ధర్మపురి క్షేత్రంలో వైభవంగా నాగ పంచమి వేడుకలు
On
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి జూలై 28:
ధర్మపురి క్షేత్రంలో శ్రావణ శుద్ధ పంచమి (నాగుల పంచమి) పర్వ దినాన్ని పురస్కరించు కుని వేడుకలను మంగళ వారం ఘనంగా నిర్వహించారు. క్షేత్ర పరంపరానుగత ఆచరణలో భాగంగా వివిధ ప్రదేశాలలో నాగదేవతలను, ఇష్ట కామ్య సాఫల్యానికై పూజించారు. శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన అనుబంధమైన శ్రీరామలింగేశ్వర ఆలయంలో దేవస్థానం వేద పండితులు పాలెపు ప్రవీణ్ శర్మ, దేవళ్ల విశ్వనాథ శర్మల ఆచార్యత్వంలో, ప్రతిష్ఠిత నాగదేవతకు,
ఆవుపాలతో అభిషేకించి, సర్పసూక్త యుక్త నాగదేవతా శోడషోపచార పూజలు అభిషేక, హారతి, మంత్ర పుష్పాలు సాంప్రదాయక కార్యక్రమాలను నిర్వహించారు.
పట్టణంలోని నంది విగ్రహ కూడలి వద్ద ప్రతిష్ఠిత మైన, 1979లో ధర్మపురి దానకర్ణులు కొరిడె సదాశివ శర్మ దంపతులచే పునరుద్ధరింప బడిన నంది విగ్రహ సమీపస్థ నాగమయ్య కు కొరిడే రఘునాథ్ గురూజీ, చంద్రశేఖర్ శర్మ వేదవిదులు ప్రత్యేక పూజాదులను నిర్వహించారు.
వివిధ వాడలలోగల శివ పంచాయతనాలలో, నిరాహార యుక్తంగా, సాంప్రదాయ పద్ధతిలో నిర్మల మనస్కులైన, నూతన వస్త్ర ధారిణులైన ముత్తయిదువలు అకాల మృత్యు నివారణార్ధం, సంతానార్థం మరియు సంతాన క్షేమార్ధం భక్తి శ్రద్ధలతో పూజలు జరిపి, ప్రత్యేక ప్రార్ధనలు గావించి, చలిమిడి, వడ పప్పు, నువ్వుల పిండి, పండ్లు, పాలు ఆది నైవేద్యాలను సమర్పించు కున్నారు.
క్షేత్ర శివారులలోగల అక్కపెల్లి రాజేశ్వర ఆలయ సమీప పుట్టలలో పాలు పోసి, నాగదేవతలకు కైమోడ్పు లిడి ప్రార్థనలు చేశారు. అలాగే క్షేత్ర సమీపస్థ శ్రీ అక్కపెల్లి రాజేశ్వరాలయంలో నాగుల పంచమి వేడుకలలో భాగంగా, దేవస్థానం ఆధ్వర్యంలో అర్చకులు బూస ప్రవీణ్ కుమార్ లు ప్రత్యేక పూజలు గావించారు. మహిళలు వాహనాలలో, కాలినడకన వెళ్లి పుట్టలో పాలు పోసుకుని, నాగదేవతకు ప్రార్ధనలు జరిపారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ
Published On
By Siricilla Rajendar sharma

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ
Published On
By Siricilla Rajendar sharma
.jpg)
రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత
Published On
By From our Reporter
.jpeg)
ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు
Published On
By From our Reporter

మైనర్ బాలికపై అత్యాచారం కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష
Published On
By From our Reporter

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం
Published On
By From our Reporter

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి
Published On
By From our Reporter

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
Published On
By From our Reporter

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికు సన్మానం.
Published On
By From our Reporter

భక్తి శ్రద్దలతో.సికింద్రాబాద్ ప్రాంతంలో నాగుల పంచమి
Published On
By From our Reporter

నూతనంగా ఎన్నికైన,జిల్లా జర్నలిస్టుల సంఘం( టి యు డబ్ల్యు జె ఐజేయు), జిల్లాపాఠశాల విద్యాశాఖ ఫోరం, కోశాధికారి, కార్యదర్శికి బ్రాహ్మణ సంఘం సత్కారం
Published On
By Siricilla Rajendar sharma
