సహకార ఎఫ్ పి వో ల సమీక్ష సమావేశం
.
జగిత్యాల జులై 28(ప్రజా మంటలు)
జిల్లాలో ఎఫ్.పి.వో ( ఫుడ్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్) లు గా ఎంపికైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా సహకార అధికారి సి హెచ్. మనోజ్ కుమార్ ఎఫ్ పి వో ల ఏర్పాటు ఉద్దేశాలను వివరించారు.
జాతీయ సహకార అభివృద్ధి మండలి ( ఎన్ సి డి సి) రాష్ట్రం లో సహకార సంఘాల ను ఎఫ్ పి వో లుగా అభివృద్ధి చేసే దిశగా నిర్వహణ నిధులను విడుదల చేసిందని తెలిపారు. ఎఫ్ పి వో సంఘాలు తమ తమ సంఘాల పరిధి లో వివిధ ఆహార ధాన్యాలు, ఉత్పత్తులను ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు.
జిల్లా లో వ్యవసాయం ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ దిశగా సంఘాలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ కాకతీయ సహకార శిక్షణ సంస్థ అధ్యాపకుడు వెంకటేశ్వర్లు ఎఫ్ పి వో లకు మార్గ నిర్దేశం చేశారు. కార్యక్రమం లో సహకార శాఖ అధికారులు సుజాత, అసద్, నిజామొద్దిన్, సహకార సంఘాల కార్యదర్శులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ చైతన్య స్కూల్‌లో అధికార ప్రదానోత్సవం

సహకార ఎఫ్ పి వో ల సమీక్ష సమావేశం

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు మీడియా మిత్రులు

నాగ పంచమి పుట్టలో పాలు పోసి పాములను పూజించడం విశేషం ..

ఈయూ అమెరికా 15% సుంకాల ఒప్పందం - తొలిగిన అనుమానాలు
.jpg)
సాంకేతిక లోపంతో టెక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కిందకు దిగిన ఎయిర్ ఇండియా విమానం - ప్రయాణికులు సురక్షితం

శ్రీరేణుకా ఎల్లమ్మ టెంపుల్ లో ఘనంగా పలహారబండి ఊరేగింపు

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి అదనపు కలెక్టర్ బి. ఎస్. లత.

తప్పిపోయిన వృద్ధ మహిళను క్షేమంగా బంధువులకు అప్పగించిన ధర్మపురి పోలీసులు

సల్లూరి మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల

మునిసిపాలిటీ పరిధిలోని సీసీ రోడ్డు మరియు డ్రైనేజీల పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

జగిత్యాల జిల్లాలో జిపిఓ గ్రామ పాలనాధికారి మరియు లైసెన్స్ ల్యాండ్ సర్వేర్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.
