాద్ కవాడీగూడలోని సీజీఓ టవర్స్లో ఆమె శుక్రవారం మీడియాకు వివరాలు వెలడించారు. అధికార భాషా విభాగాన్ని 1975 జూన్ 26న ఏర్పాటు చేశామని, ఈ యేడాదితో 50 ఏళ్లు పూర్తయ్యాయని చెప్పారు. ఈ సందర్బంగా గతనెల 26న ఢిల్లీలో గోల్డెన్జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించామన్నారు.
దీనికి తరువాత భాగంగా దక్షిణ్ సంవాద్’’ వేడుకల పరంపరలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో రెండోసారి ఉత్సవాలునిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆమె వివరించారు.దక్షిణ భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు, స్కాలర్లు, భాష పట్ల ఉత్సాహం కనబరచే వారు పెద్ద సంఖ్యలో హాజరు అవుతారని,వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటకలతో పాటు పుదుచ్చేరీకి చెందిన వారు ఉంటారని ఆమె చెప్పారు.
స్వర్ణోత్సవ సంవత్సరం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల విజేతలను ఈ వేడుకలో సత్కరించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాదులోని పత్రిక సమాచార కార్యాలయం అడిషనల్ డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ ఈ మీడియా సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సమావేశంలో తమిళనాడు,కేరళ, కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని ఆయా భాషల్లో ప్రసంగించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
