ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ
జగిత్యాల జులై 29 (ప్రజా మంటలు)
ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల జగిత్యాల 60 వసంతాల వేడుకలకు రాబోతున్న తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎల్ రమణ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్
శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాల ఏర్పడి 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కళాశాల పూర్వ విద్యార్థులుగా జగిత్యాల ఎమ్మెల్సీ ఎల్ రమణ ఎమ్మెల్యే ఎం సంజయ్ సంజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని హైదరాబాదులో కలిసి కళాశాల 60 సంవత్సరాల వసంతోత్సవానికి ఆహ్వానించారు.
. ఈ కళాశాలకు ఉన్నటువంటి గొప్ప చరిత్రను గత 60 సంవత్సరాలుగా స్థానిక పేద బడుగు వర్గాల విద్యార్థినీ విద్యార్థులకు విద్య దానం చేసి ఎంతో గొప్ప మహనీయులను తయారు చేసిందని ముఖ్యమంత్రి కి వివరించారు. కళాశాల ఏర్పడినప్పుడు ప్రిన్సిపాల్ గా గొప్ప విద్యావేత్త డాక్టర్ కొండలరావు ఈ కళాశాలను ప్రారంభించారని తెలిపారు. ఈ కళాశాలలో విద్యను అభ్యసించి పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో అనేక రంగాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని వైస్ ఛాన్స్లర్గా ,విద్యావేత్తలుగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, డాక్టర్లుగా ,రాజకీయ నాయకులుగా, డాక్టర్లుగా, పరిశోధకులుగా, విద్యావేత్తలుగా, కవులుగా వ్యాపారవేత్తలుగా, ఎదిగారని అనేక రంగాల్లో రంగాల్లో ఉన్నారని తెలిపారు .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ నెలలో జరగబోయే కళాశాల 60 వసంతాల ఉత్సవాలకు ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి ని ఆహ్వానిం చామని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చాలా ఆనందం వ్యక్తం చేసి సానుకూలంగా స్పందిస్తూ 60 వసంతాల వేడుకలకు తాను వస్తానని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల కావలసిన మహిళ వసతిగృహం, పురుషుల వసతిగృహం , మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ నూతన కోర్సులను నివేదిక ప్రవేశపెట్టుటకు ముఖ్యమంత్రి కి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు అని తెలిపారు . ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య అరిగెల అశోక్ మాట్లాడుతూ కళాశాల త్వరలో నిర్వహించుకోబోయే కళాశాల 60 వసంతాల లకు రాష్ట్ర ముఖ్యమంత్రి రాబోతున్నందున హర్షం వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కళాశాల అభివృద్ధికై కృషి చేస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్సీ గార్లకు కళాశాల సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ
.jpg)
రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత
.jpeg)
ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికు సన్మానం.

భక్తి శ్రద్దలతో.సికింద్రాబాద్ ప్రాంతంలో నాగుల పంచమి

నూతనంగా ఎన్నికైన,జిల్లా జర్నలిస్టుల సంఘం( టి యు డబ్ల్యు జె ఐజేయు), జిల్లాపాఠశాల విద్యాశాఖ ఫోరం, కోశాధికారి, కార్యదర్శికి బ్రాహ్మణ సంఘం సత్కారం
