టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా డా.కోట నీలిమ నియామకం
హైదరాబాద్ కాంగ్రెస్ బలోపేతానికి నూతన ఉత్సాహం
సికింద్రాబాద్ జూన్ 10 (ప్రజామంటలు):
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)లో ప్రముఖ రచయిత, విధాన పరిశోధకురాలు డాక్టర్ కోట నీలిమను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియామకం ద్వారా హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని మరింతగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.ఇటీవలి వరకు టీపీసీసీ జనరల్ సెక్రటరీగా, సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గా సేవలందించిన డాక్టర్ నీలిమ ప్రజాకేంద్రీకృత కార్యక్రమాలతో, పారదర్శక రాజకీయ సంభాషణకు, సామాజిక న్యాయం, సమానత్వం మరియు లౌకికతకు విశేష ప్రాధాన్యం ఇస్తూ పనిచేశారు. ప్రజల కోసం పాలనలో పాల్గొనడానికి అవకాశాలు కల్పిస్తూ, సమాజ సమస్యల పరిష్కారంలో తన ప్రత్యేక ముద్రవేశారు."న్యాయం మరియు సమానత్వం కలిగిన సమాజాన్ని నిర్మించాలనే సిద్ధాంతానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఈ దిశగా మరింత సేవ చేసేందుకు నాకు ఈ అవకాశం లభించటం గర్వంగా ఉంది" అని డాక్టర్ నీలిమ పేర్కొన్నారు. అలాగే పార్టీ నాయకత్వానికి, సహచరులకు, తన అనుచరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. "ఈ గుర్తింపు నాది మాత్రమే కాదు , తన పక్కన ఉన్న ప్రతి ఒక్కరికి చెందుతుంది. తెలంగాణ ప్రజలకు న్యాయం, గౌరవం, సత్యంపై ఆధారపడిన రాజకీయం కోసం నేను ఇంకా సమర్పితంగా పనిచేస్తాను" అని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు

పుప్పాల గూడ భూములపై విచారణకు లోకాయుక్త ఆదేశం

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత

న్యూ ఢిల్లీలో లండన్ వెళ్లాల్సిన విమానం నిలిపివేత - ఆందోళనలో ప్రయాణికులు

పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్

జర్నలిస్టు సంఘ నాయకులను సన్మానించిన ఐఎంఏ వైద్యులు
