ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు మీడియా మిత్రులు
జగిత్యాల జూలై 28 (ప్రజా మంటలు)
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులు మీడియా మిత్రులు అని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు.
ఇటీవల జరిగిన జగిత్యాల జిల్లా జర్నలిస్టుల సంఘం TUWJ (IJU) నూతన కార్యవర్గాన్ని సోమవారం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు
అధ్యక్షులగా నూతనంగా ఎన్నికైన చీటి శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి సంపూర్ణ చారీ, కోశాధికారి సిరిసిల్ల వేణు, ఉపాధ్యక్షులుగా గడ్డల హరికృష్ణ, హైదర్ అలీ, సహాయ కార్యదర్శి చింత నరేష్ ,ఈసీ మెంబర్లుగా స0 భు రాజిరెడ్డి ,గొల్లపల్లి మనోజ్, శ్రీ పేరంబదూరు శ్రీకాంత్ తదితరులను సన్మానించిన బి ఆర్ యస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్
కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రజల సమస్యలను ప్రతిపక్ష పార్టీ లు ఎత్తి చూపుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసే విధంగా పత్రికల్లో, మీడియా ద్వారా తెలుపుతున్న మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము అన్నారు
.. ఎవరికీ భయపడకుండా ఎవరు తప్పు చేసిన అధికార పక్షమైన, ప్రతిపక్షమైన వార్తలు ప్రచురించడం... మరియు కోరుట్ల నియోజకవర్గం లో ప్రెస్ వారికి దాదాపు అందరికి ఇంటి నివాస స్థలాలు, ఇండ్లు ఇప్పించడం జరిగిందని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించడానికి ప్రభుత్వం ఫై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు.. బి ఆర్ యస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి జగిత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని పేర్కొన్నారు..
దావ వసంత సురేష్ మాట్లాడుతూ...
ప్రజలను, ప్రభుత్వాన్ని వార్తల ద్వారా చైతన్యవంతం చేసేది జర్నలిస్టులు మాత్రమే అని
అధికార పార్టీ చేసే తప్పోప్పులను ప్రజలు, ప్రతి పక్ష పార్టీలు లెవెనేత్తే సమస్యలను ఎల్లవేళలా ప్రపంచానికి తెలుసేలా చేరవేస్తున్న జర్నలిస్టులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. జర్నలిస్ట్ ల సమస్యల పట్ల బి ఆర్ యస్ పార్టీ పక్షాన అండగా ఉంటామని,
ప్రజాస్వామ్యనికి నాలుగవ స్తంభమైన మీడియా ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా వార్తలు అందజేయడం వల్లనే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని పేర్కొన్నారు..
ఈ కార్యక్రమం లో అల్లాల ఆనంద్ రావు, వొళ్లెం మల్లేశం,అవారి శివాకేసరి బాబు, దయాల మల్ల రెడ్డి,సంగెపు మహేష్, తెలు రాజు, ఆయిల్నేని ఆనంద్ రావు, తుమ్మ గంగాధర్, గాజుల శ్రీనివాస్, నీలి ప్రతాప్,సన్నిత్ రావు,భగవాన్, ముత్తయ్య,సాగి సత్యం రావు, ఆయిల్నేని వెంకటేశ్వర్ రావు, వేణుమాధవ్, కృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ చైతన్య స్కూల్‌లో అధికార ప్రదానోత్సవం

సహకార ఎఫ్ పి వో ల సమీక్ష సమావేశం

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు మీడియా మిత్రులు

నాగ పంచమి పుట్టలో పాలు పోసి పాములను పూజించడం విశేషం ..

ఈయూ అమెరికా 15% సుంకాల ఒప్పందం - తొలిగిన అనుమానాలు
.jpg)
సాంకేతిక లోపంతో టెక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కిందకు దిగిన ఎయిర్ ఇండియా విమానం - ప్రయాణికులు సురక్షితం

శ్రీరేణుకా ఎల్లమ్మ టెంపుల్ లో ఘనంగా పలహారబండి ఊరేగింపు

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి అదనపు కలెక్టర్ బి. ఎస్. లత.

తప్పిపోయిన వృద్ధ మహిళను క్షేమంగా బంధువులకు అప్పగించిన ధర్మపురి పోలీసులు

సల్లూరి మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల

మునిసిపాలిటీ పరిధిలోని సీసీ రోడ్డు మరియు డ్రైనేజీల పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

జగిత్యాల జిల్లాలో జిపిఓ గ్రామ పాలనాధికారి మరియు లైసెన్స్ ల్యాండ్ సర్వేర్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.
