విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి
విద్యార్థులకు ఆహార పదార్థాలు సమయానికి అందించాలి.
- మారేడ్పల్లి గర్ల్స్ హైస్కూల్ ను సందర్శించిన కలెక్టర్ హరిచందన
సికింద్రాబాద్, జూలై 29(ప్రజామంటలు) :
విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సంబంధిత ఉపాధ్యాయులను ఆదేశించారు.మంగళవారం సికింద్రాబాద్ మారేడుపల్లి లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందాలని ముఖ్యంగా డిజిటల్ విద్యాబోధనపై విద్యార్థులకు ఎక్కువ మక్కువ కలిగే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె సూచించారు. గత సంవత్సరం పదో తరగతిలో పదిమందికి పైగా విద్యార్థులు అత్యధిక మార్కుల సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు.ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో నూటికి నూరు శాతం ఫలితాలు వచ్చే విధంగా విద్యార్థులకు ప్రత్యేక బోధన అందించాలని సూచించారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఆ దిశగా విద్య బోధన ఉండాలని ఆమె సూచించారు. పాఠశాలలోని వివిధ సబ్జెక్టులలో వెనుకంజలో ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు యూనిఫామ్స్ టెస్ట్ బుక్స్, నోట్ బుక్స్ సమయానికి అందించారా అన్న విషయంతో పాటు విద్యార్థుల సంఖ్య తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం లో భాగంగా విద్యార్థులకు మెనూ ప్రకారం సరైన సమయానికి ఆహార పదార్థాలు అందించాలని ఆమె సూచించారు. అదే ప్రాంగణంలో ఉన్న ఇంటర్ కళాశాల, ప్రీ ప్రైమరీ పాఠశాలలో వసతులు, అందుతున్న విద్య బోధన పై సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం అందించే ఆహార పదార్థాలను పరిశీలించారు. జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, హెచ్ఎం మోహన్ ఆచారి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ
.jpg)
రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత
.jpeg)
ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికు సన్మానం.

భక్తి శ్రద్దలతో.సికింద్రాబాద్ ప్రాంతంలో నాగుల పంచమి

నూతనంగా ఎన్నికైన,జిల్లా జర్నలిస్టుల సంఘం( టి యు డబ్ల్యు జె ఐజేయు), జిల్లాపాఠశాల విద్యాశాఖ ఫోరం, కోశాధికారి, కార్యదర్శికి బ్రాహ్మణ సంఘం సత్కారం
